
Gowri.. Oo Kanupaapa Katha Movie Shooting in Final Leg
JDS క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న గౌరీ …. ఓ కనుపాప కథ.. చిత్రం షూటింగ్ దాదాపు పూర్తికావచ్చినది.
ఈ చిత్రంలో గౌరీ ప్రధాన పాత్ర పోషిస్తున్న కాత్య పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్. గొప్ప మెసేజ్ ఓరియంటెడ్ సినిమాగా రూపొందింది .
దర్శకుడు మోహన్ మాట్లాడుతూ…
గౌరీ పాత్రలో కాత్య చక్కగా నటిస్తూ అందరిని ఆకట్టుకునేలా చేసింది. ఈ పాత్ర చిత్రంలో చాలా ఉన్నతమైన పాత్ర. కాత్య లుక్, హావభావాలు పలికించడంలో అద్భుత నటన ప్రదర్శించింది. అందుకే చాలామందిలో ఏరి కోరి కాత్యా ను గౌరీ పాత్రకు సెలెక్ట్ చేసుకున్నాము.
నేత్రదానం ఎంత ముఖ్యమో ఈ చిత్రం ద్వారా తెలియజేయబోతున్నాము. అక్క, తమ్ముళ్ల మధ్య ఉండే అనుబంధం ఈ చిత్రం ద్వారా సరికొత్త కోణంలో చూపించబోతున్నాము.
తమ్ముడి పాత్రలో దక్షిత్ రెడ్డి చాలా అద్భుతంగా నటించాడు. ఈ చిత్రములో ఎవరూ ఊహించని క్లైమాక్స్ ను ప్రేక్షకులు చూడబోతున్నారు.
ఈ సినిమా ద్వారా సంగీత దర్శకుడిగా సువర్ణ మధుసూదనరావు ను, పాటల రచయితలుగా కొర్రపాటి పసుపులేటి బ్రదర్స్ ను కొత్తగా పరిచయం చేస్తున్నాము.
ఈ చిత్రంలో సందర్భానుసారంగా వచ్చే రెండు చక్కటి పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.
ఈ చిత్రానికి చాయాగ్రాహుడిగా బళ్లారి రఘు చేస్తున్నారు.
ఈ చిత్రం నవంబర్ లో గానీ డిసెంబర్ లో గాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము.
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, నిర్మాత, దర్శకత్వం K. మోహన్

