Haiku Trailer Embellishes the Feel-Good Rom-Com with Heartwarming Emotions and

రావు బహదూర్ లాంటి సినిమాలను మనమంతా కలిసి సెలబ్రేట్ చేయాలి – సందీప్ రెడ్డి వంగా
సత్యదేవ్ కథానాయకుడిగా వెంకటేష్ మహా దర్శకత్వం వహించిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘రావు బహదూర్’. సూపర్‌స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్‌ల జీఎంబీ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో, ఏ+ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై చింతా గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర ఈ చిత్రాన్ని నిర్మించారు. జూలై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుని ఘన విజయంతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.
తాజాగా ‘రావు బహదూర్’ చిత్రాన్ని వీక్షించిన సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చిత్రబృందానికి అభినందనలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ షేర్ చేశారు.
”ఇప్పుడే ‘రావు బహదూర్’ చూశాను.
సినిమాను మనం ఎందుకు ప్రేమించడం మొదలుపెట్టామో మరోసారి గుర్తు చేసే అరుదైన, విలువైన చిత్రాల్లో ఇది ఒకటి.
నిజంగా సినిమాను ప్రేమించే ప్రతి ఒక్కరికీ నా విజ్ఞప్తి…
మీ జీవితంలో మూడు గంటలు ఈ సినిమాకు ఇవ్వండి. మీ సమయం, మీ చప్పట్లకు అర్హత కలిగిన సినిమా ఇది.
దర్శకుడు వెంకటేష్ మహా అద్భుతంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇలాంటి సినిమా తీయాలంటే ఎంతో ధైర్యం, తన ఆలోచనపై గొప్ప నమ్మకం ఉండాలి.
సత్యదేవ్ అద్భుతమైన నటన కనబరిచారు. ఈ చిత్ర బృందం మొత్తానికి నా హృదయపూర్వక అభినందనలు. ఇలాంటి సినిమాలను మనమంతా కలిసి సెలబ్రేట్ చేయాలి.”
