నా మాటల్ని అపార్థం చేసుకోవద్దని కోరుతున్నాను – నిర్మాత శిరీష్ రెడ్డి

Thammudu with a New-Age Screenplay and Making Will Offer Audiences a Unique Theatrical Experience – Dil Raju
After the blockbuster success of Sankranthiki Vasthunnam, popular production house Sri Venkateswara Creations is back with another potential superhit Thammudu. The film stars Nithiin in the lead, directed by Sriram Venu, and produced by Dil Raju and Sirish. Actresses Laya, Varsha Bollamma, and Saptami Gowda play key roles. Thammudu is all set for a grand worldwide theatrical release on July 4. Ahead of the release, producer Dil Raju revealed the highlights of the movie in a recent interview with print and web media.
– Sriram Venu has been associated with our banner since Arya – working with us as an assistant director, associate director, and scriptwriter. The reason he has stayed with us is not money, but the wavelength and relationship we share. In this industry, most work is done for money, but my approach is different. I prefer working with people I connect with – be it Anil Ravipudi, Srikanth Addala, Harish Shankar, Vamshi Paidipally, or Dasaradh. Sriram continues to work with us because he feels comfortable here, not because we paid him a hefty amount. I know the talent of these directors. So, I give input when needed – during story development or in the editing room, but never interfere with their creative freedom.
– After the first 20 minutes, the rest of Thammudu takes place in a single day. There are 5-6 action sequences, two of which were considered too violent, prompting the censor board to suggest an ‘A’ certificate. They offered a ‘U/A’ if we removed them, but we refused. This film is made for the theatrical experience, and we want audiences to enjoy it fully. If this was an entertainer like Sankranthiki Vasthunnam, we’d have urged families to come. But Thammudu is an action-driven film. Even if just the theatergoers are satisfied, that’s what matters.
The film took 150 days to shoot, and 80% of it takes place in a forest. Director Sriram Venu has focused on top-quality visuals and sound design to ensure it’s thoroughly enjoyable on the big screen.
– We’re taking strong steps to curb piracy in the industry. Even the central government is supporting these efforts. Recently, four individuals were arrested for recording movies in theaters. These pirated prints are sold for $400 for small films and $1,000 for big ones. While that may be big money for them, it causes crores of losses for producers. We’re tightening security gradually.
– We’re also considering premier shows for Thammudu, but need proper permissions. Since I’m the FDC Chairman, I have to make sure everything is done according to regulations. Netflix has already watched the film and liked it enough to acquire it.
– Whether it’s piracy or negative campaigns, we have to face everything one step at a time. Reviewers should take a moment to consider the producer’s effort. While the director and hero may feel the impact, it’s the producer who takes the biggest loss. If I speak out about these issues, people say Dil Raju has an attitude. Recently, Nithiin was asked in an interview to share his strengths and weaknesses. I told him, as a well-wisher, “You started your career before Allu Arjun, but couldn’t reach his range.” Because of our relationship, I said it honestly. Don’t interpret it negatively.
– Ajaneesh has done brilliant sound design for Thammudu. We all want fresh, new films. Sriram wanted to attempt something new, and we gave him complete freedom. If the audience enjoys the Friday morning shows, it means we’ve got a hit. Story-wise, the film is simple: it revolves around a conflict between a brother and sister and how they resolve it. But the screenplay and action makes it engaging.
– As a producer, I believe in preparing a solid film and releasing it properly. If audiences like it, success will follow. Sankranthiki Vasthunnam did better than we expected because director Anil planned it perfectly. We’re confident about Thammudu as well, though its range will be known only on release day. We’ve stopped prematurely announcing OTT deals. Even OTT platforms are cooperating in this matter. The viewership for Thammudu will be a true reflection of the content.
– We launched Dil Raju Dreams to give talented newcomers opportunities across departments. On day one, we received over 12,000 applications. After scrutiny, we shortlisted 1,400. For the producer category, 81 applied – out of which we selected 7 after checking company history and details. We’re following two models: one, if the story is good, we fund and produce the film with them. Two, they make the film and release it with our presence and guidance. This will help bring new producers into the industry.
