Nadive…Lyrical Song from Rashmika Mandanna’s The Girlfriend to Release on

కొత్తపల్లిలో ఒకప్పుడు చాలా గమ్మత్తుగా ఉంటుంది – డైరెక్టర్ ప్రవీణ పరుచూరి
రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ప్రజెంట్ చేస్తున్న రూరల్ కామెడీ ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’. C/O కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలతో అనుబంధం కలిగిఉన్న నటి-చిత్రనిర్మాత ప్రవీణ పరుచూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పరుచూరి విజయ ప్రవీణ ఆర్ట్స్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. మనోజ్ చంద్ర, మోనికా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఫస్ట్ లుక్, టీజర్ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ఈ నెల 18న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా టీం ప్రెస్ మీట్ నిర్వహించింది.
ప్రెస్ మీట్ లో హీరో మనోజ్ చంద్ర మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ సినిమాలో ఇది ఒక చోటు. కానీ ఈ సినిమా మా గుండెల్లో చోటు. 18 వ తారీఖున మీ గుండెల్లోకి దూసుకొస్తున్నాము. మా కలని నిజం చేసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ప్రవీణ గారికి కృతజ్ఞతలు. స్పిరిట్ మీడియా ద్వారా నన్ను పరిచయం చేస్తున్న రానా గారికి ధన్యవాదాలు. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఆర్టిస్టు టెక్నీషియన్ కష్టాన్ని నేను దగ్గర నుండి చూశాను. వారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మీరందరూ థియేటర్స్ కొచ్చి సపోర్ట్ చేసి మా సినిమాని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. ప్రవీణ పరుచూరి సినిమాల్లో నటించాలంటే నటిస్తే సరిపోదు జీవించాలి. అలా రామకృష్ణ క్యారెక్టర్ కి నేను ప్రాణం పోశాను. మీరందరూ కూడా ఈ సినిమాని ఆస్వాదిస్తారని భావిస్తున్నాను. తప్పకుండా థియేటర్స్ లోకి రండి. మిమ్మల్ని డిసప్పాయింట్ చెయ్యము. థాంక్యూ సో మచ్’అన్నారు.
డైరెక్టర్ ప్రవీణ పరుచూరి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇది నా మూడో సినిమా. అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉండాలని అనుకున్నాను. ఒక పల్లెటూర్ని ఒక ఫారిన్ సినిమాటోగ్రాఫర్ తో షూట్ చేయించాం. ఈ సినిమాకి ఒక ఫారిన్ డీవోపీ పనిచేస్తున్నారు. నేను ఫస్ట్ సినిమా కేరాఫ్ కంచరపాలెం తీశాను. జీవితంలో ఒక్క సినిమా చాలు అనుకున్నాను. ఆ సినిమాకి ఆడియన్స్ చాలా పెద్ద విజయాన్ని ఇచ్చారు. ఆడియన్స్ ఎంకరేజ్మెంట్ నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. ప్రేక్షకుల ప్రోత్సాహం వలన నేను మరో సినిమా తీయగలిగాను. కేరాఫ్ కంచరపాలెం సినిమాని చాలామంది థియేటర్స్ లో చూడలేదని చెప్తుంటారు. దయచేసి ఈ సినిమాని మాత్రం థియేటర్స్ లో మిస్ అవ్వొద్దు. సినిమా చాలా గమ్మత్తుగా ఉంటుంది. సినిమా చూస్తున్నప్పుడు చాలా హాయిగా నవ్వుకుంటారు. సెకండ్ హాఫ్ లో నా స్టైల్ లో కొన్ని సెన్సిబిలిటీస్ కాన్సెప్ట్స్ ఉంటాయి. తప్పకుండా ఆలోచన కలిగించేలా ఉంటుంది. జులై 18న ఎవరు కూడా థియేటర్స్ లో మిస్ అవ్వొద్దు అని కోరుకుంటున్నా. నేను ఈసారి నేను డైరెక్షన్ చేసిన సినిమా ఇది. మీ మీద నమ్మకంతోనే చేశాను. ఈ సినిమాని ఆదరిస్తారని మీపై నాకు పూర్తి నమ్మకం ఉంది’అన్నారు.
