Telugu Film Industry Expresses Gratitude to Government & Police for

హాంగ్ కాంగ్ వారియర్స్ – జనవరి 24న తెలుగు, తమిళ్ లో గ్రాండ్ రిలీజ్
హాంగ్ కాంగ్ సినీ చరిత్రలో వెయ్యి కోట్లు వసూలు చేసిన సంచలన చిత్రం ‘హాంగ్ కాంగ్ వారియర్స్’. లూయిస్ కూ, సమ్మో కామ్-బో హంగ్, రిచీ లీడ్ రోల్స్ నటించిన ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ కి సోయ్ చీయాంగ్ దర్శకత్వం వహించారు. కిన్-యీ ఔ, తై-లీ చాన్, లి జున్ రైటర్స్.
హాంగ్ కాంగ్ లో సంచలన విజయం సాధించిన ఈ చిత్రం జనవరి 24, 2025న తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ కానుంది.
హాంగ్ కాంగ్ వారియర్స్ ని తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళ్ లో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ NVR సినిమా గ్రాండ్ గా రిలీజ్ చేస్తోంది. లీడ్ యాక్టర్స్ ఇంటెన్స్ యాక్షన్ మోడ్ లో కనిపించిన రిలీజ్ డేట్ పోస్టర్ చాలా ఎట్రాక్టివ్ గా వుంది.
నటీనటులు: లూయిస్ కూ, సమ్మో కామ్-బో హంగ్, రిచీ
రైటర్స్: కిన్-యీ ఔ, తై-లీ చాన్, లి జున్
దర్శకత్వం: సోయ్ చీయాంగ్
తెలుగు , తమిళ్ రిలీజ్: NVR సినిమా
పీఆర్వో: వంశీ శేఖర్
