
వీర జవాన్ మురళి నాయక్ బయోపిక్ దేశం గర్వపడే సినిమా అవుతుంది – గౌతమ్ కృష్ణ
”వీర జవాన్ మురళి నాయక్ దేశానికి గర్వకారణం. తెలుగు సైనికుడి మీద వస్తున్న ఫస్ట్ బయోపిక్ ఇది. ఈ సినిమాని తెలుగు తమిళ్ కన్నడ మలయాళం హిందీ భాషల్లో చిత్రీకరిస్తున్నాం. మాకు అవకాశం దొరికితే ఈ సినిమాని ఇంటర్నేషనల్ లెవెల్ లో తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది దేశం గర్వపడే సినిమా అవుతుంది’ అన్నారు హీరో గౌతమ్ కృష్ణ. విషాన్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై గౌతమ్ కృష్ణ కథానాయకుడిగా కే సురేష్ బాబు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ లో ఈ సినిమాని అనౌన్స్ చేశారు.
ప్రెస్ మీట్ లో హీరో గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ..జై భారత్.. జై మురళి నాయక్.. ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు. ఇది ఒక రియల్ హీరో కథ. ఇలాంటి కథలు చాలా అరుదుగా వస్తాయి. ఇప్పటివరకు ఒక్క తెలుగు సైనికుడు మీద కూడా బయోపిక్ రాలేదు. తెలుగు సైనికుడి మీద వస్తున్న ఫస్ట్ బయోపిక్ ఇది. ఈ సినిమాని తెలుగు తమిళ్ కన్నడ మలయాళం హిందీ భాషల్లో చిత్రీకరిస్తున్నాం. మాకు అవకాశం దొరికితే ఈ సినిమాని ఇంటర్నేషనల్ లెవెల్ లో తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నాం. నా గత సినిమా సోలో బాయ్ రిలీజ్ అయినప్పుడు మురళి నాయక్ గారి ఫ్యామిలీ ని పిలిచి వారితో మాట్లాడడం జరిగింది. వారితో మాట్లాడుతున్నప్పుడు మురళి నాయక్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను. మురళి గారు భారత సైన్యానికి సేవలందించాలనే కళ లక్ష్యంతో ఆర్మీలో చేరారు. మురళి నాయక్ లాంటి ఎంతోమంది సైనికులు బోర్డర్లో పోరాటం చేయడం వల్లే మనం ఇక్కడ మనం ఆనందంగా ఉండగలుగుతున్నాం. మురళి గారి కథ ప్రపంచానికి తెలియాలి. ఆపరేషన్ సింధూరం మన దేశ చరిత్రలో ఒక ముఖ్య అధ్యాయం. అలాంటి ఒక వార్ లో పాల్గొని వీరమరణం పొందిన మురళి నాయక్ కథ ప్రపంచానికి తెలియాలి. ఇంత పవర్ఫుల్ సబ్జెక్టు నాకు చెప్పే అవకాశం రావడం నా అదృష్టం. మురళి గారి పేరెంట్స్ ని కలిసాము. వారు ఏమి ఆలోచించకుండానే కచ్చితంగా మీరు ఈ కథని చెయ్యండి అని చెప్పారు. మాకు ఎలాంటి ఆశ లేదు. మా అబ్బాయి జీవితాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూపించండి. ఈ దేశానికి పరిచయం చేయించండని చెప్పారు. మురళి గురించి తెలిసింది ఒక్క శాతమే. ఆయన కథను చెబుతుంటే నాకు కన్నీళ్లు ఆగలేదు. అలాంటి గ్రేట్ స్టోరీ ని ప్రజెంట్ చేయాలని మేము అనుకుంటున్నామ. దానికి మీ ప్రతి ఒక్కరు సపోర్టు కావాలి. ఇది నార్మల్ సబ్జెక్ట్ కాదు. మురళి నాయక్ రియల్ హీరో ఈ సినిమాని గ్రాండ్ స్కేల్లో తీయడానికి ముఖ్య కారణం నిర్మాత కె సురేష్ బాబు గారు. మురళి నాయక్ నార్మల్ పర్సన్ కాదు. ఆయన సినిమా కూడా మామూలుగా ఉండకూడదు. చాలా అద్భుతంగా ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో తీయడానికి పూర్తి సహకారం ఉంటుందని సురేష్ బాబు గారు ముందుకు వచ్చారు. అందుకు ఆయనకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ సినిమాలు చాలా బిగ్ అండ్ గ్రాండ్ స్కేల్లో నిర్మిస్తున్నారు. మురళి నాయక్ గారి పేరెంట్స్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇది ఒక కేవలం సినిమా మాత్రమే కాదు. దేశం గర్వపడే ఒక ఎమోషన్.
నిర్మాత కే సురేష్ బాబు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇది సినిమా కంటే ఇండియన్ ఎమోషన్. మురళి నాయక్ జీవితం అందరికీ ఇన్స్పిరేషన్. ఆయన దేశం కోసం ప్రాణాలు అర్పించారు. ఈ కథ, ఈ సినిమా అందరూ గర్వపడేలా ఉంటుంది. మురళి నాయక్ జీవితాన్ని తనపైకి అద్భుతంగా తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తున్నాం. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాని నిర్మిస్తున్నాం.
మురళి నాయక్ తండ్రి మాట్లాడుతూ… భారత్ మాతాకీ జై, మురళి ఆపరేషన్ సింధూర్లో విరోచితంగా పోరాడారు. గౌతమ్ బాబు మురళి గురించి మంచి మూవీ తీయాలి. భారతీయులందరికీ గుండెల్లో నిలిచిపోవాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా తీయడానికి మురళి నాయక్ తల్లిదండ్రులుగా మేము అంగీకరిస్తున్నాము. మురళి పాత్రలో గౌతం బాబుని చూడడం మురళి తల్లిదండ్రులుగా మేము చాలా సంతోషపడుతున్నాం. ఈ సినిమా పెద్ద విజయం కావాలని కోరుకుంటున్నాను. జైహింద్
మురళి నాయక్ తల్లి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మురళి ఆర్మీలో జాయిన్ కావాలని కలలు కన్నాడు. భారత్ కి సేవ చేయాలని వెళ్ళాడు. చచ్చినా బ్రతికిన అక్కడే అనుకున్నాడు. తల్లిదండ్రులుగా మేము కూడా తనకి సపోర్ట్ చేశాము. గౌతమ్ కూడా నాకు కొడుకు లాంటి వాడే. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.