యాక్టర్ రవీంద్ర విజయ్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. నన్ను ప్రవీణ గారే తెలుగుకి పరిచయం చేశారు. ఈ సినిమాలో చాలా మంచి పాత్ర ఇచ్చారు. అలాగే ఒక మంచి టీం తో పని చేసే అవకాశం దొరికింది. మీరు సినిమా చూడండి. అది ఎంత మంచి కథో మీకే తెలుస్తుంది. జులై 18న అందరూ థియేటర్స్ లో చూడండి’అన్నారు.
యాక్టర్ బెనర్జీ మాట్లాడుతూ… అందరికి నమస్కారం. ఈ సినిమా ట్రైలర్ చూశారు. సినిమా ఏ జోన్ లో ఉంటుందో మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఈ సినిమాలో పనిచేసిన అందరూ ద బెస్ట్ వర్క్ ఇచ్చారు. అందరూ కూడా సినిమాని ఓన్ చేసుకున్నారు .ప్రొడక్ట్ చాలా అద్భుతంగా వచ్చింది. ప్రవీణ కథనాన్ని ఒక నిర్మాతగా డైరెక్టర్ గా అద్భుతంగా నడిపించారు. ఈ సినిమా తప్పకుండా చాలా కొత్త అనుభూతిని ఇస్తుంది. జూలై 18న ఎవరు కూడా థియేటర్స్ లో మిస్ అవ్వొద్దు’అన్నారు
యాక్టర్ ఫణి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నాకు ఈ సినిమా అవకాశం ఇచ్చిన నిర్మాత, డైరెక్టర్ గారికి థాంక్యూ. ప్రవీణ గారు ఒక హ్యూమన్ బీయింగ్ గా నాకు చాలా ఇష్టం. మా అందరినీ సొంత ఫ్యామిలీలో చూసుకున్నారు. చాలా డిఫరెంట్ సినిమా ఇది. మీ అందరికీ నచ్చుతుంది’అన్నారు. ఈ ప్రెస్ మీట్ లో మిగతా యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
తారాగణం: మనోజ్ చంద్ర, మోనిక టి, ఉషా బోనెల, రవీంద్ర విజయ్, ప్రవీణ పరుచూరి, బెనర్జీ, బొంగు సత్తి, ఫణి, ప్రేంసాగర్
సాంకేతిక సిబ్బంది:
సమర్పణ: రానా దగ్గుబాటి
దర్శకత్వం: ప్రవీణ పరుచూరి
పాటలు: మణి శర్మ
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: వరుణ్ ఉన్ని
నిర్మాణ సంస్థ: పరుచూరి విజయ ప్రవీణ ఆర్ట్స్
నిర్మాతలు: గోపాలకృష్ణ పరుచూరి & ప్రవీణ పరుచూరి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆలూర్ నిరంజన్
DOP: పెట్రోస్ ఆంటోనియాడిస్
అడిషినల్ సినిమాటోగ్రఫీ: సందీప్ కె విజయ్
ఎడిటర్,క్రియేటివ్ డైరెక్టర్: కిరణ్ ఆర్
ప్రొడక్షన్ డిజైనర్లు: జితేంద్ర మౌర్య, విశాల్ జ్ఞానచందని
కథ, మాటలు: గురుకిరణ్ బత్తుల
కొరియోగ్రఫీ: మెహర్ బాబా
స్టంట్స్: ‘మార్వెల్’ నటరాజ్
PRO: వంశీ-శేఖర్
పబ్లిసిటీ క్యాంపైన్: అనిల్ & భాను
మార్కెటింగ్ పార్ట్నర్: స్పిరిట్ మీడియా
డిజిటల్ మార్కెటింగ్: సౌత్‌బే