
VD Launched ‘Cinema La Act Jeshi’ Song from ‘Muthaiya’
The award-winning film Muthayya, featuring K. Sudhakar Reddy, Arun Raj, Poorna Chandra, and Mounika Bomma in lead roles, is gearing up for its release on ETV Win. Directed by Bhaskhar Maurya, the film is jointly produced by Vamsi Karumanchi and Vrinda Prasad under the banners of HY-life Entertainments Private Limited and Fictionary Entertainment LLP. Diwakar Mani serves as both the cinematographer and co-producer.
Today, star hero Vijay Deverakonda officially launched the song Cinema La Act Jeshi’ from the film. Speaking on the occasion, Vijay Deverakonda expressed his happiness in unveiling the song and shared a heartfelt message: “No matter how many challenges come your way, never be afraid to chase your dreams.” He also extended his best wishes to the entire team of Muthayya.
The song ‘Cinema La Act Jeshi’ features a beautiful composition by music director Karthik Rodriguez. Director Bhaskar Maurya penned the lyrics, which reflect the spirit and journey of the character Muthayya. The track is powerfully rendered by Chinna K. This song resonate with Muthayya silver screen aspirations and his emotional depth.
Cast:
K. Sudhakar Reddy, Arun Raj, Poorna Chandra, Mounika Bomma, and others.
Technical Crew:
– Writer & Director: Bhaskhar Maurya
– Producers: Vamsi Karumanchi, Vrinda Prasad
– Production Banners: HY Life Entertainments Pvt. Ltd., Fictionary Entertainment LLP
– Co-Producer & Cinematographer: Divakar Mani
– Associate Producer: Hemanth Kumar CR
– Music: Karthik Rodriguez
– Editor: Sai Murali
– Sound Design & Mixing: Vamsi Priya Rasineni
– Executive Producer: Venkat Krishna
– Art Director: Balu
– PRO: GSK Media (Suresh – Sreenivas)
స్టార్ హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా అవార్డ్ విన్నింగ్ మూవీ ‘ముత్తయ్య’ నుంచి ‘సీనిమాల యాక్ట్ జేశి..’ సాంగ్ రిలీజ్, త్వరలో రిలీజ్ కు రాబోతున్న ‘ముత్తయ్య’
కె. సుధాకర్ రెడ్డి, అరుణ్ రాజ్, పూర్ణ చంద్ర, మౌనికా బొమ్మ ప్రధాన పాత్రల్లో నటించిన అవార్డ్ విన్నింగ్ మూవీ ‘ముత్తయ్య’. ఈ చిత్రాన్ని దర్శకుడు భాస్కర్ మౌర్య రూపొందించారు. హైలైఫ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఫిక్షనరీ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పి బ్యానర్లపై వంశీ కారుమంచి, వృందా ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. దివాకర్ మణి ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ మరియు సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు. త్వరలో ‘ముత్తయ్య’ సినిమా ఈటీవీ విన్ లో ప్రీమియర్ కు రెడీ అవుతోంది.
ఈ రోజు స్టార్ హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ‘ముత్తయ్య’ సినిమా నుంచి ‘సీనిమాల యాక్ట్ జేశి..’ పాటను రిలీజ్ చేశారు. ఈ పాట లాంఛ్ చేయడం సంతోషంగా ఉందని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా భయపడకుండా తమ కలల్ని సాకారం చేసుకోవాలని విజయ్ దేవరకొండ ఈ సందర్భంగా అన్నారు. ‘ముత్తయ్య’ సినిమా టీమ్ కు విజయ్ దేవరకొండ తన బెస్ట్ విశెస్ అందించారు.
‘సీనిమాల యాక్ట్ జేశి..’ పాటను మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ రోడ్రిగ్స్ బ్యూటిఫుల్ ట్యూన్ తో కంపోజ్ చేశారు. దర్శకుడు భాస్కర్ మౌర్య ముత్తయ్య పాత్రను రిఫ్లెక్ట్ చేస్తూ లిరిక్స్ రాయగా, చిన్నా.కె. ఆకట్టుకునేలా పాడారు. ‘సీనిమాల యాక్ట్ జేశి..’ పాట ఎలా ఉందో చూస్తే – ‘సీనిమాల యాక్టు జేశి ఎలిగిపోతవా…బుట్టలల్లుకుంట ఊళ్ళె మిలిగిపోతవా..ముత్తయ్య… తిక్క తిక్క ఈడియోలు జేసుకుంటవా..స్టెప్పులేసి ఎగిరి దుంకి సంపుతుంటవా..ముత్తయ్య…. పేమసైతవా పేళ్లు గోళ్లు గిల్తవా… దేశమంత లొల్లి జేస్తావా… డ్యాన్సు జేస్తవా డయ్యిలాగు జెబుతవా ఓపికంత కూడ వెడ్తావా… ముత్తయ్య..’ అంటూ ముత్తయ్య వెండితెర కలను వర్ణిస్తూ సాగుతుందీ పాట.
నటీనటులు – కె. సుధాకర్ రెడ్డి, అరుణ్ రాజ్, పూర్ణ చంద్ర, మౌనికా బొమ్మ, తదితరులు
టెక్నికల్ టీమ్
రచన, దర్శకత్వం – భాస్కర్ మౌర్య
నిర్మాతలు – వంశీ కారుమంచి, వృందా ప్రసాద్
బ్యానర్స్ – హైలైఫ్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఫిక్షనరీ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పి
సహ నిర్మాత – దివాకర్ మణి
అసోసియేట్ నిర్మాత – హేమంత్ కుమార్ సిఆర్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
సినిమాటోగ్రాఫర్ – దివాకర్ మణి
సంగీతం- కార్తీక్ రోడ్రిగ్స్
ఎడిటర్ – సాయి మురళి
సౌండ్ డిజైన్ & మిక్సింగ్ – వంశీప్రియ రసినేని
ఎగ్జిక్యూటివ్ నిర్మాత – వెంకట్ కృష్ణ
ఆర్ట్ – బాలు