
మల్టీప్లెక్సుల కంటే ఎక్కువ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వాలని అల్లు సినిమాస్నిర్మించాం – అగ్ర నిర్మాత అల్లు అరవింద్
ప్రపంచ స్థాయి సాంకేతికతతో కూడిన ప్రీమియం లార్జ్ స్క్రీన్ ఫార్మాట్‌ను ‘అల్లు సినిమాస్’ హైదరాబాద్‌కు పరిచయం చేస్తోంది. హైదరాబాద్‌కు ఇదొక చారిత్రాత్మక ఘట్టంగా నిలుస్తుంది. నగరంలో తొలి డాల్బీ సినిమా వచ్చింది. హైదరాబాద్‌లోని కోకాపేటలోని 7 ఎకరాల అల్లు స్టూడియోస్ కాంప్లెక్స్‌లో ఉన్న నాలుగు స్క్రీన్ల అల్ట్రా-లగ్జరీ మల్టీప్లెక్స్ అల్లు సినిమాస్‌ను ప్రారంభించినట్లు అల్లు ఎంటర్టైన్మెంట్ గర్వంగా ప్రకటించింది. ఇకపై ల్యాండ్‌మార్క్ వినోద గమ్యస్థానంగా అల్లు సినిమాస్ మారనుంది. హైదరాబాద్‌ను అల్లు సినిమాస్ వరల్డ్ సినిమా మ్యాప్‌లో సరికొత్త స్థాయిలోని నిలబెడుతుంది. హైదరాబాద్‌లో మొట్టమొదటి డాల్బీ సినిమా, ప్రపంచంలోనే అతిపెద్ద డాల్బీ స్క్రీన్లలో ఒకటిగా ‘అల్లు సినిమాస్’ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మైలురాయి ప్రపంచవ్యాప్తంగా ఎంటర్టైన్మెంట్ రంగంలో కొత్త బెంచ్‌మార్క్‌ను నిర్దేశిస్తుంది. ప్రేక్షకులకు ఈ ‘అల్లు సినిమాస్’ అత్యాధునిక సాంకేతికత, లగ్జరీ, సౌకర్యవంతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తుంది. ‘అల్లు సినిమాస్’ ఇచ్చే ఎక్స్‌పీరియెన్స్ గురించి అల్లు అరవింద్ మీడియాతో ముచ్చటించారు. అల్లు సినిమాస్ ప్రారంభోత్సవ సందర్భంగా
*అల్లు అరవింద్ మాట్లాడుతూ* .. ‘రెండేళ్లు కష్టపడి ‘అల్లు సినిమాస్’ను నిర్మించాం. ‘అల్లు సినిమాస్’ను నిర్మించడానికి మూడు కారణాలున్నాయి. యూవీ వంశీ సూళ్లూరుపేటలో లగ్జరీ థియేటర్‌ను కట్టారు. ఆ థియేటర్లో సినిమాని చూడటానికి పక్క ఊర్ల నుంచి కూడా జనాలు వస్తున్నారు. అది చూసి నాకు కూడా ఓ లగ్జరీ థియేటర్ కట్టాలని అనిపించింది. మిషన్ ఇంపాజిబుల్ 6 కోసం ఓ పెద్ద పారిశ్రామికవేత్త ఐమ్యాక్స్ లార్జ్ స్క్రీన్‌లో టికెట్లు కావాలని, పిల్లలు గోల చేస్తున్నారని, కచ్చితంగా టికెట్లు కావాలని అడిగారు. ఆ టికెట్లు నేను ఆయనకు ఇవ్వడంతో చాలా సంతోషించారు. అంటే పిల్లలు కేవలం సినిమాని చూడకుండా, దాన్ని ఎక్స్‌పీరియెన్స్ చేయాలని అనుకుంటున్నారు. ఆ ఎక్స్‌పీరియెన్స్ కోసం ఎంతైనా ఖర్చు పెట్టేందుకు ప్రేక్షకులు రెడీగా ఉన్నారు. అప్పుడు నాకు కొన్ని ఐడియాలు వచ్చాయి. లార్జ్ ఫార్మాట్, కొత్త ఎక్స్‌పీరియెన్స్ కోసం ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. అలా మా ‘అల్లు సినిమాస్’ మొదలైంది. సింగిల్ స్క్రీన్లలో వస్తున్న ఎక్స్‌పీరియెన్స్ ఇప్పుడు జనాలకు సరిపోవడం లేదు. అందుకే ఎక్కువగా మల్టీ ప్లెక్స్‌లకు వస్తున్నారు. సినిమా కంటే.. సినిమాని ఎక్స్‌పీరియెన్స్ చేసేందుకు జనాలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మల్టీప్లెక్సుల కంటే ఎక్కువ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వాలని ‘అల్లు సినిమాస్’ను నిర్మించాం. డాల్బీలో సినిమా చాలా కొత్తగా కనిపిస్తుంది, వినిపిస్తుంది. డాల్బీలోకి మారిన సినిమా విజువల్ పరంగా, సౌండ్ పరంగా అద్భుతంగా ఉంటుంది. 2024లో మేం డాల్బీని సంప్రాదించాం. డాల్బీ సినిమాస్ ఇండియా ప్రతినిథి రాజ్ మాకు ఎంతో సహకరించారు. అమెరికా, జర్మనీ, ఇండియన్ టీం ఇలా అందరం కలిసి ఓ డెబ్బై సార్లు జూమ్ కాల్స్‌లో కలిసి ఉంటాం. ఈ స్క్రీన్‌లో 78 స్పీకర్లు, 165 సౌండ్ ఔట్ లెట్లను బయటకు కనిపించకుండా అమర్చారు. జర్మనీ టీం ఈ స్క్రీన్‌ను చూసి ఆశ్చర్యపోయారు. ‘అల్లు సినిమాస్’ ఇచ్చే ఎక్స్‌పీరియెన్స్ గురించి మీడియానే జనాల్లోకి తీసుకెళ్లాల’ని అన్నారు.
