దేవకీ నందన వాసుదేవ లొ డివైన్ ఎలిమెంట్స్, ట్విస్ట్ లు అదిరిపోతాయి –
AA Films bagging the distribution rights of “Game Changer” for North India
Global superstar Ram Charan’s Game Changer for long has been the most awaited project. Much to the delight of all, the film’s North India distribution rights have been sold for a fancy sum. The amount turns out to be the highest in Ram Charan’s career.
Thehighly anticipated project with renowned director Shankar, “Game Changer,” continues to capture the imagination of moviegoers across the country. The film, set to release on Sankranti, January 10, 2025, marks Ram Charan’s first full-length project after his sensational performance in S.S. Rajamouli’s “RRR,” and anticipation is reaching fever pitch.
With the recent release of two electrifying songs, “Jaragandi” and “Raa Raa Macha,” fans are eagerly awaiting the release of the film’s impactful teaser and trailer. The pre-release business for “Game Changer” is already thriving, and in a significant development, the makers have announced that Anil Thadani’s AA Films has acquired the film’s North India distribution rights for a massive sum.
This strategic acquisition ensures a grand release for “Game Changer” in North India across a maximum number of theaters, delighting Ram Charan fans and movie lovers alike. Anil Thadani’s commitment to securing a wide release for the film further fuels the excitement surrounding this cinematic event.
“Game Changer” features Ram Charan portraying an upright IAS officer battling corrupt and influential politicians for the welfare of the underprivileged. The film also boasts a captivating ensemble cast including Bollywood beauty Kiara Advani as the female lead and Telugu actress Anjali in a pivotal role.
Thaman’s powerful music and breathtaking BGM, coupled with Tirru’s captivating camera work, are expected to elevate the film’s cinematic experience. The editing is handled by the acclaimed duo Shammer Muhammed and Ruben.
Shot across diverse and exotic locations including Hyderabad, New Zealand, Andhra Pradesh, Mumbai, and Chandigarh, “Game Changer” promises a visually stunning and immersive experience. The film’s powerful story, penned by Karthik Subbaraj, is being produced under the prestigious banner of Dil Raju’s Sri Venkateswara Creations and Zee Studios.
With its star-studded cast, captivating storyline, and top-notch technical team, “Game Changer” is poised to be a blockbuster hit, capturing the hearts of audiences across the nation.
నార్త్ ఇండియాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ “గేమ్ ఛేంజర్” పంపిణీ హక్కుల్ని సొంతం చేసుకున్న AA ఫిల్మ్స్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ మీదున్న అంచనాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రస్తుతం ఈ చిత్రం నార్త్ ఇండియా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఫ్యాన్సీ మొత్తానికి అమ్ముడయ్యాయి. ఇది రామ్ చరణ్ కెరీర్లోనే హయ్యస్ట్. భారీ రేటుకే నార్త్‌లో గేమ్ చేంజర్ అమ్ముడైపోయింది.
ప్రఖ్యాత దర్శకుడు శంకర్ తెరకెక్కించిన “గేమ్ ఛేంజర్” కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. జనవరి 10, 2025న సంక్రాంతికి ఈ చిత్రం భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఇటీవల విడుదలైన “జరగండి”, “రా రా మచ్చ” అనే రెండు ఎలక్ట్రిఫైయింగ్ పాటలు శ్రోతలను తెగ ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం నుంచి రావాల్సిన టీజర్, ట్రైలర్ మరియు మిలిగిలిన పాటలు కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.
“గేమ్ ఛేంజర్” ప్రీ-రిలీజ్ బిజినెస్ గురించి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ మూవీని నార్త్‌లో అనిల్ తడాని AA ఫిల్మ్స్ ద్వారా రిలీజ్ చేయబోతోన్నారు. ఉత్తర భారతదేశ పంపిణీ హక్కులను భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు ఈ మేరకు మేకర్స్ ప్రకటించారు. ఇక నార్త్‌లో ఈ చిత్రాన్ని ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేయబోతోన్నారు.
“గేమ్ ఛేంజర్”లో రామ్ చరణ్ నిజాయితీగా గల ఐఏఎస్ అధికారిగా, అణగారిన వర్గాల సంక్షేమం కోసం పోరాడే రాజకీయ నాయకుడిగా కనిపించబోతోన్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా, తెలుగు నటి అంజలి కీలక పాత్రలో నటిస్తున్నారు. తమన్ సంగీతం, నేపథ్య సంగీతం స్పెషల్ అట్రాక్షన్ కానుంది. ఎడిటింగ్‌ను బాధ్యతను ప్రఖ్యాత ద్వయం షమ్మర్ ముహమ్మద్, రూబెన్ నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్, న్యూజిలాండ్, ఆంధ్రప్రదేశ్, ముంబై, చండీగఢ్‌తో సహా విభిన్న ప్రదేశాలలో షూట్ చేసిన “గేమ్ ఛేంజర్” విజువల్ వండర్‌గా ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. కార్తీక్ సుబ్బరాజ్ అందించిన పవర్ ఫుల్ స్టోరీకి శంకర్ తన విజన్‌ను జోడించి భారీ ఎత్తున తెరకెక్కించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ బ్యానర్‌పై దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.