బాలయ్య సినిమా షూటింగ్ లో నటికి ప్రమాదం!
urvashi Rautela injured in shooting
బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెలా ప్రస్తుతం టాలీవుడ్ లో ఎన్ బి కె 109 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ లో భాగంగా ఊర్వశి పాల్గొనగా ఓ భారీ ఫైట్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్నారట. ఈ చిత్రీకరణ లో ఊర్వశి రౌతెలా కిందపడి గాయాల పాలయ్యిందని తెలుస్తోంది. ఆ గాయాల తీవ్రత కు సంబంధించి ఎలాంటి విషయాలు బయటికి రానప్పటికీ, ఊర్వశి రౌతెలా కి ట్రీట్మెంట్ జరుగుతోందని తెలుస్తోంది. ఊర్వశి ప్రాణానికి ఎలాంటి ప్రమాదంలేదని, కానీ చిన్నపాటి గాయాలు కాదని డాక్టర్లు వెల్లడించినట్టు సమాచారమ్. ఫ్రాక్చర్ అయ్యిందని తెలుస్తోంది. కానీ ఆ ఫ్రాక్చర్ ఎక్కడ అయ్యిందనే విషయంలో క్లారటీ లేదు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ఊర్వశి నటిస్తున్న ఎన్ బి కె సినిమా వివరాల్లోకి వెళితే…
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై రూపొందుతోంది. ఈ యాక్షన్ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. కాగా ఈ సినిమాలో ఊర్వశి రౌతెలా కీలక పాత్రలో నటిస్తోంది.