
Happy Birthday to Darling of Millions Evergreen Star Prabhas
For Rebel fans, Diwali isn’t the only celebration this season – it’s also the birthday of Rebel Star Prabhas. Every year on October 23, fans and movie lovers celebrate this day in a grand way. Prabhas’ birthday has now become a nationally recognized occasion at a pan-India level. He has a massive fan base not just across India, but all over the world – from the US and UK to Japan and beyond. The box office numbers his films generate overseas stand as proof of his universal appeal. That’s why every film he takes on is becoming a true pan-world project.
With his stardom, charisma, performance, screen presence, and record-breaking box office success, Prabhas has taken the name of Telugu cinema to international heights. While many actors earn fame for themselves, Prabhas is one of the rare stars who brings recognition to the entire Tollywood industry. His birthday celebrations usually include re-releases of his blockbuster films and exciting updates about his upcoming projects. On October 31, his career milestone film Baahubali: The Epic will be re-released – combining both Baahubali films into a single epic film, generating huge excitement among fans and movie lovers alike.
Prabhas continues to build a line-up of grand pan-world movies that make every Telugu person proud. His upcoming film with director Maruthi, The Raja Saab, is all set for a grand Sankranti release on January 9. In this romantic horror comedy, Prabhas will appear in a vintage look that fans have been missing for a long time. The promotional content is already receiving an overwhelming response, hinting at the records the film is likely to break at the box office.
There are high expectations for his film with director Hanu Raghavapudi, produced by Mythri Movie Makers. And Spirit directed by Sandeep Reddy Vanga, is already generating sky-high anticipation. Other exciting projects in Prabhas’ lineup include Salaar 2 and Kalki 2, both of which are thrilling fans with their potential. This year, in Manchu Vishnu’s Kannappa, Prabhas appeared in the powerful role of Rudra, which turned out to be the major highlight of the film. His divine performance in that role captivated audiences.
A flawless life, humble nature, unmatched generosity, and unforgettable hospitality – these qualities have made Prabhas the beloved “Darling” of millions. His stamina as a star is reflected in box office records, while the nickname “Darling” reflects his greatness as a person. As he continues to deliver back-to-back successes on the Telugu silver screen, let’s wish him many more such birthdays to come.
Happy Birthday to Rebel Star Prabhas.
ఎవర్ గ్రీన్ స్టార్… రెబల్ స్టార్ ప్రభాస్
రెబల్ ఫ్యాన్స్ కు దీపావళితో పాటు వచ్చే పండుగ రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే. ఈ నెల 23న ఆయన పుట్టిరోజును ఘనంగా సెలబ్రేట్ చేస్తుంటారు ఫ్యాన్స్, మూవీ లవర్స్. ప్రభాస్ బర్త్ డే ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో నోటెడ్ అకేషన్ గా మారింది. దేశం నలుమూలలా ప్రభాస్ కు అభిమానులు ఉన్నారు, ఆయన సినిమాలను ఇష్టంగా చూసేవాళ్లున్నారు. ఓవర్సీస్ లో యూఎస్, యూకే, జపాన్..ఇలా ప్రతి దేశంలోనూ ప్రభాస్ సినిమాల కోసం ఎదురుచూస్తుంటారు. తన సినిమాలకు ఆయా దేశాల్లో వచ్చే బాక్సాఫీస్ కలెక్షన్స్ ప్రభాస్ యూనివర్సల్ క్రేజ్ కు నిదర్శనంగా నిలుస్తుంటాయి. అందుకే ప్రభాస్ చేసే ప్రతి సినిమా ట్రూ పాన్ వరల్డ్ మూవీ అవుతోంది.
తన స్టార్ డమ్, ఛరిష్మా, పర్ ఫార్మెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్, రికార్డ్ స్థాయి బాక్సాఫీస్ వసూళ్లతో ప్రభాస్ తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకు చేర్చారు. ఇండస్ట్రీలో పేరు తెచ్చుకునే హీరోలను చూస్తుంటాం…టాలీవుడ్ కే పేరు తెస్తున్న అరుదైన స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్. ఆయన బర్త్ డేకు తన బ్లాక్ బస్టర్ మూవీస్ రీ రిలీజ్ తో పాటు కొత్త సినిమాల అప్డేట్స్ సందడి చేస్తుంటాయి. ఈ నెల 31న ప్రభాస్ కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచే మూవీ బాహుబలి ది ఎపిక్ రీ రిలీజ్ అవుతోంది. బాహుబలి రెండు చిత్రాలు కలిసి ఒకే పార్ట్ గా విడుదలకు వస్తుండటం మూవీ లవర్స్, ఫ్యాన్స్ లో ఆసక్తి కలిగిస్తోంది.
తెలుగువారు గర్వపడేలా ప్రభాస్ భారీ పాన్ వరల్డ్ మూవీ లైనప్ కంటిన్యూ చేస్తున్నారు. డైరెక్టర్ మారుతితో ప్రభాస్ చేస్తున్న ది రాజా సాబ్ సినిమా వచ్చే సంక్రాంతికి జనవరి 9న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. రాజా సాబ్ మూవీలో ప్రభాస్ ను మనం ఇంతకాలం మిస్ అయిన వింటేజ్ లుక్ లో రొమాంటిక్ హారర్ కామెడీలో చూడబోతున్నాం. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కు వస్తున్న హ్యూజ్ రెస్పాన్స్ చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద క్రియేట్ చేయబోయో రికార్డులు కళ్లముందు కదలాడుతున్నాయి. డైరెక్టర్ హను రాఘవపూడి, మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్ లో ప్రభాస్ నటిస్తున్న సినిమాపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. సందీప్ వంగా డైరెక్షన్ లో ప్రభాస్ నటించనున్న స్పిరిట్ సినిమాపై ఇప్పటికే స్కై రేంజ్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రభాస్ క్రేజీ లైనప్ లో రానున్న సలార్ 2, కల్కి 2 ఎగ్జైట్ చేస్తున్నాయి. ఈ ఏడాది మంచు విష్ణు కన్నప్ప సినిమాలో ప్రభాస్ చేసిన రుద్ర క్యారెక్టర్ ఆ చిత్రానికే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రుద్ర పాత్రలో ప్రభాస్ చేసిన డివైన్ పర్ ఫార్మెన్స్ అందరినీ ఆకట్టుకుంది.
మచ్చలేని జీవితం, శత్రువు ఎరుగని వ్యక్తిత్వం, చేతికి ఎముకలేని దాతృత్వం, మర్చిపోలేని ఆతిథ్యం…ఇవన్నీ ప్రభాస్ ను అందరూ ఇష్టపడే డార్లింగ్ లా మార్చేశాయి. స్టార్ గా ప్రభాస్ స్టామినా బాక్సాఫీస్ రికార్డులు చెబితే, అందరూ ప్రేమగా పిలిచే డార్లింగ్ అనే మాట వ్యక్తిగా ఆయన గొప్పదనం చూపిస్తుంది. తెలుగు తెరపై వరుస విజయాలతో ప్రభాస్ మరెన్నో ఇలాంటి పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుందాం. హ్యాపీ బర్త్ డే టు రెబల్ స్టార్ ప్రభాస్.