First ever collaboration – Salman Khan, Vamshi Paidipally and Dil Raju

Band Melam to Release in theaters from March 26
మార్చి 26న విడుదల కాబోతోన్న బ్యాండ్ మేళం
‘కోర్ట్’ చిత్రంతో మెప్పించిన హర్ష్ రోషన్, శ్రీదేవీ జంట మళ్లీ ‘బ్యాండ్ మేళం’ అంటూ ఆడియెన్స్ ముందుకు రానుంది. బ్లాక్ బస్టర్ రచయిత కోన వెంకట్ నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం రూపు దిద్దుకుంది. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ మీద కావ్య, శ్రావ్య ఈ మూవీని నిర్మించారు. సతీష్ జవ్వాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని మార్చి 26న రిలీజ్ చేయబోతోన్నారు. ఇప్పటి వరకు వదిలిన కంటెంట్ ఆడియెన్స్‌లో ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.
‘బ్యాండ్ మేళం’ టీజర్, ట్రైలర్, మాస్ పెప్పీ సాంగ్ ‘తిప్పూ కుంటున్నావ్’, మంచి మెలోడీ సాంగ్ ‘పల్లెలోని సందల్లన్ని మీవే’ వంటివి ఆడియెన్స్‌లో సినిమా పట్ల అంచనాల్ని పెంచేసింది. యూత్ ఆడియెన్స్‌లో ఇప్పటికే మంచి బజ్‌ను క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం శ్రీరాముడి ఆశీస్సులతో శ్రీరామ నవమి సందర్భంగా రిలీజ్ కాబోతోంది. మార్చి 26న ఈ సినిమాని గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్లు ప్లాన్ చేశారు.
ప్రమోషన్స్‌కి కావాల్సినంత టైం దొరకడంతో చిత్రయూనిట్ సైతం డిఫరెంట్ స్టైల్లో ఆడియెన్స్‌ను రీచ్ అయ్యేలా ప్లాన్ చేస్తోంది. త్వరలోనే ఇతర ప్రమోషనల్ కంటెంట్, ఈవెంట్లకు సంబంధించిన వివరాల్ని ప్రకటించనున్నారు.
శివరాజు ప్రణవ్ ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించారు. శివ ముప్పరాజు ఎడిటింగ్, స్క్రీన్ ప్లే బాధ్యతల్ని నిర్వర్తించారు. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫర్‌గా పని చేశారు. ఇక ఈ మూవీలో సాయికుమార్ కీలక పాత్రను పోషించారు. ఈ సినిమాను మార్చి 26న భారీ ఎత్తున విడుదల చేయబోతోన్నారు.
తారాగణం: రోషన్, శ్రీదేవి, సాయి కుమార్ తదితరులు
సాంకేతిక సిబ్బంది:
కోన వెంకట్ ప్రొడక్షన్
బ్యానర్: కోన ఫిల్మ్ కార్పొరేషన్
సమర్పణ : మ్యాంగో మాస్ మీడియా
నిర్మాతలు: కావ్య, శ్రావ్య
సహ నిర్మాత: శివరాజు ప్రణవ్
రచయిత, దర్శకుడు: సతీష్ జవ్వాజి
సంగీతం: విజయ్ బుల్గానిన్
స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్: శివ ముప్పరాజు
DOP: సతీష్ ముత్యాల
గీత రచయిత: చద్రబోస్
ఆర్ట్ డైరెక్టర్: నార్ని శ్రీనివాస్
మార్కెటింగ్: వాక్ అవుట్ మీడియా
PRO: వంశీ కాకా
