‘సంక్రాంతికి వస్తున్నాం’ జనవరి 14న విడుదల – విక్టరీ వెంకటేష్
‘జనక అయితే గనక’ అందరికీ నచ్చుతుంది – డైరెక్టర్ సందీప్ రెడ్డి బండ్ల
వెర్సటైల్ యాక్టర్ సుహాస్, సంగీర్తన హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘జనక అయితే గనక’. శిరీష్ సమర్పణలో దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. సందీప్ రెడ్డి బండ్ల డైరెక్ట్ చేశారు. ఈ సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి బండ్ల .. ‘జనక అయితే గనక’ మూవీ గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు…
- ‘జనక అయితే గనక’ ఎలా స్టార్ట్ అయ్యింది?
- ‘జనక అయితే గనక’ టైటిల్ మీనింగే తండ్రి అయితే ఏంటి అనేదే!. ఇప్పటి జనరేషన్లో పెళ్లైన కొత్త జంట ఓ పాపనో, బాబునో కనటానికి ఎందుకంత ఆలోచిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితులేంటి? అనే విషయాన్ని మధ్య తరగతి నేపథ్యంలో తీసుకుని సినిమాగా చిత్రీకరించాం. రీసెంట్గా ప్రీమియర్ షోస్ వేసినప్పుడు ఇండస్ట్రీకి చెందినవారు, సామాన్య ప్రజలు అందరూ చూశారు. పాతికేళ్ల లోపు వాళ్లు, మధ్య వయస్సున్నవాళ్లు, వయసు మళ్లిన వాళ్లు సినిమాను చూశారు. అందరి దగ్గరి నుంచి పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఓ తొంబై ఏళ్ల ముసలావిడ అయితే సినిమా గురించి చాలా చక్కగా మాట్లాడారు.
- సినిమాలో కాన్సెప్ట్ ఆలోచన ఎలా వచ్చింది.. ఎవరితో ముందుగా షేర్ చేసుకున్నారు?
- ‘జనక అయితే గనక’ బేసిక్ ఐడియా ఎప్పటి నుంచో మనసులో ఉండింది. ఓ వ్యక్తి కండోమ్ కంపెనీపై కేసు వేస్తే ఎలా ఉంటుందనేదే ఆ ఆలోచన. కాకపోతే ఎలా డ్రైవ్ చేయాలనేది నాకు తెలియలేదు. మా ఫ్యామిలీలో నేనే చిన్నవాడిని. మా ఫ్యామిలీలో నాకే చివరిగా పెళ్లైంది. ఈ క్రమంలో మా అన్నయ్య, అక్కయ్య, ఫ్రెండ్స్ సహా అందరి ఫ్యామిలీలను గమనిస్తుండేవాడిని. అందరి ఇళ్లలో పెళ్లి డిస్కషన్, పిల్లల గురించిన డిస్కషన్ లేకుండా ఉండేది కాదు. ఇదొక యూనివర్సల్ ఎమోషన్. దీన్ని కథగా చెబితే బావుంటుందనిపించింది. నాకు వచ్చిన ఈ ఆలోచనని ముందుగా ప్రశాంత్ నీల్గారికి చెప్పాను. అప్పటికి నేను ఆయనతో ట్రావెల్ చేస్తున్నాను. తర్వాత రాజుగారి సంస్థలో ఉండే నానిగారికి చెప్పాను. ఆయన వల్ల గుంటూరు డిస్ట్రిబ్యూటర్‌కి చెప్పాను. తర్వాత హర్షిత్ గారికి షేర్ చేశాను. ఆయనకు నచ్చడంతో రాజుగారికి ఐడియా చెప్పారు. రాజుగారికి నచ్చడంతో సినిమా చేయటానికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది…నాకు సర్ప్రైజింగ్గా అనిపించింది. ఎందుకంటే, ఇది ఔట్ ఆఫ్ ది బాక్స్ మూవీ. బాలీవుడ్లో ఆయుష్మాన్ ఖురానా చేసిన విక్కీ డోనర్, బదాయి హో తరహా సినిమా. తెలుగులో ఇలాంటి ఔట్ ఆఫ్ ది బాక్స్ సినిమాలు రాలేదు. కోవిడ్ టైమ్‌లో మనకు జరిగిన మంచి ఏంట్రా అంటే..ఓటీటీకి ఎక్కువ మంది ఆడియెన్స్ ఎట్రాక్ట్ అయ్యారు. దీని వల్ల డిఫరెంట్ సినిమాలను ఆడియెన్స్ చూడటం ప్రారంభించారు. సో మన కథను కూడా ఆడియెన్స్ ఆదరిస్తారనే ధైర్యంతోనే రాజుగారికి కథ చెప్పాను.