*మరెక్కడా లేని డాల్బీ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్..*
648 మంది కూర్చునే సామర్థ్యం కలిగిన ఈ ఫ్లాగ్షిప్ డాల్బీ సినిమా ఆడిటోరియం ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీన్ సైజులలో ఒకటి. 75 అడుగుల వెడల్పు ఫ్లాట్ యాస్పెక్ట్ రేషియోలో, భారతదేశంలో అతిపెద్ద డాల్బీ సినిమాగా నిలిచింది. హైదరాబాద్‌లో ఇలాంటిది ఇంతకు ముందు లేదన్న సంగతి తెలిసిందే. ఆడిటోరియం డాల్బీ సినిమా డిజైన్ ప్రమాణాల ప్రకారం అమలు చేయబడిన డ్యూయల్ డాల్బీ విజన్ 6P లేజర్ ప్రొజెక్షన్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ప్రపంచంలోనే అత్యంత ప్రీమియం డాల్బీ 3D ద్వారా శక్తిని పొందుతుంది. పిచ్-బ్లాక్ ఆడిటోరియంలు పర్ఫెక్ట్ కాంట్రాస్ట్ కోసం రూపొందించబడ్డాయి. ఎక్స్ట్రీమ్ బ్రైట్ నెస్, డీపర్ బ్లాక్స్, రిచ్లీ వైబ్రెంట్ కలర్స్‌తో ఉత్కంఠభరితమైన విజువల్స్‌ను అందిస్తాయి. 64-ఛానల్ డాల్బీ అట్మాస్ ఇమ్మర్సివ్ ఆడియో సిస్టమ్ ఓవర్ హెడ్‌తో సహా అన్ని దిశల నుండి ధ్వనిని ప్రసారం చేయడం ద్వారా ఓ కొత్త లోకానికి తీసుకెళ్లినట్టుగా అనిపిస్తుంది. పూర్తిగా లీనమయ్యేలా సరికొత్త సినిమాటిక్ అనుభవాన్ని అందిస్తుంది. కర్వ్డ్ (వంపుతిరిగిన) స్టేడియం సీటింగ్ పర్ ఫెక్ట్ వ్యూయింగ్ యాంగిల్‌ను అందిస్తుంది. తద్వారా ప్రేక్షకుడు ఎక్కడ ఏ సీటులో కూర్చున్నా కూడా అత్యుత్తమమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను పొందుతాడు. ఇది కేవలం స్క్రీన్‌గా మాత్రమే కాకుండా ప్రెసిషన్ ఇంజనీరింగ్‌గా నిలుస్తుంది.
*రాజీపడని నాణ్యతతో నిర్మించిన నాలుగు ప్రీమియం స్క్రీన్లు ఇవే..*
ఫ్లాగ్షిప్ డాల్బీ సినిమా కాకుండా మిగిలిన మూడు ఆడిటోరియంలలో బార్కో 4K లేజర్ ప్రొజెక్షన్, డాల్బీ అట్మోస్ సరౌండ్ సౌండ్ ఉన్నాయి. డాల్బీ-బ్రాండెడ్ ప్రీమియం స్పీకర్లు, స్టేడియం సీటింగ్ ఉన్నాయి. నాలుగు స్క్రీన్లలో రిక్లైనర్లు, లాంజర్లు అమర్చబడి ఉన్నాయి. చివరి వరుస రిక్లైనర్లతో స్క్రీన్లు 2, 3, 4 అంతటా 717 అదనపు సీట్లు, తదుపరి తరం 3D సామర్థ్యాన్ని అందిస్తాయి. ప్రతీ స్క్రీన్‌లో ప్రేక్షకుడికి ఓ కొత్త అనుభవం కలిగేలా సాంకేతికతను సెటప్ చేశారు.
*ఓ మైలు రాయిగా అల్లు స్టూడియోస్*
కోకాపేటలోని ఏడు ఎకరాల్లోని అల్లు స్టూడియోస్ కాంప్లెక్స్‌లో ఉన్న ‘అల్లు సినిమాస్’ భారతదేశ వినోద రాజధానికి మరో మైలురాయిగా నిలుస్తుంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, కోకాపేట, నార్సింగి, నానక్‌రామ్‌గూడ, మోకిలాతో పాటుగా రాబోయే నియోపోలిస్ నుండి పట్టణ, శివారు ప్రేక్షకులకు అందుబాటులో ఉంటుంది. ఫ్యామిలీ, కార్పొరేట్లు, హై-ఎండ్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇష్టపడే సినీ ప్రియుల కోసం ఈ ‘అల్లు సినిమాస్’నూ నిర్మించారు. టికెటింగ్, రాయితీలు, వేచి ఉండే ప్రాంతాలు ఇలా అన్నీ కూడా ఎంతో విశాలంగా ఉన్నాయి. విస్తరించిన F&B ఆఫర్ ఇటాలియన్, చైనీస్, భారతీయ వంటకాలను కూడా అందిస్తుంది. మల్టీ కన్సిషన్ కౌంటర్లు, కియోస్క్‌ల ద్వారా వైడ్ సెక్షన్ ఫుడ్, కూల్ డ్రింక్స్‌ను అందిస్తారు.
