
Beauty teaser unleashed – Grand Release on 19th September
Vanara Celluloid, Zee Studios, and Maruthi Team Product present the emotionally compelling and heartwarming teaser for their upcoming film Beauty. This intimate tale explores the intertwining of youthful romance and the cherished bond between father and daughter, all set against the backdrop of middle-class life.
Featuring Ankith Koyya and Nilakhi Patra, Beauty is directed by JSS Vardhan, acclaimed for his work in Geetha Subramanyam and Hello World, with production helmed by Adidhala Vijayapal Reddy and Umesh Kumar Bansal. The film’s screenplay and story, penned by R V Subrahmanyam.
The teaser introduces the main female character and shows the warmth and deep feelings in the family. It also includes light moments of humor that reflect everyday middle-class life, making the characters feel real and relatable.
As the teaser goes on, the mood becomes more serious and shows hints of struggles and problems the characters will face. It ends by focusing on the love, sacrifices, and determination of parents, bringing out the emotional heart of the film.
Beautiful visuals and music by Vijay Bulganin, along with cinematography by Shrie Sai Kumaar Daara, add to the experience. Ankith Koyya gives a strong performance, and Nilakhi Patra shines as the lead actress. The film also features well-known actors like Naresh, Vasuki, Nanda Gopal, Sonia Chowdhary, Nithin Prasanna, Murali Goud, and Prasad Behara.
Post-production is complete, and Beauty will be released in theaters on September 19th. The film promises to be one of the most touching movies this year, celebrating love, family, and strength.
*ఎమోషనల్‌గా కట్టి పడేసే ‘బ్యూటీ’ టీజర్.. సెప్టెంబర్ 19న గ్రాండ్ రిలీజ్*
మంచి యూత్ ఫుల్ లవ్ స్టోరీకి, ఫాదర్ ఎమోషన్, మిడిల్ క్లాస్ టచ్ ఇస్తే ఎలా ఉంటుందో ‘బ్యూటీ’ సినిమా చూపించబోతోంది. అంకిత్ కొయ్య, నీలఖి జంటగా వానరా సెల్యూలాయిడ్, మారుతీ టీం ప్రొడక్ట్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘బ్యూటీ’. గీతా సుబ్రమణ్యం, హలో వరల్డ్, భలే ఉన్నాడే ఫేమ్ జె.ఎస్.ఎస్. వర్ధన్ మాటలు, దర్శకత్వం వహించిన ‘బ్యూటీ’ చిత్రాన్ని అడిదాల విజయపాల్ రెడ్డి, ఉమేష్ కుమార్ బన్సాల్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లేని ఆర్.వి. సుబ్రహ్మణ్యం అందించారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు, గ్లింప్స్, పాటలు ఇలా అన్నీ కూడా అంచనాలు పెంచేశాయి.
తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. ‘కన్నా మన పేరెంట్స్‌కి మన మీద ప్రపంచాన్నే కొనిచ్చేయాలన్నంత ప్రేమ ఉంటుంది’ అనే డైలాగ్‌తో ఆరంభించిన టీజర్ ఎంతో ఆహ్లాదకరంగా అనిపించింది. ‘బ్యూటీని కన్నావ్ అమ్మా నువ్వు’ అంటూ హీరోయిన్ పరిచయం, ‘ఆ బైక్ ఎంత ఉంటుందంటావ్?.. మన కారు సంవత్సరం ఈఎంఐ ఎంత ఉంటుందో.. ఆ బైక్ అంత ఉంటుంది’ అనే డైలాగ్‌తో మిడిల్ క్లాస్ కలల్ని, కష్టాల్ని చూపించారు. ‘అలేఖ్య కనిపించడం లేదండి’ అనే డైలాగ్, ఆ తరువాత వచ్చిన సీన్లతో కథలోని ఇంటెన్స్, సంఘర్షణను చూపించారు.
‘కూతురు అడిగింది కొనిచ్చేప్పుడు వచ్చే కిక్కు ఓ మధ్య తరగతి తండ్రికే తెలుస్తుంది.. తన కోసం కొంచెం కష్టపడాలి.. పడతాను’ అంటూ టీజర్ చివర్లో వచ్చిన ఎమోషనల్ డైలాగ్ ఈ మూవీ కథ ఏంటో చెప్పేస్తుంది. ఇక ఈ ఎమోషనల్ టీజర్ ఆడియెన్స్‌ను కదిలించేలా ఉంది. ఇక ఈ టీజర్లో విజయ్ బుల్గానిన్ ఆర్ఆర్ అందరినీ కదిలించేలా ఉంది. శ్రీ సాయి కుమార్ దారా ఇచ్చిన విజువల్స్ ఎంతో బ్యూటీఫుల్‌గా ఉన్నాయి.
ఆయ్, మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం వంటి హిట్ చిత్రాల్లో తనదైన మార్క్ క్రియేట్ చేసుకున్న అంకిత్ కొయ్య ‘బ్యూటీ చిత్రంతో ఆకట్టుకునేలా ఉన్నారు. చూస్తుంటే చాలా ఇంటెన్స్ ఉన్న పాత్రను పోషించినట్టుగా కనిపిస్తోంది. ఇక ఈ చిత్రంలో నరేష్, వాసుకి, నంద గోపాల్, సోనియా చౌదరి, నితిన్ ప్రసన్న, మురళీ గౌడ్, ప్రసాద్ బెహరా వంటి వారు పోషించిన పాత్రలకు మంచి ఇంపార్టెన్స్ ఉందని అర్థం అవుతోంది.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్‌గా శ్రీ సాయి కుమార్ దారా పని చేశారు. విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు. ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్షన్: బేబీ సురేష్ భీమగాని, ఎడిటింగ్: ఎస్బి ఉద్ధవ్. ఈ ఏడాదిలో రాబోతోన్న క్రేజీ ప్రాజెక్టుల్లో ‘బ్యూటీ’ కూడా ఒకటి కానుంది. ఈ సినిమాకు బి.ఎస్. రావు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయి. సెప్టెంబర్ 19న ఈ మూవీని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు.
తారాగణం: అంకిత్ కొయ్య, నీలఖి పాత్ర, నరేష్, వాసుకి, నంద గోపాల్, సోనియా చౌదరి, నితిన్ ప్రసన్న, మురళీ గౌడ్, ప్రసాద్ బెహరా తదితరలు
సాంకేతిక సిబ్బంది
స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: జె.ఎస్.ఎస్. వర్ధన్
నిర్మాతలు: అడిదాల విజయపాల్ రెడ్డి, ఉమేష్ కుమార్ బన్సాల్
బ్యానర్లు: వానరా సెల్యులాయిడ్, జీ స్టూడియోస్, మారుతీ టీమ్ ప్రొడక్ట్
కథ, స్క్రీన్ ప్లే: ఆర్.వి. సుబ్రహ్మణ్యం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బి.ఎస్. రావు
DOP: శ్రీ సాయి కుమార్ దారా
సంగీతం: విజయ్ బుల్గానిన్
ఎడిటర్: SB ఉద్ధవ్
ఆర్ట్ : బేబీ సురేష్ భీమగాని
PRO: సాయి సతీష్