Women are getting emotional after watching The Girlfriend – Allu

మోగ్లీ 2025 – ఈ నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం
తన తొలి చిత్రం ‘బబుల్ గమ్’తో అందరినీ ఆకట్టుకున్న రోషన్ కనకాల తనదైన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. సహజమైన నటన ఫ్రెష్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో అలరించిన రోషన్ ఇప్పుడు కథల ఎంపికలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన ‘మోగ్లీ 2025’ చిత్రంలో నటిస్తున్నారు. కలర్ ఫోటోతో జాతీయ అవార్డును గెలుచుకుని యంగెస్ట్ దర్శకుడిగా గుర్తింపు పొందిన సందీప్ రాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఆసక్తికరమైన టైటిల్, ఫస్ట్ లుక్ తో ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపింది. విభిన్నమైన కథనాలకు పేరొందిన సందీప్ రాజ్ రోషన్‌ను కొత్త కోణంలో చూపించనున్నారని చిత్ర పరిశ్రమలో మంచి అంచనాలు ఉన్నాయి. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కాంటెంపరరీ లవ్ స్టోరీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై TG విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ నెలలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
మోగ్లీ తర్వాత రోషన్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 2025 రెండో అర్ధభాగంలో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. కథల ఎంపిక విషయంలో ఆయన చూపుతున్న చిత్తశుద్ధి సంఖ్య కంటే నాణ్యతను ప్రాధాన్యమిస్తూ సాగే ఆయన నిర్ణయాలు సినిమాపై ఉన్న ఆసక్తిని ప్రతిబింబిస్తున్నాయి. ప్రముఖ నటుడిగా ఎదుగుతున్న రోషన్ కనకాల ఒక్కొక్క అడుగుగా తనదైన ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుంటున్నాడు. ప్రతీ చిత్రంతోనూ కేవలం వారసత్వాన్ని కొనసాగించడం కాదు తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును కూడా సొంతం చేసుకుంటున్నాడు.