నిజానికి రాజుగారు ఈ కథను ఓకే చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. - సుహాస్ సినిమాలోని తన పాత్రకు న్యాయం చేశారా!
- నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా గొప్పగా న్యాయం చేశారు. సుహాస్గారు మాట్లాడుతుంటే మనమే అక్కడ నిలబడి మాట్లాడుతున్నట్లు ఉంటుంది.
- ‘జనక అయితే గనక’ కథను ముందుగా నాగ చైతన్యగారికి చెప్పారా!
- చెప్పానండి.. కొన్నాళ్లపాటు ట్రావెల్ కూడా జరిగింది. అయితే అదే సమయంలో ఆయన శేఖర్ కమ్ములగారి ప్రాజెక్ట్‌తో బిజీగా మారారు. తర్వాత ఆయన కంటిన్యూగా సినిమాలు చేస్తూ వచ్చారు. ఈ టైమ్‌లో మన కథలు కూడా పాతవి అయిపోతాయి కదా!. ఏం చేయాలని ఆలోచిస్తున్న సమయంలో రాజుగారు సుహాస్‌ను సజెస్ట్ చేశారు. ఆయనకు నచ్చటంతో వెంటనే ఓకే చేశారు. సినిమా సెట్స్ పైకి వెళ్లింది.
- ఇలాంటి కాన్సెప్ట్ తెలుగు ఆడియెన్స్‌కు ఎంత వరకు నచ్చుతుందని అనుకుంటున్నారు?
- సీనియర్ ఎన్టీఆర్‌గారు, చిరంజీవి వంటి స్టార్ హీరోలు లేడీ గెటప్స్ వేసినప్పుడు ఆడియెన్స్ ఆదరించారు. మాస్ ఇమేజ్ ఉన్న హీరోలు కొత్తగా ప్రయత్నించినప్పుడు ప్రేక్షకులు ఆదరించారు. అందువల్లే గొప్ప సినిమాలు వచ్చాయి. తెలుగు ఆడియెన్స్ దేవుళ్లు. ఈ విషయాన్ని ప్రశాంత్ నీల్గారు కూడా చాలా సార్లు చెప్పారు. లాక్డౌన్ తర్వాత జాతిరత్నాలు, ఉప్పెన వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. సినిమా బావుంటే తెలుగులో సినిమాలు సూపర్ హిట్. ప్రేమలు, మంజిమల్ బాయ్స్ వంటి మలయాళ సినిమాలను తెలుగు ప్రేక్షకులు అద్భుతంగా ఆదరించారు. మన ఆడియెన్స్ ఈ విషయంలో ఎక్స్ట్రార్డినరీ.
- విజయ్ బుల్గానిన్ మ్యూజిక్.. ఇతర టెక్నికల్ టీమ్ సపోర్ట్ గురించి చెప్పండి?
- రీసెంట్‌గానే విజయ్ బుల్గానిన్గారికి ఫిల్మ్ ఫేర్ అవార్డ్ వచ్చింది. ఆయన తన సంగీతంతో సినిమాకు ప్రాణం పోశారు. కెకెగారు లిరిక్స్ అందించారు. ఈ మూవీలోని నా పెళ్లాం పాట ట్రెండింగ్‌లో ఉంది. నాలుగు పాటలున్నాయి. అలాగే సినిమాటోగ్రాఫర్ సాయిశ్రీరామ్‌గారు ఇచ్చిన విజువల్స్, ఆర్ట్ డైరెక్టర్ రామ్ కుమార్, ఎడిటర్ పవన్, కాస్ట్యూమ్స్ డిజైనర్ భరత్ గాంధీ ఇలా అందరూ ఇచ్చిన సపోర్ట్‌తో మంచి సినిమాను తెరకెక్కించాను. ఓ డైరెక్టర్‌గా నేను నా టీమ్‌తో చాలా కంఫర్ట్‌గా వర్క్ రాబట్టుకోగలిగాను.
- మూవీలో అడల్ట్ థీమ్ ఏమైనా టచ్ చేస్తున్నారా?