– We recently held the Gaddar Awards through FDC. We also plan to resume the Children’s Film Festival, which had paused. Initiatives like online ticketing and run-track are in progress. Currently, our banner is producing Rowdy Janardhan, Yellamma, and Dethadi. Another project is also in the pipeline. Of the four movies we’re making this year, all are scheduled for release next year. 5-6 more projects are in the scripting stage and will begin by 2026. These include films from SVC and Dil Raju Productions. Next year’s lineup includes a film directed by Anil Ravipudi and another with Marco director Hanif Adani. We’ve also locked films with two debut directors. One project is in collaboration with Animal’s production team, for which we’re currently looking for a suitable star hero. Apart from that, two or three more films are lined up under Dil Raju Dreams. We’re constantly discussing what kind of content will draw audiences back to theaters.
కొత్త తరహా స్క్రీన్ ప్లే, మేకింగ్ తో ప్రేక్షకులకు బెస్ట్ థియేట్రికల్ ఎక్సిపీరియన్స్ ఇచ్చే మూవీ “తమ్ముడు” – నిర్మాత దిల్ రాజు
“సంక్రాంతికి వస్తున్నాం” బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో వస్తున్న మరో సూపర్ హిట్ మూవీ “తమ్ముడు”. నితిన్ హీరోగా దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. “తమ్ముడు” సినిమా ఈ నెల 4న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ హైలైట్స్ ను ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో తెలిపారు ప్రొడ్యూసర్ దిల్ రాజు.
– శ్రీరామ్ వేణు మా సంస్థలో ఆర్య నుంచి వర్క్ చేస్తున్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా, అసోసియేట్ డైరెక్టర్ గా, స్క్రిప్ట్ రైటర్ గా మాతోనే ట్రావెల్ చేస్తున్నాడు. శ్రీరామ్ వేణు మా దగ్గరనే ఉన్నాడంటే అందుకు మా మధ్య ఉన్న రిలేషన్, వేల్ వెంగ్త్ కారణం. ఇండస్ట్రీలో డబ్బుతోనే పనులు జరుగుతుంటాయి. నాది భిన్నమైన పద్ధతి. నేను వేవ్ లెంగ్త్ కలిసిన వాళ్లతోనే జర్నీ చేస్తుంటాను. అనిల్ రావిపూడి, శ్రీకాంత్ అడ్డాల, హరీశ్ శంకర్, వంశీ పైడిపల్లి, దశరథ్..ఇలా డైరెక్టర్స్ మా సంస్థలో వర్క్ చేసి హిట్ చిత్రాలు ఇచ్చారు. శ్రీరామ్ వేణు మా సంస్థలోనే ట్రావెల్ అవుతున్నాడంటే అతనికి భారీగా డబ్బు ఇవ్వడం వల్ల కాదు. మాతో ఆయనకు ఒక కంఫర్ట్ ఉంటుంది. అనిల్ రావిపూడితో నాకొక బాండింగ్ ఉంది. ఆ బాండింగ్ లో ఒక కంఫర్ట్ ఉంటుంది. ఈ డైరెక్టర్స్ టాలెంట్ నాకు తెలుసు. కాబట్టి కథ టైమ్ లో, ఎడిటింగ్ టేబుల్ దగ్గర నాకు అనిపించినవి అడుగుతా. నేను క్వశ్చన్ అడిగితే ఎందుకు అడిగాడు అని ఆలోచిస్తారు. అంతే గానీ వారి పనిలో ఇంటర్ ఫియర్ కాను.
