
Maverick Director S.S. Rajamouli Launched Muthayya Trailer
The award-winning film Muthayya, featuring K. Sudhakar Reddy, Arun Raj, Poorna Chandra, and Mounika Bomma in lead roles, is directed by Bhaskhar Maurya. It is jointly produced by Vamsi Karumanchi and Vrinda Prasad under the banners of HY Life Entertainments Pvt. Ltd. and Fictionary Entertainment LLP. Diwakar Mani served as the film’s cinematographer as well as a co-producer. Muthayya is set to stream on ETV Win starting May 1st.
Today, the trailer of Muthayya was officially launched by maverick director S.S. Rajamouli and producer Shobu Yarlagadda. On this occasion, Rajamouli expressed that the trailer moved him deeply and extended his best wishes to the film’s team.
Muthayya tells the heartfelt story of a 60-year-old man whose lifelong dream is to become an actor. Residing in the village of Chennuru, he approaches every film crew that visits his village, requesting a role in their projects. He actively creates social media reels and shorts, and delivers powerful lines in local stage plays, showcasing his strong acting talent.
However, becoming a film actor isn’t easy. His family’s financial condition doesn’t support his ambitions, and he receives little encouragement from his friends or relatives. The trailer touchingly portrays how Muthayya faces these hardships – whether he eventually achieves his dream of acting and screens a film he starred in for the people of his village is what the story beautifully unfolds.
Ompactful line from the trailer captures Muthayya’s inner conflict. The trailer gets everyone’s attention.
Cast:
K. Sudhakar Reddy, Arun Raj, Poorna Chandra, Mounika Bomma, and others.
Technical Crew:
– Writer & Director: Bhaskhar Maurya
– Producers: Vamsi Karumanchi, Vrinda Prasad
– Production Banners: HY Life Entertainments Pvt. Ltd., Fictionary Entertainment LLP
– Co-Producer & Cinematographer: Divakar Mani
– Associate Producer: Hemanth Kumar CR
– Music: Karthik Rodriguez
– Editor: Sai Murali
– Sound Design & Mixing: Vamsi Priya Rasineni
– Executive Producer: Venkat Krishna
– Art Director: Balu
– PRO: GSK Media (Suresh – Sreenivas)
స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి చేతుల మీదుగా అవార్డ్ విన్నింగ్ మూవీ ‘ముత్తయ్య’ ట్రైలర్ రిలీజ్
కె. సుధాకర్ రెడ్డి, అరుణ్ రాజ్, పూర్ణ చంద్ర, మౌనికా బొమ్మ ప్రధాన పాత్రల్లో నటించిన అవార్డ్ విన్నింగ్ మూవీ ‘ముత్తయ్య’. ఈ చిత్రాన్ని దర్శకుడు భాస్కర్ మౌర్య రూపొందించారు. హైలైఫ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఫిక్షనరీ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పి బ్యానర్లపై వంశీ కారుమంచి, వృందా ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. దివాకర్ మణి ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ మరియు సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు. హేమంత్ కుమార్ సిఆర్ అసోసియేట్ ప్రొడ్యూసర్ గా ఉన్నారు. మే 1వ తేదీ నుంచి ‘ముత్తయ్య’ సినిమా ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కు వస్తోంది.
ఈ రోజు స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డ చేతుల మీదుగా ‘ముత్తయ్య’ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ముత్తయ్య మూవీ ట్రైలర్ తన మనసును కదిలించిందని ఈ సందర్భంగా రాజమౌళి అభినందించారు. మూవీ టీమ్ కు ఆయన తన బెస్ట్ విశెస్ అందించారు.
“ముత్తయ్య” ట్రైలర్ ఎలా ఉందో చూస్తే – నటుడు కావాలనేది 60 ఏళ్ల ముత్తయ్య కల. తమ ఊరైన చెన్నూరుకు ఏ సినిమా షూటింగ్ వాళ్లు వచ్చినా తనకో క్యారెక్టర్ ఇమ్మని అడుగుతుంటాడు. సోషల్ మీడియా రీల్స్, షార్ట్స్ చేస్తాడు. నాటకాల్లో బాగా డైలాగ్స్ చెప్పే ముత్తయ్యకు మంచి నటన ప్రతిభ ఉంటుంది. కానీ సినిమా నటుడు కావాలంటే అంత సులువు కాదు. అతని కల నెరవేర్చుకునేందుకు కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించవు. స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి ప్రోత్సాహం అందదు. ఇలాంటి పరిస్థితులన్నీ తట్టుకుని ముత్తయ్య నటుడు కాగలిగాడా, ఏదో ఒక రోజు ఊరి ప్రజలకు తను నటించిన సినిమా పెద్ద తెరపై చూపించాలనే కలను ఎలా నెరవేర్చుకున్నాడు అనేది ట్రైలర్ లో హార్ట్ టచింగ్ గా చూపించారు. కలను వెంటనే నెరవేర్చుకోవాలి, లేదంటే అప్పుడే చంపేసుకోవాలి, కానీ వెంటపెట్టుకుని తిరగకూడదు అంటూ ముత్తయ్య చెప్పే డైలాగ్ అతని క్యారెక్టర్ పడే మానసిక సంఘర్షణను చూపిస్తుంది.
నటీనటులు – కె. సుధాకర్ రెడ్డి, అరుణ్ రాజ్, పూర్ణ చంద్ర, మౌనికా బొమ్మ, తదితరులు
టెక్నికల్ టీమ్
రచన, దర్శకత్వం – భాస్కర్ మౌర్య
నిర్మాతలు – వంశీ కారుమంచి, వృందా ప్రసాద్
బ్యానర్స్ – హైలైఫ్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఫిక్షనరీ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పి
సహ నిర్మాత – దివాకర్ మణి
అసోసియేట్ నిర్మాత – హేమంత్ కుమార్ సిఆర్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
సినిమాటోగ్రాఫర్ – దివాకర్ మణి
సంగీతం- కార్తీక్ రోడ్రిగ్స్
ఎడిటర్ – సాయి మురళి
సౌండ్ డిజైన్ & మిక్సింగ్ – వంశీప్రియ రసినేని
ఎగ్జిక్యూటివ్ నిర్మాత – వెంకట్ కృష్ణ
ఆర్ట్ – బాలు