Big B says he is a fan of Icon Star Allu Arjun’s work
During a recent promotional event, Icon Star Allu Arjun was asked about which Bollywood actor inspires him the most. The pan-Indian action hero chose Amitabh Bachchan, the legendary star. “Amitabh ji inspires me the most. He has a long span of career. I absolutely adore the megastar of the country, Amitabh ji. We have all grown up watching his films. He has got a lot of impact on us in the growing years,” Allu Arjun said, adding how Big B acts with so much grace even at this old age.
Big B today learned about Bunny’s words and shared his reaction on X. The iconic Bollywood hero said that he was so humbled by Allu Arjun’s gracious words. “You give me more than I deserve. We are all such huge fans of your work and talent. May you continue to inspire us all. My prayers and wishes for your continued success!” Amitabh wrote.
In response, Allu Arjun described Amitabh as a superhero. “And listening to words like this from you is surreal. Thank you for your kind words, generous compliments and heartfelt wishes… Humbled by your humility,” Bunny wrote.
The exchange between Amitabh Bachchan and the Icon Star comes at a time when ‘Pushpa 2: The Rule’ is ruling the audience’s mindspace everywhere.
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌పై బిగ్‌బీ అమితాబచ్చన్ ప్రశంసలు
‘పుష్ప-2’లో తన అద్వితీయ నటనతో అందరి నుంచి ప్రశంసలు అందుకుంటున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను ఇప్పుడు కేవలం ఇండియానే కాదు ప్రపంచ మొత్తం హాట్‌టాపిక్‌గా మారాడు. పుష్పరాజ్‌గా ఆయన నట విశ్వరూపంకు అందరూ జేజేలు పలుకుతున్నారు. పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా ఐకాన్‌స్టార్ నటనను అభినందిస్తున్నారు. పుష్ప-2 సాధిస్తున్న అఖండ విజయంపై స్పందిస్తున్నారు. ఇదిలా ఉండగా బాలీవుడ్ మెగాస్టార్, బిగ్‌బీ అమితాబచ్చన్ ట్విట్టర్ వేదికగా ఐకాన్ స్టార్‌పై ప్రశంసల జల్లులు కురిపించారు. వివరాల్లోకి వెళితే.. ఇటీవల ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ” మీమ్మల్ని ఎక్కువగా ఇన్‌స్పయిర్ చేసిన యాక్టర్ ఎవరని యాంకర్ అడిగిన ప్రశ్నకు అల్లు అర్జున్ అమితాబ్ అని సమాధాన మిచ్చాడు. ఆయన సినిమాలు చూసి పెరిగాను. అందుకే ఆయనంటే ఎంతో ఇష్టం. అని అన్నాడు అల్లు అర్జున్. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారడంతో ఆయన వీడియోకు తన స్పందనగా ట్విట్టర్లో స్పందించాడు అమితాబ్. ఆయన సోషల్ మీడియా వేదికగా ” అల్లు అర్జున్ గారు మీ మాటలు నా హృదయానికి చేరాయి. మీరు నా అర్హతకు మించిన కితాబులు ఇచ్చారు. మేమందరం మీ ప్రతిభ, టాలెంట్‌కు అభిమానులం. ఇక మీరు మమ్ముల్ని ఇంకా ఇన్‌స్పయిర్ చేయాలి. మీరు ఇలానే విజయాలు సాధిస్తుండాలని ఆ దేవుడ్ని కోరుకుంటున్నాను. అని ట్విట్ఠర్‌లో స్పందించారు అమితాబ్. ఇక ఈ పోస్ట్ ఈ రోజు ట్విట్ఱర్‌లో ట్రెండింగ్‌గా మారటంతో బన్నీ అమితాబ్ పోస్ట్‌కు రిప్లై ఇచ్చాడు. ” అమితాబ్ గారు మీరు సూపర్‌హీరో మీరు నా గురించి ఇలా మాట్లాడటం ఆనందంగా ఉంది. మీ హృదయం నుండి వచ్చిన ఈ కాంప్లిమెంట్స్ ఎప్పటికి గుర్తుంచుకుంటాను. మీ మంచి మనసుకు నా కృతజ్ఞతలు’ అంటూ అల్లు అర్జున్ స్పందించాడు.