
అల్లరి నరేష్ గారితో చేస్తున్న సినిమా ష్యూర్ షాట్ సూపర్ హిట్. సంయుక్త గారితో బ్లాక్ గోల్డ్ రీ స్కేల్ లో చేస్తున్నాం – రాజేశ్ దండా
హాస్య మూవీస్ బ్యానర్ పై సామజవరగమన, ఊరు పేరు భైరవకోన, కే రాంప్ లాంటి వరుస బ్లాక్ బస్టర్స్ అందించిన సక్సెస్ఫుల్ నిర్మాత రాజేశ్ దండా. ప్రస్తుతం ఆయన ప్రొడక్షన్ నుంచి అల్లరి నరేశ్ హీరోగా ఒక సినిమా, సంయుక్త ప్రధాన పాత్రలో “బ్లాక్ గోల్డ్” చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. మార్చి 19 ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన చేస్తున్న తాజా ప్రాజెక్ట్స్, భవిష్యత్ ప్రణాళికల గురించి విలేకరులతో ముచ్చటించారు.
ఉగాది, మీ బర్త్‌డే ఒకేరోజు రావడం ఎలా అనిపించింది?
-ఉగాది, నా బర్త్‌డే ఒకేరోజు రావడం చాలా సర్ ప్రైజ్ గా అనిపించింది. కొత్త సంవత్సరంలో బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోవడం ఇదే ఫస్ట్ టైమ్, దాదాపు 15 ఏళ్ల తర్వాత ఇలా జరిగింది.
-గత ఏడాది దీపావళికి కె రాంప్ సినిమా రిలీజ్ అయి సూపర్ హిట్ అయ్యింది. అదే ఊపులో మంచి మంచి ప్రాజెక్ట్స్ చేస్తూ ముందుకు వెళ్తున్నాం.
మీ బ్యానర్ నుంచి సినిమా వస్తే కథ కొత్తగా ఉంటుందనే నమ్మకం వుంది. కథలు ఎలా సెలెక్ట్ చేస్తారు?
-నేను చేసే సినిమాల్లో కథలో ఒక కొత్త పాయింట్ ఉండేలా చూసుకుంటాను. విన్నప్పుడు ఎంజాయ్ చేయాలి. అలాగే స్క్రీన్ మీద అది ఎలా కనిపిస్తుంది అన్నదీ ముందే చూసుకుంటాను. సామజవరగమన, కేరాంప్, భైరవకొన..ఇలా అన్ని సినిమాల్లో డిఫరెంట్ పాయింట్స్ ఉంటాయి.
-డిస్ట్రిబ్యూటర్‌గా చాలా సినిమాలు చూసిన అనుభవం ఉంది. ఏది పనిచేస్తుంది, ఏది పనిచేయదు అన్న ఐడియా వుంటుంది. అది స్క్రిప్ట్ సెలెక్షన్లో నాకు చాలా హెల్ప్ అయింది.
మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది?
నిజానికి నేను ప్రొడ్యూసర్ అవ్వాలని అనుకోలేదు. ఎంసీఏ చదివి సాఫ్ట్వేర్ ఫీల్డ్‌లోకి వెళ్లాను. కానీ అనుకోకుండా స్వామి రారా సినిమాతో డిస్ట్రిబ్యూటర్‌గా మారాను. ఆ తర్వాత సరిలేరు, మాస్టర్ వంటి సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశాను. అనిల్ సుంకర గారితో పరిచయం వల్ల ప్రొడక్షన్ నేర్చుకున్నాను. ఆయనతో కలిసి ట్రావెల్ అవుతూ చాలా విషయాలు నేర్చుకున్నాను. తర్వాత నాంది సినిమాతో ప్రొడ్యూసర్‌గా ఎంట్రీ ఇచ్చాను. డిస్ట్రిబ్యూషన్ అనుభవం నాకు చాలా ఉపయోగపడింది.
బడ్జెట్ కంట్రోల్ ఎలా చేస్తారు?
-నేను ఎక్కువగా కొత్త దర్శకులతోనే పని చేశాను. ప్రొడక్షన్లో ప్రతిదీ దగ్గరుండి చూసుకుంటాను. అందుకే అనుకున్న దానికంటే తక్కువ రోజుల్లో షూటింగ్ పూర్తి చేయగలుగుతున్నాం.
మీకు నిరాశ కలిగించిన సినిమాలు ఏమైనా ఉన్నాయా?
బచ్చలమల్లి తరహా కథ అప్పటివరకు రాలేదు. ఖచ్చితంగా కొత్తగా ఉంటుందని బలంగా నమ్మాం. అలాగే మజాకా సినిమాపై కూడా మంచి అంచనాలు పెట్టుకున్నాం. కాకపోతే ఆ రెండు మేము అనుకున్నంత స్థాయిలో రాణించలేదు. అయితే ఈ రెండు సినిమాలు కూడా ఓటీటీకి వచ్చిన తర్వాత అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
సంయుక్తతో చేస్తున్న “బ్లాక్ గోల్డ్” గురించి?
గన్ పట్టుకొని ఒక పోలీస్ ఆఫీసర్, గన్ మాత్రమే వాడే విలన్ మధ్య జరిగే కథ ఇది. చాలా కొత్త పాయింట్. భారీ స్కేల్లో తీస్తున్నాం. సంయుక్త గారికి ఇది చాలా కొత్త పాత్ర అవుతుంది. ఇంకా ఐదు రోజుల టాకీ షూటింగ్ మిగిలి ఉంది. జూన్ లేదా జూలైలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం.
