“Harikatha” Trailer Released – Web Series to Stream from December 13
Disney Plus Hotstar, known for providing fresh and engaging content to OTT audiences, is set to launch a new web series titled Harikatha – Sambhavami Yuge Yuge. The series will be streamed under the Hotstar Specials banner. Produced by TG Vishwaprasad under the People Media Factory banner, Harikatha is directed by Maggi.
The series features an ensemble cast, including Divi, Pujitha Ponnada, Rajendra Prasad, Sriram, Mounika Reddy, Arjun Ambati, Ruchira Sadhineni, Shriya Kottam, Usha Sri, and others in key roles. The series will be available for streaming starting December 13, with the trailer released today.
In Harikatha, the story draws inspiration from Lord Krishna’s teachings in the Bhagavad Gita, where he states that he will reincarnate to restore righteousness whenever it is threatened by unrighteousness. The series explores a unique narrative where a mysterious figure, embodying various avatars of Lord Vishnu—such as Parashurama, Narasimha, and Vamana—punishes criminals in a village.
The police launch an investigation to uncover the identity of this figure and the motive behind the killings. The trailer presents an intriguing investigative crime thriller with a mythological twist. Rajendra Prasad plays a theatrical actor portraying God in plays, while Sriram takes on the role of the investigating police officer. The Harikatha trailer has garnered attention for its engaging premise, blending crime thriller elements with mythology.
Cast: Divi, Pujitha Ponnada, Rajendra Prasad, Sriram, Mounika Reddy, Arjun Ambati, Ruchira Sadhineni, Shriya Kottam, Usha Sri, and others.
Technical Team:
- Art: Kiran Mangodi
- Editor: Junaid Siddiqui
- DOP: Vijay Ulaganath
- Music Director: Suresh Bobbili
- Writer: Suresh Jai
- Executive Producers: Rammohan Reddy, Sujith Kumar Chowdhury Kolli, Shashikiran Narayana
- PRO: GSK Media (Suresh – Sreenivas)
- Co-Producer: Vivek Kuchibotla
- Producer: TG Vishwaprasad
- Direction: Maggi
డిస్నీ హాట్ స్టార్ స్పెషల్స్ “హరికథ” ట్రైలర్ విడుదల, డిసెంబర్ 13నుంచి స్ట్రీమింగ్ కానున్న వెబ్ సిరీస్
సరికొత్త కంటెంట్ ను ఎప్పటికప్పుడు ఓటీటీ లవర్స్ కు అందిస్తోన్న డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ “హరికథ” అనే మరో సరికొత్త వెబ్ సిరీస్ ను తీసుకొస్తోంది. హాట్ స్టార్ స్పెషల్స్ గా ఈ సిరీస్ స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ వెబ్ సిరీస్ ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. మ్యాగీ “హరికథ” సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నారు. దివి, పూజిత పొన్నాడ, రాజేంద్రప్రసాద్, శ్రీరామ్, మౌనిక రెడ్డి, అర్జున్ అంబటి, రుచిర సాధినేని, శ్రియా కొట్టం, ఉషా శ్రీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డిసెంబర్ 13 నుంచి “హరికథ” వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ రోజు “హరికథ” సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు.
ధర్మం నశించి, అధర్మం పెరిగినప్పుడు తాను మళ్లీ పుడతానని, ధర్మాన్ని స్థాపిస్తానని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లు..పరశురాముడు, నరసింహుడు, వామనమూర్తి..ఇలా శ్రీవిష్ణు అవతారాల రూపంలో ఊరిలో నేరస్తులను శిక్షిస్తుంటాడో అపరిచిత వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరు ?, ఈ హత్యలు ఎందుకు చేస్తున్నాడు? అనే కోణంలో పోలీసుల ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. ఈ విచారణలో పోలీస్ ఆఫీసర్ కు ఎదురైన ఘటనలు ఏంటి? అనేది ఆసక్తికరంగా ట్రైలర్ లో చూపించారు. నాటకాల్లో దేవుడి పాత్రలు పోషించే నటుడిగా రాజేంద్రప్రసాద్ కనిపించగా..పోలీస్ ఆఫీసర్ గా శ్రీరామ్ నటించారు. మైథాలజీ టచ్ తో ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ గా సాగిన “హరికథ” ట్రైలర్ ఆకట్టుకుంటోంది.
నటీనటులు – దివి, పూజిత పొన్నాడ, రాజేంద్రప్రసాద్, శ్రీరామ్, మౌనిక రెడ్డి, అర్జున్ అంబటి, రుచిర సాధినేని, శ్రియా కొట్టం, ఉషా శ్రీ తదితరులు
టెక్నికల్ టీమ్
ఆర్ట్ – కిరణ్ మామిడి
ఎడిటర్ – జునైద్ సిద్ధిఖీ
డీవోపీ – విజయ్ ఉలగనాథ్
మ్యూజిక్ డైరెక్టర్ – సురేష్ బొబ్బిలి
రైటర్ – సురేష్ జై
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ – రామ్మోహన్ రెడ్డి, సుజిత్ కుమార్ చౌదరి కొల్లి, శశికిరణ్ నారాయణ
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
కో ప్రొడ్యూసర్ – వివేక్ కూఛిబొట్ల
ప్రొడ్యూసర్ – టీజీ విశ్వప్రసాద్
డైరెక్షన్ – మ్యాగీ