Watch our film Thimmarajupalli TV to experience technical brilliance, strong

లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అందరికీ రిలేట్ అయ్యే మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ – హీరోయిన్ కృతి శెట్టి
వరుస బ్లాక్‌బస్టర్ విజయాలతో అలరిస్తున్న యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా, విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన క్రేజీ లవ్ స్టోరీ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’. ఈ చిత్రాన్ని నయనతార నిర్మించగా, కృతి శెట్టి హీరోయిన్గా నటించారు. ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, యోగి బాబు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన తెలుగు టీజర్, ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. శ్రీ పద్మిని సినిమాస్ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏప్రిల్ 10న ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా కృతి శెట్టి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
విగ్నేష్ శివన్ గారు ఈ స్టోరీ చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది?
‘ఉప్పెన’ తర్వాత పూర్తిస్థాయి లవ్ స్టోరీ చేయలేదు. అలాంటి ఫుల్ లెంత్ ప్రేమ కథ చేసే అవకాశం ఇందులో వచ్చింది. ఇందులో ప్రేమకథ చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. విగ్నేష్ శివన్ గారు కథ చెప్పినప్పుడు నాకు చాలా కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎన్ని షేర్స్ వచ్చాయి అని కౌంట్ చేసుకుంటున్నారు. అది చాలామందికి హార్ట్‌కు దగ్గరగా ఉంటుంది. రియల్‌గా అనిపించే క్యారెక్టర్ని సినిమాటిక్‌గా చూపిస్తున్నారు. ఈ క్యారెక్టర్ చేయడం నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్.
-ఈ జనరేషన్లో డబ్బులు లేకపోయినా పర్వాలేదు, కానీ ఫోన్ లేకుండా ఉండడం చాలా కష్టం. అలాంటి ఒక క్యారెక్టర్ చేస్తున్నాను. విజువల్ కాన్సెప్ట్ 2040 ఫ్యూచరిస్టిక్‌గా ఉన్నా, కథ మాత్రం అందరికీ రిలేటబుల్‌గా ఉంటుంది. మంచి ఫన్ ఫిల్మ్. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. మంచి లవ్ పోర్షన్ కూడా చాలా బాగుంటుంది.
మీకు కూడా ఫోన్ అంటే చాలా ఇష్టమా?
వర్క్ ఉన్నప్పుడు నేను అసలు ఫోన్ టచ్ చేయను. లేనప్పుడు మాత్రం బ్యాలెన్స్‌గా వాడుతుంటాను. ఇప్పుడు మాత్రం ఫోన్ అలవాటు కొంచెం ఎక్కువే. ఫ్యాన్స్‌తో కనెక్ట్ అవ్వడానికి ఫోన్ చాలా మంచి సాధనం. లైక్స్, షేర్స్‌పై నాకు పెద్దగా పట్టింపు ఉండదు. ఇప్పుడు మాత్రం ఫ్యాన్స్‌తో కనెక్ట్ అవ్వడానికి సోషల్ మీడియాను వాడుతున్నాను.
ఈ సినిమాను నయనతార గారు నిర్మించారు కదా.. షూటింగ్ సమయంలో వచ్చేవారా?
ఈ సినిమాతో నయనతార గారితో మంచి అనుబంధం ఏర్పడింది. సినిమాలో చూస్తే ఒక బాస్ లేడీలా ఉంటారు, కానీ బయట చాలా స్వీట్ పర్సన్. నయనతార గారు, శివన్ గారు అందరినీ చాలా చక్కగా చూసుకుంటారు. ఒక సమయంలో లైఫ్‌కు సంబంధించిన ఒక అడ్వైస్ని నయనతార గారిని అడిగాను. ఆమె చాలా చక్కగా గైడ్ చేశారు. కెరీర్ గురించి కూడా కొన్ని టిప్స్ ఇచ్చారు.
ఇది ఫ్యూచరిస్టిక్ లవ్ స్టోరీ కదా.. మీ మనసులో ఓల్డ్ స్కూల్, ఫ్యూచరిస్టిక్ లవ్ స్టోరీకి సంబంధించిన ఏవైనా ఆలోచనలు ఉన్నాయా?
