BB4 Akhanda 2 Thaandavam Launched Splendidly, Title Theme Unveiled
God Of Masses Nandamuri Balakrishna and Blockbuster maker Boyapati Sreenu’s fourth collaboration #BB4 is titled Akhanda 2 Thaandavam, and it’s the sequel for their sensational blockbuster Akhanda. Raam Achanta and Gopichand Achanta will produce the movie on 14 Reels Plus Banner, while M Tejaswini Nandamuri presents this Pan India project.
Akhanda 2 was launched splendidly today in the presence of the entire core team and also a few guests. For the muhurtham shot, Tejaswini switched on the camera, while Brahmani sounded the clapboard. Balakrishna uttered a powerful dialogue for the muhurtham shot.
Pragya Jaiswal who played the leading lady in Akhanda is also part of the sequel, and she also graced the grand launching ceremony.
Nandamuri Ramakrishna unveiled Akhanda 2 Title Theme that indicates the spiritual elements woven into the story. What truly stands out is the terrific score of S Thaman, though it also ensures the grand production quality.
Boyapati penned a powerful script with universal appeal to show NBK in much commanding role. The movie boasts a talented team of technicians. C Ramprasad will crank the camera, along with Santoshh D Detakae. AS Prakash is the art director, while Tammiraju is the editor.
This is one of the most anticipated films in Indian cinema, with every moviegoer eagerly awaiting the return of this sensational combination. Regular shooting for Akhanda 2 will commence soon, and expectations are high for this monumental sequel.
Cast: God Of Masses Nandamuri Balakrishna, Pragya Jaiswal
Technical Crew:
Writer, Director: Boyapati Sreenu
Producers: Raam Achanta, Gopi Achanta
Banner: 14 Reels Plus
Presents: M Tejaswini Nandamuri
Music: Thaman S
DOP: C Ramprasad, Santoshh D Detakae
Ex-Producer: Koti Paruchuri
Art: AS Prakash
Editor: Tammiraju
PRO: Vamsi-Shekar
Marketing: First Show
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను, రామ్ ఆచంట, గోపి ఆచంట, 14 రీల్స్ ప్లస్, ఎం తేజస్విని నందమూరి సమర్పణలో ‘అఖండ 2 తాండవం’ ఘనంగా ప్రారంభం, టైటిల్ థీమ్ రిలీజ్
ఇండియన్ సినిమాలో మోస్ట్ క్రేజీయస్ట్ కాంబినేషన్- గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను -సింహ, లెజెండ్, అఖండ తో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ అందుకున్న తర్వాత నాల్గవసారి కలిసి పని చేయనున్నారు. వీరి కాంబినేషన్ లో వచ్చిన ప్రతి చిత్రం అంచనాలను మించింది, NBKకి బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా వారి గత చిత్రం ‘అఖండ’ చాలా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. హిందీ డబ్బింగ్ వెర్షన్ ఉత్తరాది ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణ పొందింది.
ఎం తేజస్విని నందమూరి సమర్పకురాలిగా 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించనున్న న్యూ మూవీ #BB4 అఖండ చిత్రానికి సీక్వెల్, దీనికి అఖండ 2 అని టైటిల్ పెట్టారు. ఇది బాలకృష్ణ, బోయపాటి ఇద్దరికీ మేడిన్ పాన్ ఇండియా మూవీ.
అద్భుతంగా డిజైన్ చేసిన టైటిల్ పోస్టర్ డివైన్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంది. టైటిల్ ఫాంట్ స్ఫటిక లింగం, ఒక శివ లింగాన్ని కలిగి ఉంది, ఇది డివైన్ ఇంపార్టెన్స్ ని సూచిస్తుంది. టైటిల్‌తో పాటు పవర్ ఫుల్ క్యాప్షన్- తాండవం, రెండు డమరుకంలు చుట్టుముట్టబడి, శివ నృత్యాన్ని సూచిస్తున్నాయి. బ్యాక్ డ్రాప్ లో హిమాలయాలు భక్తి వాతావరణాన్ని ఎలివేట్ చేస్తున్నాయి. టైటిల్ పోస్టర్ సీక్వెల్ మరపురాని గూస్‌బంప్- మూమెంట్స్ తో ఎపిక్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందిస్తోందని సూచిస్తుంది.
మొత్తం కోర్ టీమ్, పలువురు అతిథుల సమక్షంలో అఖండ 2 ఈరోజు ఘనంగా ప్రారంభమైయింది. ముహూర్తం షాట్‌కు తేజస్విని కెమెరా స్విచాన్ చేయగా, బ్రాహ్మణి క్లాప్ కొట్టారు. ముహూర్తం షాట్ కు బాలకృష్ణ పవర్ ఫుల్ డైలాగ్ చెప్పారు.
అఖండలో హీరోయిన్ గా నటించిన ప్రగ్యా జైస్వాల్ ఈ సీక్వెల్లో పార్ట్ అయ్యారు, గ్రాండ్ లాంచ్ వేడుకకు హాజరయ్యారు.
కథలో ఆధ్యాత్మిక అంశాలను తెలిపే అఖండ 2 టైటిల్ థీమ్‌ను నందమూరి రామకృష్ణ ఆవిష్కరించారు. Sఎస్ థమన్ పూనకాలు తెప్పించే బ్యాగ్ గ్రౌండ్ స్కోర్ ప్రత్యేకంగా నిలిచింది, ఇది గ్రేట్ ప్రొడక్షన్ వాల్యూస్ ని ప్రామిస్ చేస్తోంది.
బాలకృష్ణను లార్జర్ దేన్-లైఫ్ క్యారెక్టర్స్‌లో ప్రెజెంట్ చేయడంలో బోయపాటి దిట్ట. ఎన్బికెని వెరీ కమాండింగ్ క్యారెక్టర్ లో ప్రజెంట్ చేయడానికి యూనివర్సల్ అప్పీల్‌తో పవర్ ఫుల్ స్క్రిప్ట్‌ను రాశారు బోయపాటి. ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అఖండ 2 హై బడ్జెట్‌తో భారీ స్థాయిలో నిర్మించబడుతుంది. ఇది బాలకృష్ణ, బోయపాటి ఇద్దరికీ మోస్ట్ ఎక్స్ పెన్సీవ్ మూవీగా నిలుస్తోంది.
ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. సంతోష్ డి డెటాకేతో పాటు సి రాంప్రసాద్ డీవోపీగా పని చేస్తున్నారు. ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ కాగా, తమ్మిరాజు ఎడిటర్.
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అఖండ 2 మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిల్మ్, ఈ సెన్సేషనల్ కాంబినేషన్ కోసం ప్రతి సినీప్రేక్షకుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అఖండ 2 రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ మాన్యుమెంటల్ సీక్వెల్ పై భారీ అంచనాలు వున్నాయి.
నటీనటులు: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: బోయపాటి శ్రీను
నిర్మాతలు: రామ్ ఆచంట, గోపి ఆచంట
బ్యానర్: 14 రీల్స్ ప్లస్
ప్రజెంట్స్: ఎం తేజస్విని నందమూరి
సంగీతం: థమన్ ఎస్
డీవోపీ: సి రాంప్రసాద్, సంతోష్ డి డెటాకే
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కోటి పరుచూరి
ఆర్ట్: ఏఎస్ ప్రకాష్
ఎడిటర్: తమ్మిరాజు
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో