K-Ramp 3rd Single Tikkal Tikkal.. Released -Grand Theatrical Release on

మహావతార్ నరసింహ సినిమాకు ప్రేక్షకులు జేజేలు పలుకుతున్నారు – అల్లు అరవింద్
హోంబాలే ఫిల్మ్స్ సమర్పణలో క్లీమ్ ప్రొడక్షన్స్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మహావతార్ నరసింహ. ఈ చిత్రానికి అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. క్లీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్ చైతన్య దేశాయ్ నిర్మించారు. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా జూలై 25న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ చిత్రం అద్భుతమైన విజయాన్ని అందుకొని, భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటెడ్ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసి, సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు.
సక్సెస్ మీట్ లో నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. ఈ సినిమాని నేను రిలీజ్ చేసేలా అనుగ్రహించిన నరసింహ స్వామివారికి నమస్కారం. హోంబలే ఫిల్మ్స్ సంస్థతో నాకు మంచి అనుబంధం ఉంది. నిర్మాత విజయ్ గారు ఫోన్ చేసి, ఈ సినిమాని తెలుగులో మీరు విడుదల చేయాలని అని అడిగారు. అంతకుమించి ఏం మాట్లాడుకోలేదు. వెంటనే ఓకే అన్నాను. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు. సినిమా విడుదలైన రోజు మార్నింగ్ షోకి వచ్చిన రెస్పాన్స్ ని దృష్టిలో పెట్టుకుని ఈవెనింగ్ కొన్ని షోస్ పెంచాం. మరుసటి రోజు నుంచి మరిన్ని స్క్రీన్స్ పెంచుకుంటూ వెళుతున్నాం. ఈ సినిమా దర్శక, నిర్మాతలు ఎంతో కష్టపడ్డారు. 2021లో సినిమాని మొదలుపెట్టి ఎన్నోఒడిదొడుకులు ఎదుర్కొని, పట్టుదలతో సినిమాని మన ముందుకు తీసుకొచ్చారు. ఆ నరసింహ స్వామి వారే వారికి ఈ అద్భుతమైన విజయాన్ని అందించారు. భారతదేశం అంతటా ప్రేక్షకులు ఈ సినిమాకి జేజేలు పలుకుతున్నారు. హైదరాబాద్‌లోని ఏఎంబీలో 200 మంది స్వాములు ఈ చిత్రాన్ని చూడటం నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఎప్పుడూ థియేటర్స్ రాని ప్రేక్షకులు ఈ సినిమాని వీక్షిస్తున్నారు. సినిమా చూసిన ప్రేక్షకులు ఉద్వేగంతో తమ తోటివారితో సినిమా గురించి గొప్పగా చెబుతున్నారు. ఈ వేడుకు అతిధులు విచ్చేసిన భరణి గారికి, జొన్నవిత్తుల గారికి ధన్యవాదాలు. మా కుటుంబంలో, సన్నిహితులు, పరిచయం ఉన్నవారందరిలో సనాతన ధర్మం గురించి పవన్ కల్యాణ్ గారికి తెలిసినంతగా మరెవరికీ తెలియదు. పవన్ సనాతన ధర్మం గురించి ప్రసంగిస్తే అందరూ ముగ్ధులవుతాం. ‘మహావతార్ నరసింహ’చిత్రాన్ని ఆయన చూడాలని, దాని గురించి మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాని ప్రేక్షకులకు తీసుకెళ్లిన మీడియా వారికి, సహకరించిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు’అన్నారు
రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సినిమాలు చూసే ప్రేక్షకులు తప్పకుండా ఈ సినిమా చూడండి. ఈ సినిమా చూస్తేనే మిగతా సినిమాలు చూసే అర్హత. మీ పిల్లల్ని మొట్టమొదట ఈ సినిమాని చూపించండి. దర్శకుడు ఈ కథని మహాద్భుతంగా నడిపించాడు. ప్రస్తుత సమాజానికి ఏం కావాలో అది ఈ సినిమాలో ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద విలన్ తన కుమారుడున్నే చంపడం ఈ సినిమా కథ. ఇంతకంటే గొప్ప స్టోరీ ఎక్కడైనా ఉంటుందా? కేవలం మన పురాణాల్లోనే వుంటుంది. ఆ కథాంశాన్ని పట్టుకుని దర్శకుడు పరమ అద్భుతంగా చిత్రీకరించాడు. విజువల్స్ ఫైట్స్ సంగీతం ఇవన్నీ పరమ అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమా ఒక డివైన్ వండర్. అల్లు అరవింద్ గారు గీత ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్స్ ద్వారా ఈ దివ్య అద్భుతమైన సినిమా విడుదల చేయడం ఎంతో ఆనందంగా ఉంది. వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. కుటుంబం అందరితో కలిసి వెళ్లి ఈ సినిమాని చూడండి. ఒక దివ్యమైన అనుభూతిని అందించే అద్భుతమైన సినిమా ఇది’అన్నారు.
రచయిత, నటుడు తనికెళ్ల భరణి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. అల్లు అరవింద్ గారితో ఎప్పుడు కలిసిన ఒక అద్భుతమైన అనుభూతి. ఈ సినిమా గురించి వారు చెప్పటం, ఫ్యామిలీతో కలిసి వెళ్లి చూడటం జరిగింది. మాకు ఒక సినిమా మొదలైన మూడో నిమిషం నుంచే మేము ఒక గుడిలో ఉన్నామని భావన కలిగించిన సినిమా ఇది. సినిమా తీశారా లేకపోతే సాక్షాత్కారం జరుగుతుందా అనంత గొప్ప అనుభూతిని ఇచ్చింది. దర్శకుడు అశ్విన్ ఈ సినిమాతో యావత్ ప్రపంచానికి విష్ణుమూర్తిని నరసింహ స్వామిని దర్శనం చేయించేశారు. ఈ సినిమా చూడటం పూర్వజన్మల పుణ్యం. ఒక్కసారి కాదు ఎన్నిసార్లు చూసినా ఒక కొత్త అనుభూతి. పరిపూర్ణమైన సినిమా ఇది. అంత పెద్ద నరసింహున్ని నా జీవితంలో చూసి ఎరగను. స్క్రీన్ అంతా నిండిపోయింది. ఒక ఉద్వేగానికి లోనైపోయాం. ఇది రసాత్మకం కళాత్మకం. ఇది తీసిన వారు రాసినవారు చేసిన వారు చూసినవారు అందరూ ధన్యులే. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. జై నారసింహ’అన్నారు.
డైరెక్టర్ అశ్విన్ కుమార్ మాట్లాడుతూ… జై నరసింహ స్వామి. జై జై సనాతన ధర్మం. ఇది సినిమా కాదు ఒక మహాదర్శనమని ప్రేక్షకులే చెబుతున్నారు. ఈ సినిమాకు వచ్చిన ప్రతి ప్రశంస నరసింహ స్వామికే చెందుతుంది. మనందరిలో ఒక డివైన్ ఫీలింగ్ కలిగించిన సినిమా ఇది. అలాంటి డివైన్ ఫీలింగ్ కలిగించాలని ఉద్దేశంతోనే ఈ సినిమాని తీయడం జరిగింది. ప్రేక్షకులు అలాంటి ఫీలింగ్ పొందడం చాలా ఆనందాన్నిచ్చింది. గీతా ఆర్ట్స్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు. వారి సపోర్ట్ ని మర్చిపోలేను. వారి సపోర్ట్ తోనే సినిమా పబ్లిక్ లోకి వెళ్ళింది. ఈ సినిమా ఒక రెవల్యూషన్ కానుంది. అందరికీ థాంక్యూ’అన్నారు
ప్రొడ్యూసర్ శిల్పా ధావన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇది యావత్ భారత్ సినిమా. ఈ సినిమా చేయడం నరసింహస్వామి కృపగానే భావిస్తున్నాం. ఈ సినిమాని ఇంత గొప్పగా ఆదరించిన ప్రేక్షకులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నరసింహస్వామి కృపతోనే ఈ మ్యాజిక్ సాధ్యమైంది. ఈ సినిమాని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’అన్నారు.