నేనైతే ఓల్డ్ స్కూల్ థాట్‌ని బిలీవ్ చేస్తాను. ‘సీతారామం’, ‘96’ లాంటి ప్రేమకథలు నా ఫేవరెట్. అమాయకత్వంలో ఒక ఆనందం ఉంటుంది. ఇప్పుడున్న జనరేషన్ లవ్‌కి నేను రిలేట్ అవ్వలేను.
ఫ్యూచర్లో ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ లాంటి సిచువేషన్ వచ్చే అవకాశం ఉందా?
ఇప్పుడు బాడీలో ప్రతి పార్ట్‌ని ఇన్సూరెన్స్ చేస్తున్నారు. ఫ్యూచర్లో లవ్ కూడా ఒక ఇన్సూరెన్స్‌గా భాగం కావచ్చు. సినిమాలో ఈ ఐడియా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది.
ఈ సినిమా చేస్తున్నప్పుడు మీకు చాలెంజింగ్‌గా అనిపించిన అంశం ఏమిటి?
శివన్ గారు నాకు ఈ క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు, ఇప్పటివరకు నా కెరీర్లో చేసిన క్యారెక్టర్స్‌కి భిన్నంగా చేద్దాం అన్నారు. దానికి తగ్గట్టే ప్రిపరేషన్ జరిగింది. ఇందులో నా క్యారెక్టర్ ఎక్స్‌ప్రెసివ్‌గా ఉండదు. అలాగే కేవలం ఫోన్ చూస్తూనే మాట్లాడుతుంటుంది. తన ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా ఒక రోబోలా ఉంటాయి. అవన్నీ డైరెక్టర్ గారు చెప్పినప్పుడు నాకు చాలా కొత్తగా, చాలెంజింగ్‌గా అనిపించింది.
ప్రదీప్ రంగనాథన్ గురించి?
ప్రదీప్ రంగనాథన్ గారు చాలా స్వీట్ పర్సన్. అన్ని విషయాల్నీ అబ్జర్వ్ చేస్తుంటారు. ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు. ఆయన జడ్జ్మెంట్ చాలా బాగుంటుంది. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను.
ఎస్జే సూర్య గారి గురించి?
ఎస్జే సూర్య గారితో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఆయన లొకేషన్‌కి వచ్చిన తర్వాత అసలు కూర్చోరు. అంత ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ అయినప్పటికీ, ప్రతిరోజూ కూడా తన ఫస్ట్ డేలా వర్క్ చేస్తారు. ఆయన ఎనర్జీ అద్భుతం.
ఇప్పుడు ఎక్కువగా తమిళ్ సినిమాలు చేయడానికి కారణం?
నిజంగా అయితే నేను ప్లాన్ చేసింది కాదు. వరుసగా తమిళ్ నుంచి అవకాశాలు వచ్చాయి. అందులో నాకు చాలా కథలు నచ్చాయి. తెలుగు ఆడియన్స్ నా మనసుకు ఎప్పుడూ దగ్గరగా ఉంటారు. వాళ్లకు ఒక మంచి సినిమా ఇవ్వాలి అనుకుని ఈ సమయం తీసుకున్నాను.
ఈ గ్యాప్‌లో మళ్లీ యాక్టింగ్ స్కూల్‌కి వెళ్లాను. ఫైటింగ్స్ ఎలా చేయాలో నేర్చుకున్నాను. అలాగే క్లాసికల్ డాన్స్ కూడా నేర్చుకున్నాను. సమయం దొరికితే నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను.
కొత్తగా చేస్తున్న సినిమాలు?
ప్రస్తుతం తెలుగులో అనిల్ రావిపూడి గారితో ఒక సినిమా చేయబోతున్నాను. అలాగే తమిళ్లో ఒక సినిమా డిస్కషన్లో ఉంది.
ఆల్ ది బెస్ట్
థాంక్యూ.
