
ఇండియన్, తెలుగు ఆడియన్స్ కోసం కంటెంట్ క్రియేట్ చేస్తాం – కొరియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రెస్ మీట్ లో డైరెక్టర్ యూ ఇన్-షిక్
న్యూఢిల్లీలోని కొరియా రిపబ్లిక్ రాయబార కార్యాలయం, కొరియన్ ఫిల్మ్ కౌన్సిల్ భాగస్వామ్యంతో, హైదరాబాద్‌లోని కొరియా గౌరవ కాన్సులేట్ జనరల్ మూడవ కొరియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను లాంచ్ చేసింది. ఈ కార్యక్రమం 2025 డిసెంబర్ 1న, బంజారా హిల్స్‌లోని ఎల్.వి. ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్స్‌లో జరిగింది.
అన్ని వయస్సుల వారికి ఉచిత ప్రవేశం కలిగిన ఈ వేడుకలో వివిధ జానర్లకు చెందిన ఆకట్టుకునే కొరియన్ సినిమాలను ప్రదర్శించారు. అలాగే, సందర్శకుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన స్టాల్స్‌లో ఫేస్ పెయింటింగ్, హాంబోక్ ట్రైయల్స్, కొరియన్ కాలిగ్రఫీ, కొరియన్ నాట్స్, థీమ్ ఫోటో జోన్లతో కొరియన్ సంస్కృతిని ఎక్స్ పీరియన్స్ చేసే ప్రత్యేక ఆకర్షణలు వున్నాయి.
ఈ ఏడాది ఫెస్టివల్‌కు మరింత ప్రత్యేకత ఉంది. ప్రముఖ కొరియన్ దర్శకుడు, నిర్మాత యూ ఇన్-షిక్ స్వయంగా హాజరై అభిమానులతో మీట్-అండ్-గ్రీట్, ఇంటరాక్టివ్ సెషన్లో పాల్గొన్నారు.
యూ ఇన్-షిక్ ఎక్స్ట్రార్డినరీ అటార్నీ వూ, డాక్టర్ రొమాంటిక్, వాగబాండ్ వంటి అద్భుతమైన కొరియన్ డ్రామాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన ప్రముఖ దర్శకుడు. ఆయన పర్యవేక్షణలో తెరకెక్కిన పలు సిరీస్‌లు అంతర్జాతీయంగా విశేషమైన అభిమానం సంపాదించాయి.
ప్రెస్ మీట్ లో కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ యూ ఇన్-షిక్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఇండియా కి రావడం ఇదే మొదటిసారి. హైదరాబాద్ బిర్యానీ సూపర్ గా ఉంది. నాకు చాలా నచ్చింది. ఇక్కడ కొంతమంది ప్రేక్షకులు ని కలిసాను. వాళ్ళు నా నేను చేసిన సినిమాలు, డ్రామాలు అన్ని చూశారు. ప్రతిదాని గురించి చాలా డీటెయిల్ గా మాట్లాడుతున్నారు. ఇది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. భవిష్యత్తులో తప్పకుండా ఇండియన్, తెలుగు ఆడియన్స్ కోసం సినిమాలు నిర్మించాలని భావిస్తున్నాను.
కొరియన్ యాక్టింగ్ అంబాసిడర్ మాట్లాడుతూ..హైదరాబాద్ రావడం చాలా ఆనందంగా ఉంది. చుక్కపల్లి సురేష్ గారికి థాంక్యూ. కొరియన్ టాప్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ యూ ఇన్-షిక్ గారితో ఈ వేదికని పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో కల్చర్, ఎంటర్టైన్మెంట్ రంగంలో కొరియా ఇండియా కొలాబరేషన్ లో వర్క్ చేస్తాయని ఆశిస్తున్నాను.
కొరియా గౌరవ కాన్సుల్ జనరల్ సురేష్ చుక్కపల్లి మాట్లాడుతూ.. కల్చరల్ గా ఇండియా కొరియా మధ్య చాలా సారూప్యత ఉంటుంది. వాళ్ళందరూ మనలాగే చాలా ఫ్యామిలీ ఓరియెంటెడ్ గా ఉంటారు. పెద్దలకి, కల్చర్ కి, మూలాలకి గౌరవిస్తారు. అయోధ్య లో కొరియా ప్రిన్సెస్ పేరుతో మెమోరియల్ ఉంది. ప్రతి ఏడాది 50వేల మంది కోరియన్స్ అయోధ్యని సందర్శిస్తారు. వాళ్ళ పూర్వికులు ఇక్కడ నివసించారనేది వారి నమ్మకం. ఇండియాకి లార్జెస్ట్ వ్యువర్స్ షిఫ్ ఉంది. కొరియన్ వెబ్ సిరీస్ సినిమాలు తెలుగు హిందీలో ట్రాన్స్‌లేట్ అవుతున్నాయి. ఇండియాలో పిల్లలు, గృహిణులు కొరియన్ డ్రామాలు చూస్తున్నారు. యూ ఇన్-షిక్ గారు చేసిన వెబ్ సిరిస్ లు, షోల గురించి ఇక్కడ ప్రేక్షకులు చాలా వివరంగా మాట్లాడుతున్నారు. అక్కడ మేకర్స్ హైదరాబాదులో సూట్ చేసుకునేలా అన్ని సౌకర్యాలు కల్పించాలనేది మా ఉద్దేశం. ఈ రోజుల్లో కొరియా షూటింగ్ కి చాలా ఎక్స్పెన్సివ్ అయింది. మనం బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి అద్భుతమైన సినిమాలు హైదరాబాద్ లోనే చేశాం. ఇక్కడ అన్ని రకాలుగా సౌకర్యాలు వున్నాయి. ఇండియన్, కొరియన్ కొలాబరేషన్ లో భవిష్యత్ లో ప్రాజెక్ట్స్ రావాలని కోరుకుంటున్నాం.
