
Amardeep FL from Sumathi Sathakam unveiled on the occasion of Krishna Janmashtami
The film Sumathi Sathakam starring Amardeep and Sayli in the lead roles, is being produced by Kommalapati Sai Sudhakar under the Viision Movie Makers banner and presented by Kommalapati Sridhar. Directed by M.M. Naidu, the movie had recently unveiled the first look poster of the heroine Sayli, which was well received.
Today (August 16), on the occasion of Krishna Janmashtami, the first look of the hero’s character was unveiled. Amardeep is seen portraying a middle-class young man in the poster. Judging by the poster, Sumathi Sathakam appears to be a wholesome family entertainer. The garlands of vegetables around Amardeep’s neck, the rustic background, and his costume all hint at a feel-good narrative.
The film has completed its shoot, and the team is now gearing up to release the teaser and trailer soon. Post-production is underway, and the makers aim to finish it at the earliest and announce the release date. The production team is working tirelessly with the goal of releasing the film during the Dussehra festival.
The film features music by Subhash Anand, dialogues by Bandaru Naidu, editing by Nahid Mohammed, and cinematography by Halesh.
విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మాలపాటి శ్రీధర్ గారి సమర్పణలో కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మిస్తున్న‘సుమతీ శతకం’ నుంచి కృష్ణాష్టమి సందర్భంగా అమర్ దీప్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల*
విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై అమర్ దీప్, సైలీ హీరో హీరోయిన్లుగా కొమ్మాలపాటి శ్రీధర్ గారి సమర్పణలో కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మిస్తున్న చిత్రం ‘సుమతీ శతకం’. ఈ సినిమాకు ఎం.ఎం. నాయుడు దర్శకత్వం వహిస్తున్నారు. గత కొన్ని రోజుల క్రితం ఈ మూవీ నుంచి హీరోయిన్ సైలీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసి అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.
కృష్ణాష్టమి సందర్భంగా నేడు (ఆగస్ట్ 16) హీరో పాత్రని పరిచయం చేశారు. అమర్ దీప్ ఇందులో ఓ మిడిల్ క్లాస్ కుర్రాడిలా కనిపించబోతున్నారు. ఇక ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చూస్తుంటే కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమని అర్థం అవుతోంంది. అమర్ దీప్ మెడలో కూరగాయలతో అల్లిన దండలు, ఆ బ్యాక్ గ్రౌండ్ వాతావరణం, ఆయన క్యాస్టూమ్స్ ఇలా అన్నీ కూడా ఇదొక ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ అని చెప్పకనే చెప్పేస్తున్నాయి.
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. త్వరలోనే టీజర్, ట్రైలర్‌ను కూడా ఆడియెన్స్ ముందుకు తీసుకు రాబోతోన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి విడుదల తేదీని ప్రకటించాలని మేకర్లు భావిస్తున్నారు. దసరాకి విడుదల చేయాలనే లక్ష్యంతో సినిమా యూనిట్ అహర్నిశలు కష్టపడుతోంది.
ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా సుభాష్ ఆనంద్ , డైలాగ్స్ రైటర్‌గా బండారు నాయుడు, ఎడిటర్‌గా నాహిద్ మొహమ్మద్,ఆర్ట్ డైరెక్టర్ గా విశ్వ ప్రసాద్, కెమెరామెన్‌గా హాలేష్ పని చేస్తున్నారు.