K-Ramp 3rd Single Tikkal Tikkal.. Released -Grand Theatrical Release on

YouTuber Nikhil Vijendra Simha Birthday Glimpse Unveiled fromSANGEET
On the occasion of Nikhil Vijendra Simha’s birthday, the makers of SANGEET have unveiled a special 45-second glimpse from the film. SANGEET is a Telugu romantic comedy directed by Saad Khan, who earlier made the cult political satire ‘Humble Politician Nograj’, and produced by Naveen Manoharan, Chandru Manoharan, and Shravanti Naveen under the banners of Lahari Films and RB Studios. The film is written by Saad Khan and Siddhanth Sundar, with music composed by Kalyan Nayak.
The stylish teaser highlights the many facets of Nikhil Vijendra Simha as an actor, offering audiences a vibrant peek into the world of SANGEET. With its rich visuals and refreshing tone, the glimpse has already created strong buzz among fans. The film’s shoot is in its final stages, and the makers are expected to announce the official release date very soon.
సంగీత్’ చిత్రం నుండి ప్రముఖ యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర సింహా పుట్టినరోజు గ్లింప్స్ విడుదల
ప్రముఖ యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర సింహా పుట్టినరోజు సందర్భంగా ‘సంగీత్’ చిత్రం నుండి నేడు నిర్మాతలు ఓ ప్రత్యేక గ్లింప్స్ ను విడుదల చేశారు. 45 సెకన్ల నిడివి ఉన్న ఈ గ్లింప్స్, ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ‘సంగీత్’ అనేది తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా. ఈ చిత్రానికి సాద్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఆయన ‘హంబుల్ పొలిటీషియన్ నోగ్రాజ్’ అనే కల్ట్ పొలిటికల్ సెటైర్‌ను రూపొందించారు. లహరి ఫిల్మ్స్, ఆర్.బి. స్టూడియోస్ పతకాలపై నవీన్ మనోహరన్, చంద్రు మనోహరన్, స్రవంతి నవీన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సాద్ ఖాన్ తో పాటు సిద్ధాంత్ సుందర్ రచయితగా వ్యవహరిస్తుండగా, కళ్యాణ్ నాయక్ సంగీతం సమకూరుస్తున్నారు.
‘సంగీత్’ చిత్రం నుండి విడుదలైన పుట్టినరోజు గ్లింప్స్, నటుడిగా నిఖిల్ విజయేంద్ర సింహా యొక్క అనేక కోణాలను హైలైట్ చేస్తుంది. అలాగే, ప్రేక్షకులను ‘సంగీత్’ ప్రపంచంలోకి తీసుకొని వెళ్తుంది. వైవిధ్యమైన కథాంశం, అద్భుతమైన విజువల్స్ తో సినీ అభిమానులకు విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ గ్లింప్స్.. సామాజిక మాధ్యమాల్లోనూ సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా షూటింగ్ తుది దశలో ఉంది. త్వరలో నిర్మాతలు విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు. ‘సంగీత్’ చిత్రం యువతతో పాటు, కుటుంబ ప్రేక్షకులను కూడా మెప్పించేలా ఉంటుందని నిర్మాతలు తెలిపారు.
చిత్రం: సంగీత్ కథానాయకుడు: నిఖిల్ విజయేంద్ర సింహా రచన: సాద్ ఖాన్, సిద్ధాంత్ సుందర్ దర్శకత్వం: సాద్ ఖాన్ నిర్మాతలు: నవీన్ మనోహరన్, చంద్రు మనోహరన్, స్రవంతి నవీన్ నిర్మాణ సంస్థలు: లహరి ఫిల్మ్స్, ఆర్.బి. స్టూడియోస్ పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్