Lopalliki Ra Cheptha 4th Single Tik Tok Chedama.. Released by

Kalki 2898 AD | ప్రభాస్ కల్కి 2898 ఏడీలో లార్డ్ కృష్ణగా కనిపించింది ఎవరో తెలుసా..?
Kalki 2898 AD | గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas)-నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంపౌండ్ నుంచి వచ్చిన సైన్స్ ఫిక్షన్ జోనర్ ప్రాజెక్ట్ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). జూన్ 27 (గురువారం) ప్రపంచవ్యా్ప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. విడుదలైన అన్ని కేంద్రాల్లో పాజిటివ్ టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది.

నాగ్ అశ్విన్ కొన్ని క్యారెక్టర్ల గురించి రివీల్ చేయకపోవడమే కల్కి 2898 ఏడీపై మరింత హైప్ అవడానికి కారణమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కొన్ని విషయాలను బయటకు చెప్పకుండా సినిమాపై క్యూరియాసిటీ పెంచేశాడు నాగ్ అశ్విన్. ఈ క్రేజీ డైరెక్టర్ సీక్రెట్‌గా పెట్టిన వాటిలో లార్డ్ కృష్ణ పాత్ర ఒకటి. సినిమాలో ముఖ్యమైన పాత్ర ఇది. ఈ రోల్లో ఎవరు కనిపించారనేది చెప్పకుండా మీ అభిమాన హీరోలను ఊహించుకోండి అంటూ చెప్పకనే చెప్పేశాడు.
ఆన్లైన్లో చాలా కాలంగా నెలకొన్న మిస్టరీ వీడింది. లార్డ్ కృష్ణ పాత్రలో కనిపించింది ఎవరో తెలుసా..? నటుడు కృష్ణకుమార్. సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా సినిమాలో సూర్య స్నేహితుడిగా, పైలట్‌గా కనిపించాడు కృష్ణకుమార్. తెలుగు సినిమా ఖ్యాతిని పెంచే ఇలాంటి సినిమాలో లార్డ్ కృష్ణగా నటించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానన్నాడు కృష్ణకుమార్. ఇక ఈ పాత్రకు తమిళ నటుడు అర్జున్ దాస్ (బుట్టబొమ్మ ఫేం) అందించిన వాయిస్ ఓవర్ మరో హైలెట్‌గా చెప్పొచ్చు.
ఈ యాక్టర్ నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాడు. కెరీర్ తొలినాళ్లలోనే కల్కి 2898 ఏడీ లాంటి అద్భుతమైన ప్రాజెక్టులో నటించే ఛాన్స్ కొట్టేసిన కృష్ణకుమార్.. ప్రస్తుతం సినిమా సక్సెస్‌ను పుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక ఎవరూ ఊహించని విధంగా పాపులర్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మను సిల్వర్ స్క్రీన్‌పై చూపించి అందరి ఫోకస్ సినిమాపై పడేలా చేసుకున్నాడు నాగ్ అశ్విన్.