Naga Shaurya | త్వరలోనే నిజం తెలుస్తుంది.. కన్నడ నటుడు దర్శన్‌కు మద్దతుగా నాగశౌర్య
Naga Shaurya | రేణుకాస్వామి హత్యకేసులో పాపులర్ కన్నడ స్టార్ యాక్టర్ దర్శన్ (Darshan) దర్శన్‌తోపాటు నటి పవిత్రగౌడను పోలీసులు అరెస్ట్ అవడం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. తాజాగా దర్శన్‌కు టాలీవుడ్ యాక్టర్ నాగశౌర్య (Naga Shaurya) మద్దతుగా నిలిచాడు.
Naga Shaurya | రేణుకాస్వామి హత్యకేసులో పాపులర్ కన్నడ స్టార్ యాక్టర్ దర్శన్ (Darshan) దర్శన్‌తోపాటు నటి పవిత్రగౌడను పోలీసులు అరెస్ట్ అవడం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే అభిమానిని దారుణంగా చంపారంటూ అప్పటి నుంచి దర్శన్‌పై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కానీ కొందరు మాత్రం దర్శన్ ఇలా చేశాడంటే నమ్మలేకపోతున్నామంటూ అభిప్రాయపడుతున్నారు. తాజాగా దర్శన్‌కు టాలీవుడ్ యాక్టర్ నాగశౌర్య (Naga Shaurya) మద్దతుగా నిలిచాడు.
నాగశౌర్య ఇన్‌స్టాగ్రామ్‌లో దర్శన్‌తో దిగిన ఫొటో ఒకటి షేర్ చేస్తూ.. అభిమాని మరణం పట్ల నా మనసు కలిచివేస్తుంది. ఈ కష్ట సమయంలో మృతుడి కుటుంబానికి బలం చేకూరాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నా. ఈ సమస్యపై ప్రజలు వెంటనే ఓ నిర్ణయానికి రావడం పట్ల నిరాశచెందాను. దర్శన్ అన్న ఎవరికీ హాని కలిగించే వ్యక్తి కాదు. అతని దాతృత్వాన్ని, దయగల స్వభావాన్ని ఇతరులకు సాయపడటంతో నిబద్ధతను అతని గురించి బాగా తెలిసిన వారు చెప్తారు.
దర్శన్ ఎల్లప్పుడూ అవసరంలో ఉన్నవారిని ఆదుకోవడమే కాదు.. చాలా మందికి సపోర్టుగా ఉన్నారు. నా భయంలో ఈ వార్తలను నేను అంగీకరించలేను. మన న్యాయవ్యవస్థపై నమ్మకముంది. త్వరలోనే నిజం బయటకు వస్తుందని నమ్ముతున్నా. మరో కుటుంబం కూడా చాలా బాధపడుతుందని గుర్తుంచుకోవాలి. ఆయన చిత్తశుద్ది, కరుణ దర్శన్‌ను నిర్దోషిగా నిలబెడతాయని, నిజమైన నేరస్థుడిని పట్టిస్తాయని బలంగా నమ్ముతున్నానని పోస్ట్‌లో రాసుకొచ్చాడు. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
రేణుకాస్వామి హత్య కేసులో మొత్తం 17 మంది నిందితులుండగా.. కొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొందరు పోలీసుల ఎదుట లొంగిపోయారు.