Thella Kaagitham is all set for Worldwide Release on October

Amma Naku Aa Abbayi Kavali Success Celebrations held Grandly
ఈ విజయం అనూహ్యం అపూర్వం – హీరో పవన్ మహావీర్
కెడాక్టర్ టర్నెడ్ హీరో పవన్ మహావీర్ నటించిన విభిన్న ప్రేమకథాచిత్రం “అమ్మా నాకు ఆ అబ్బాయి కావాలి”. జి. శైలజ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 7న వరల్డ్ వైడ్ థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో రన్ అవుతుంది. ఈ సందర్భంగా చిత్రబృందం సక్సెస్ సెలబ్రేషన్ నిర్వహించింది.
హ్యాండ్సమ్ హీరో పవన్ మహావీర్ మాట్లాడుతూ – అన్ని జిల్లాల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి నాకు చాలా ఆనందంగా ఉంది. మొదటినుంచి ఈ సినిమాపై మాకు పూర్తి నమ్మకం ఉంది, మేము ఊహించిన దానికంటే అద్భుతమైన స్పందన ప్రేక్షకుల నుంచి వచ్చింది. ఇంత సక్సెస్ ని మాకు అందించిన ప్రేక్షకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు ఎన్ఠీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం. వాళ్ల సినిమాలు చూస్తూ పెరిగాను. ఈ మూవీతో ప్రేక్షకులు నన్ను హీరో గా అందరించారని ఋజువు చేశారు ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు, ఈసారి మంచి మాస్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తాను అని అన్నారు.
