
ఘాటి లో చేసిన క్యారెక్టర్ కెరీర్ లో ఐకానిక్ రోల్ అవుతుంది – చైతన్య రావు
క్వీన్ అనుష్క శెట్టి మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా ఘాటి. విక్రమ్ ప్రభు మేల్ లీడ్ గా నటించిన ఈ చిత్రానికి విజనరీ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. UV క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు. ఈ చిత్రంలో చైతన్య రావు కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో సినిమా హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. సెప్టెంబర్ 5న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపధ్యంలో యాక్టర్ చైతన్య రావు విలేకరలు సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.
ఘాటిలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఈ ప్రాజెక్టులోకి ఎలా ఎంటరయ్యారు?
-ప్రొడ్యూసర్ రాజీవ్ గారు కాల్ చేసి క్రిష్ గారిని కలవమన్నారు. క్రిష్ గారు కథ చెప్పారు. అద్భుతంగా ఉంది. తర్వాత నా క్యారెక్టర్ గురించి చెప్పారు. అసలు ఆ క్యారెక్టర్లో నన్ను ఎలా ఊహించుకున్నారో అర్థం కాలేదు. చాలా సీరియస్ అండ్ వైలెంట్ రోల్. లుక్ కోసం చాలా టైం పట్టింది. దాదాపు రెండు రోజులపాటు రకరకాల లుక్స్ ట్రై చేసాము. ఫైనల్‌గా ఈ లుక్‌ని ఫైనల్ చేసాము.
ఫస్ట్ టైం విలన్‌గా చేస్తున్నారు కదా ఎలా అనిపించింది?
-ఇది రెగ్యులర్ విలన్‌లాగా ఉండదు. డైరెక్టర్ క్రిష్ గారు ఇందులో నేను విలన్‌లాగా చూడట్లేదు. ఒక మెయిన్ క్యారెక్టర్లాగే చూస్తున్నాను అని చెప్పారు. ఈ సినిమాలో నాది రోల్ చాలా కీలకంగా ఉంటుంది. గుర్తుండిపోయే క్యారెక్టర్. ఇదొక ఐకానిక్ క్యారెక్టర్ అవుతుందనే నమ్మకం ఉంది.
-క్రిష్ గారు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. ఇందులో నాకు ఒక మ్యానరిజం ఉంటుంది. ఒక యాక్టర్‌గా నా వైపు నుంచి కొన్ని ఆలోచనలు చెప్పాను. అలాగే క్రిష్ గారు చాలా ఇన్పుట్స్ ఇచ్చారు. క్యారెక్టర్ చాలా అద్భుతంగా వచ్చింది.
ఘాట్స్‌లో షూట్ చేయడం ఎలా అనిపించింది?
-ఈ సినిమాని ఈస్ట్రన్ ఘాట్స్‌లో షూట్ చేసాము. అక్కడ షూట్ చేయడం చాలా చాలెంజింగ్. ఇందులో ఒక జలపాతం సీన్ ఉంది. ఆ సీన్ చేయడం చాలా రిస్కీ. అదో ఎక్స్ట్రార్డినరీగా వచ్చింది. అనుష్క గారు చాలా రిస్క్‌తో ఆ సీక్వెన్స్ చేశారు. అది మీరు చూసినప్పుడు చాలా థ్రిల్ అవుతారు.
క్రిష్ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
-క్రిష్ గారితో వర్క్ చేయాలని అందరికీ ఉంటుంది. నాకు ఈ సినిమాతో అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. ఆయన ప్రతి ఒక్కరి సజెషన్స్‌ని వింటారు. చాలా ఫ్రీడమ్ ఇస్తారు. ఈ క్యారెక్టర్‌కి నేను పర్ఫెక్ట్గా యాప్ అవుతానని ఆయన బలంగా బిలీవ్ చేశారు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని భావిస్తున్నాను.
ఫస్ట్ టైం విలన్ రోల్ చేయడం ఎలా అనిపించింది?
-ఈ రోజుల్లో విలన్ హీరో అన్నీ రోల్స్‌ని ఆడియన్స్ సమానంగా ఆదరిస్తున్నారు. యాక్టర్‌గా అన్ని క్యారెక్టర్లు చేయాలని ఉంటుంది. సత్యదేవ్, ఫహద్ ఫాజిల్ అన్ని రకాల పాత్రలు చేస్తున్నారు. నేను కూడా ఆ స్పేస్‌లోనే చూస్తున్నాను.
అనుష్క గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
-ఫస్ట్ నమ్మబుద్ధి కాలేదు. నేను అనుష్క గారికి చాలా పెద్ద ఫ్యాన్‌ని. చింతకాయల రవి నా ఫేవరెట్ సినిమా. ఆ సినిమాని 30 సార్లు చూసి ఉంటాను. ఆమె బిగ్ లేడీ సూపర్ స్టార్. వెరీ స్వీట్ పర్సన్. అనుష్క గారితో వర్క్ చేయడం వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అనుష్క గారిని లైఫ్‌లో ఒకసారి చూస్తే చాలు అనుకున్నాను. అలాంటిది కలిసి నటించడం అనేది వెరీ మెమొరబుల్.
ఈ సినిమాలో విజువల్స్ ఎలా ఉండబోతున్నాయి?
-మనోజ్ వండర్ఫుల్ టెక్నీషియన్. అద్భుతమైన విజువల్స్ ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత అతనికి ఇంకా అద్భుతమైన అవకాశాలు వస్తాయి.
అలాగే మ్యూజిక్ డైరెక్టర్ సాగర్ నాగవల్లి కూడా వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు. విజువల్స్ మ్యూజిక్ నెక్స్ట్ లెవల్లో ఉంటాయి.
యూవీ క్రియేషన్స్‌లో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
-యూవీ లో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్పీరియన్స్. వాళ్లు పెద్ద స్టార్స్‌ని చూసుకున్నట్టు చూసుకుంటారు. వాళ్ల ట్రీట్మెంట్ చాలా అద్భుతంగా ఉంటుంది. యాక్టర్స్‌ని దేవుళ్లులాగా చూస్తారు. చాలా గొప్ప ప్రొడ్యూసర్స్.
కొత్తగా ప్రాజెక్ట్స్ సైన్ చేసారా?
-మయసభకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఘాటి ఇప్పుడు రిలీజ్ కాబోతుంది. ఈ రెండు కూడా నా కెరీర్లో బిగ్గెస్ట్ పిల్లర్స్లాంటి ప్రాజెక్ట్స్. డైరెక్టర్ క్రిష్ గారు, దేవాకట్ట గారు ఇద్దరూ ఒకటే మాట చెప్పారు. ఈ రెండు ప్రాజెక్ట్స్ బయటకు వచ్చేంతవరకు కొత్త సినిమాల గురించి ఆలోచించవద్దు అన్నారు. ఈ సినిమాల తర్వాత కచ్చితంగా నా కెరీర్ మరో మలుపు తిరుగుతుందని చెప్పారు. వాళ్లు చెప్పింది నిజమౌతుంది.
-ప్రస్తుతం క్రాంతి మాధవ్ గారితో ఒక సినిమా చేస్తున్నాను. దీంతోపాటు ఇంకొన్ని కథలు కూడా రెడీగా ఉన్నాయి. త్వరలోనే వాటికి సంబంధించిన అనౌన్స్మెంట్స్ వస్తాయి.
ఆల్ ది బెస్ట్
థాంక్యూ