
Itlu Arjuna Movie Story Line with Physically Challanged guy Emotional Love Story
ఓ వికలాంగుడి ఎమోషనల్ లవ్ స్టోరీ… ఇట్లు అర్జున సంచలనం
టాలీవుడ్లో కొత్త హీరోల ఎంట్రీలు ఎప్పుడూ సంచలనమే అని చెప్పాలి. ఇప్పుడు మరో యంగ్ హీరో అనీష్ డెబ్యూ చేస్తున్న ‘ఇట్లు అర్జున’ సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్‌తో భారీ బజ్ క్రియేట్ చేసింది. పాపులర్ డైరెక్టర్ వెంకీ కుడుముల కొత్త ప్రొడక్షన్ బ్యానర్ ‘వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్’ నుంచి వస్తున్న ఈ మూవీకి డెబ్యూ డైరెక్టర్ మహేష్ ఉప్పల దర్శకత్వం వహిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, మలయాళ స్టార్ హీరోయిన్, యూత్ ని తన క్యూట్‌నెస్‌తో ఫిదా చేసిన అనశ్వర రాజన్ ఫీమేల్ లీడ్‌గా నటిస్తోంది.
‘సోల్ ఆఫ్ అర్జున’ అనే పేరుతో ఈ గ్లింప్స్.. కింగ్ అక్కినేని నాగార్జున వాయిస్ ఓవర్‌తో స్టార్ట్ అవుతుంది. “ప్రేమ అది ఎంత దూరమైనా పరిగెత్తిస్తుంది.. కానీ ఎంత ఇష్టమో చెప్పనివ్వదు” అంటూ నాగ్ పలికిన డైలాగ్స్ ఎమోషనల్ డెప్త్ జోడించాయి. ఇందులో హీరో మాటలు రాని ఓ అందమైన వికలాంగ యువకుడిగా నటించబోతున్నాడు. మాటలు రాకున్నా, హృదయంతో ప్రేమను, ధైర్యాన్ని చాటే క్యారెక్టర్‌గా అనీష్ ఇంప్రెస్ చేశాడు. అతని సైలెంట్ ఎక్స్ప్రెషన్స్, ఫ్లెక్సిబుల్ బాడీ లాంగ్వేజ్, హ్యాండ్సమ్ లుక్స్.. డెబ్యూ హీరోగా అతనికి మంచి మార్క్ లను పడేశాయి.
హీరోయిన్ అనశ్వర రాజన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె మరింత ఆకట్టుకుంది. మలయాళంలో వరుస హిట్లతో సూపర్ స్టార్డమ్ సంపాదించిన ఆమె, తెలుగులో కూడా ఫ్రెష్ ఛార్మ్తో మెరిసిపోతోంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఆర్గానిక్‌గా, హార్ట్ టచింగ్‌గా అనిపించింది. గ్లింప్స్‌లో రొమాన్స్‌తో పాటు ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌లు, సస్పెన్స్ ఎలిమెంట్స్ కూడా టీజ్ చేశారు. మాటలు రాని హీరోకు ప్రత్యేక గిఫ్ట్స్ ఉన్నట్టు హింట్ ఇవ్వడం.. సూపర్ హీరో టచ్ జోడించింది.
ఇక టెక్నికల్‌గా ఈ గ్లింప్స్ టాప్ నాచ్ అనే చెప్పాలి. రాజా మహదేవన్ సినిమాటోగ్రఫీ అద్భుత విజువల్స్ అందించింది. థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎమోషన్స్‌ను మరింత డీప్ చేసింది. డెబ్యూ హీరో సినిమాకు ఇంత రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్.. వెంకీ కుడుముల విజన్‌కు నిదర్శనం. ఎమోషనల్ లవ్ స్టోరీతో పాటు యాక్షన్, డ్రామా మిక్స్ చేసి కొత్త టేస్ట్ ఆఫర్ చేయబోతున్నట్టు కనిపిస్తోంది.2026లో రిలీజ్ కానున్న ‘ఇట్లు అర్జున’.. ఇప్పటి నుంచే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచేసింది. కొత్త తరం టాలెంట్‌ను ప్రమోట్ చేస్తూ వెంకీ కుడుముల మరో హిట్ ఇవ్వబోతున్నాడని అనిపిస్తోంది. ఈ గ్లింప్స్ చూస్తే.. టాలీవుడ్లో మరో ఫ్రెష్ లవ్ స్టోరీ వచ్చేసిందని చెప్పొచ్చు.