నరేష్ గారి సినిమా గురించి?
-నరేస్గ్ గారి సినిమా షూటింగ్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్‌కు పూర్తవుతుంది. సమ్మర్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. ఇది పూర్తిగా ఎంటర్టైన్మెంట్ జోనర్లో ఉంటుంది. నరేష్ గారు చాలా రోజుల తర్వాత ఒక ఫుల్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. నాంది, బచ్చలమల్లి లాంటి సీరియస్ సినిమాల తర్వాత చేస్తున్న కంప్లీట్ ఎంటర్తింర్. సూపర్ హిట్ అవుతుందనే కాన్ఫిడెన్స్ ఉంది. త్వరలోనే టైటిల్ అనౌన్స్ చేస్తాం.
అల్లు శిరీష్, ఆది సాయికుమార్, అడివి శేష్ సినిమాల అప్డేట్స్?
ఆది సాయికుమార్ గారితో శంభాల రిలీజ్‌కు ముందే ఒక కథ ఫిక్స్ చేశాం. ఈ నెల 27న పూజ ఉంటుంది. అలాగే అల్లు శిరీష్ గారితో సోలో లైఫ్ ఫేం సుబ్బు డైరెక్షన్లో ఒక సినిమా ఉంటుంది. ఈ రెండు సినిమాలు ఒకేసారి స్టార్ట్ చేస్తాం. అడివి శేష్ గారితో కూడా ఒక సినిమా డిస్కషన్లో ఉంది.
సామజవరగమన సీక్వెల్ ఎప్పుడు?
సామజవరగమన సీక్వెల్ కోసం రైటర్స్ పని చేస్తున్నారు. ఈ ఏడాది కథ పూర్తి అయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాం.
ఈటీవీ విన్ తో చేయబోయే సినిమా?
-అది కోర్ట్ రూమ్ డ్రామా. ఒక రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా ఉంటుంది. చాలా కొత్తగా పాయింట్. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఈ సినిమాని నేరుగా థియేటర్లలోనే రిలీజ్ చేస్తాం.
ప్రొడ్యూసర్స్ కేవలం డబ్బులు పెట్టేవాళ్లే అన్న అభిప్రాయం జనంలోకి వెళ్ళిపోయింది కదా.. దీనిపై మీ అభిప్రాయం?
ప్రొడ్యూసర్ కచ్చితంగా కథలో, షూటింగ్లో ఇన్వాల్వ్ కావాలి. ప్రతిరోజు సెట్స్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. కేవలం మేనేజర్ల మీద ఆధారపడకుండా ప్రొడ్యూసర్ స్వయంగా ఇన్వాల్వ్ అయితే బడ్జెట్లు కూడా కంట్రోల్లో ఉంటాయి. నా వరకూ ప్రాజెక్ట్‌లో ఇన్వాల్వ్ అవుతాను.
చిన్న సినిమాల రిలీజ్ కష్టమైయ్యే పరిస్థితి వుంది కదా?
కొత్త, చిన్న నిర్మాతలకు ఇండస్ట్రీ మీద పూర్తి అవగాహన ఉండాలి. సినిమా తీసిన తర్వాత దాన్ని ఎలా రిలీజ్ చేయాలి అన్నది తెలుసుకోవాలి. ఇప్పుడు ఓటీటీలు కూడా వారికి నచ్చిన సినిమాలనే తీసుకుంటున్నారు. కాబట్టి మంచి కథ, కంటెంట్ మీద నమ్మకం పెట్టుకుని సినిమాలు చేయాలి.
ఓటీటీలు ప్రొడక్షన్లోకి వస్తే ప్రభావం ఉంటుందా?
ఓటీటీలు ప్రొడక్షన్లోకి వస్తారనే వార్తలు ఉన్నాయి. నేను ఇప్పటికే కొన్ని ప్రాజెక్ట్స్‌లో వాళ్లతో పని చేశాను. ఇట్లు మారేడుమిల్లి, బచ్చలమల్లి జీ5 వారికి కలసి చేశాను. వాళ్లు లోకల్ ప్రొడ్యూసర్లతో కలిసి పనిచేస్తే మంచిదే. కానీ పూర్తిగా వాళ్లే ప్రొడక్షన్ తీసుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. అప్పుడైతే అవకాశాలు కొంచెం తగ్గే అవకాశం ఉంది.
మీ డ్రీమ్ ప్రాజెక్ట్?
-నాకు ప్రత్యేకంగా డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ ఏమీ లేదు. నేను మంచి లవ్ స్టోరీ చేయలేదు. గులాబీ, నిన్నే పెళ్లాడతా తరహాలో యూత్, ఫ్యామిలీ అందరూ చూడగలిగే ఒక మంచి లవ్ స్టోరీ చేయాలని ఉంది. కథలు వింటున్నాను. ఖచ్చితంగా చేస్తాను.
టాప్ స్టార్స్‌తో ప్రాజెక్ట్స్ ఎప్పుడు చేస్తున్నారు?
నెక్స్ట్ ఇయర్లో ఒక పెద్ద సినిమా ఖచ్చితంగా ఉంటుంది. ప్రస్తుతం డిస్కషన్స్ జరుగుతున్నాయి. త్వరలో అనౌన్స్ చేస్తాం.
ఆల్ ది బెస్ట్
-థాంక్ యూ