- జనక అయితే గనక సినిమాను చూస్తే అడల్ట్ థీమ్ మూవీ అనరు. ఎందుకంటే మన ఇంట్లో పెళ్లైన వాళ్లుంటారు. ఏదైనా గుడ్ న్యూస్ ఉందా అని పెద్దలు వాళ్లని అడుగుతుండటాన్ని మనం గమనించే ఉంటాం. అలా అడగటం అడల్ట్ థీమ్ ఏం కాదు కదా!. కానీ దాన్ని అడల్ట్ థీమ్ అని కొందరు అనుకుంటున్నారు. ఇక సినిమా విషయానికి వస్తే జనక అయితే గనక.. అందరూ చూసే సినిమా. పిల్లలు కావాలా..వద్దా అనుకునే పాయింట్ చుట్టూ తిరిగే కథ. ఓ వ్యక్తిగా నేను అలాంటి సినిమాలు చూడను, తీయను.. ఎంకరేజ్ కూడా చేయను. రాజుగారి నిర్మాత ఉన్నప్పుడు మన పెన్ అలాంటి పదాలు రాయదు. జంధ్యాలగారు నాకు చాలా బాగా నచ్చిన రైటర్. ఆయన స్టైల్లో చాలా హెల్దీ హ్యుమర్ సినిమాలో ఉంటుంది. ఎక్కడా వల్గారిటీ ఉండదు. ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ సినిమాను చూడలేకపోతే, ఓ డైరెక్టర్‌గా నేను ఫెయిల్ అయినట్లేనని భావించే కథను రాశాను. ఓ రైటర్‌గా మన మూలాల్లోని ఎమోషన్స్‌ను చెప్పటానికి ఇష్టపడతాను. అందరికీ అవి కనెక్ట్ అవుతాయని అనుకుంటాను. ఈ మూవీ మగవాళ్లకు ఎంత నచ్చుతందో మహిళలకు కూడా అంతే బాగా నచ్చుతుంది.
- సుహాస్ ఈ సినిమా చేసే క్రమంలో ఎలా స్పందించారు?
- సుహాస్గారు సినిమాకు ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అయ్యారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఆయన సతీమణి డెలివరీ జరిగింది. సినిమాలో భార్యాభర్తల మధ్య సన్నివేశాలు జరుగుతున్నప్పుడు, దానికి ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యి చేశారు. నేను కూడా సెట్స్‌లో షూట్ చేస్తున్నప్పుడు ఎమోషనల్‌గా కనెక్ట్ అయిన సన్నివేశాలు చాలానే ఉన్నాయి. ఆడియెన్స్ కూడా అలాగే కనెక్ట్ అవుతారని నేను అనుకుంటున్నాను.
- హీరోయిన్ సంగీర్తనను ఎంపిక చేసుకోవటానికి కారణం?
- ‘జనక అయితే గనక’ కోసం చాలా మంది హీరోయిన్స్‌ను అనుకున్నాం. కొంత మందిని ఆడిషన్ కూడా చేశాం. ఓసారి ఇన్‌స్టాగ్రామ్‌లో సంగీర్తన ఫొటోలు చూసి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేశాను. తెలుగులో ఏదో చిన్న సినిమా చేస్తుందని చెప్పారు. పిలిపించి, ఆడిషన్ చేశాను. లాంగ్వేజ్ కోసం వర్క్‌షాప్స్ చేశాను. ఆమెకు తెలుగు కాస్త టచ్ ఉండటంతో డబ్బింగ్ కూడా ఆమె చెప్పింది.
*దిల్‌రాజు ఎలాంటి సలహాలు ఇచ్చారు? - కథ వినగానే దిల్‌రాజుగారు సినిమా చేద్దామని అన్నారు. మేకింగ్ విషయంలో ఆయన ఎక్కడా ఇన్వాల్వ్ కాలేదు. ఆయనకున్న అనుభవంతో ఎడిటింగ్ సైడ్, రీరికార్డింగ్ సైడ్ మాత్రం కొన్ని సలహాలు ఇచ్చారు.
- ‘జనక అయితే గనక’ సినిమా విషయంలో చివరగా ఆడియెన్స్‌కు ఏం చెబుతారు?
- ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్లకు నచ్చే సినిమా ‘జనక అయితే గనక’. కుదిరితే రెండు జనరేషన్స్ కలిసి చూస్తే బావుంటుంది. ఓ ఫ్యామిలీ ఈవెంట్‌కి వెళ్లినప్పుడు ఎలాంటి ఫీలింగ్ వస్తుందో ఈ సినిమా చూసినప్పుడు అలాంటి ఫీలింగే వస్తుంది. మన లైఫ్‌లో చాలా ఫ్రస్టేషన్స్ ఉంటాయి. వచ్చి సినిమా చూసి, సరదాగా నవ్వుకుని, అక్కడక్కడ ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేలా సినిమా ఉంటుంది.