Haiku Trailer Embellishes the Feel-Good Rom-Com with Heartwarming Emotions and

Spy Action Thriller G2 Release Date Confirmed
అడివి శేష్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ ఫిబ్రవరి 5, 2027న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్
వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రం, ఫస్ట్ పార్ట్ గూఢచారి సక్సెస్‌ను బేస్‌గా తీసుకుని అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తున్నారు ఇండియన్ సినిమాలో స్పై థ్రిల్లర్ జానర్ ని రీడిఫైన్ చేయనుంది.
ఈసారి ఏజెంట్ 116గా వామికా గబ్బి ఎంట్రీ ఇస్తోంది. యాక్షన్‌తో పాటు ఎమోషన్ వున్న క్యారెక్టర్ ఇది. ఈ మూవీలో ఇమ్రాన్ హష్మీ పవర్ ఫుల్ పాత్ర పోషిస్తున్నారు. మురళీ శర్మ, సుప్రియా యార్లగడ్డ, మధు శాలిని కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై టి.జి. విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాని భారీగా నిర్మిస్తున్నారు. తెలుగు తో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియాగా రిలీజ్ కానుంది.
పవర్ఫుల్ క్యాస్ట్, అంతర్జాతీయ స్థాయి ప్రొడక్షన్, గ్రాండ్ విజన్‌తో G2, 2027లో మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులని అలరించనుంది.