– “తమ్ముడు” మూవీ మొదటి 20 నిమిషాల తర్వాత మిగిలిన కథంతా ఒక్కరోజులో జరుగుతుంది. ఐదారు యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. వాటిలో రెండు యాక్షన్ ఎపిసోడ్స్ వైలెంట్ గా ఉన్నాయని ఎ సర్టిఫికెట్ ఇస్తామని సెన్సార్ వాళ్లు చెప్పారు. ఆ రెండు ఎపిసోడ్స్ తీసేస్తే యు బై ఎ ఇస్తామని చెప్పారు. ఈ సినిమాను థియేటర్ ఎక్సిపీరియన్స్ కోసమే చేశాం కాబట్టి ఆ ఫైట్ సీక్వెన్సులు తీసేయకుండా ఎ సర్టిఫికెట్ కు అంగీకరించాం. ఇది సంక్రాంతికి వస్తున్నాం లాంటి ఎంటర్ టైనర్ అయితే ఫ్యామిలీ ఆడియెన్స్ అందరూ రండి అని చెబుతాం. తమ్ముడు మూవీ యాక్షన్ ఓరియెంటెడ్ కంటెంట్ ఉన్న మూవీ. థియేటర్స్ కు వచ్చిన వాళ్లనైనా సంతృప్తి పరచాలి కదా అని ఎ సర్టిఫికెట్ తీసుకున్నాం. ఈ చిత్రాన్ని 150 రోజులు చిత్రీకరించారు. 80 పర్సెంట్ మూవీ అడవిలో ఉంటుంది. విజువల్స్, సౌండింగ్ హై క్వాలిటీతో ఉంటూ థియేటర్ లో ఎంజాయ్ చేసేలా రూపొందించారు దర్శకుడు శ్రీరామ్ వేణు.
– పైరసీ అరికట్టేందుకు ఇండస్ట్రీ నుంచి గట్టి చర్యలు తీసుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో సపోర్ట్ చేస్తోంది. థియేటర్స్ లో కూర్చుని సినిమా రికార్డ్ చేస్తున్న నలుగురిని ఈ మధ్య పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలా రికార్డ్ చేసిన సినిమాలను చిన్న సినిమాకు 400 డాలర్స్, పెద్ద సినిమాకు వెయ్యి డాలర్స్ చొప్పున అమ్ముతున్నారు. వాళ్లకు అదే పెద్ద అమౌంట్ కానీ, నిర్మాతలు కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. పైరసీని అరికట్టే చర్యలు క్రమంగా కట్టుదిట్టం అవుతాయని ఆశిస్తున్నాం. “తమ్ముడు” సినిమాకు ప్రీమియర్స్ వేసే విషయం ఆలోచిస్తున్నాం. ఎందుకంటే ప్రీమియర్స్ కోసం ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకోవాలి. నేను ఎఫ్ డీసీ ఛైర్మన్ గా ఒక హోదాలో ఉన్నాను కాబట్టి అన్నీ చూసుకుని చేయాలి. తమ్ముడు మూవీని నెట్ ఫ్లిక్స్ వాళ్లు చూసి నచ్చి తీసుకున్నారు.
– పైరసీ అయినా, ఈ నెగిటివ్ ప్రచారాన్ని అయినా క్రమంగా ఒక్కో స్టెప్ తో ఎదుర్కొంటూ వెళ్లాల్సిందే. ఎవరైనా రివ్యూస్ రాసేప్పుడు నిర్మాత గురించి ఒక్క నిమిషం ఆలోచించాలి. హీరో, డైరెక్టర్ కు కూడా ఎఫెక్ట్ అయినా, ఎక్కువ నష్టం జరిగేది ప్రొడ్యూసర్ కే. నేను వీటిపైన గట్టిగా మాట్లాడితే దిల్ రాజుకు ఆటిట్యూడ్ వచ్చింది అంటారు. నితిన్ రీసెంట్ ఇంటర్వ్యూలో తన గుడ్ బ్యాడ్ ఏంటో చెప్పండి అని అడిగితే నేను అల్లు అర్జున్ కంటే నువ్వు ముందు కెరీర్ స్టార్ట్ చేశావ్, ఆయన రేంజ్ కు వెళ్లలేకపోయావ్ అని ఒక వెల్ విషర్ గా చెప్పాను. మా మధ్య ఉన్న రిలేషన్ తోనే అలా చెప్పాను. దాన్ని నెగిటివ్ గా చూడొద్దు.
– “తమ్ముడు” మూవీకి అజనీష్ మంచి సౌండింగ్ డిజైన్ చేశాడు. మనమంతా కొత్త సినిమా కావాలనుకుంటాం. శ్రీరామ్ కూడా కొత్తగా ప్రయత్నిస్తా అన్నాడు. మేము ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి చేయించాం. శుక్రవారం మార్నింగ్ షో చూసిన మీ అందరికీ మా సినిమా నచ్చితే సూపర్ హిట్ దక్కినట్లే. కథగా చూస్తే ఇది సింపుల్ స్టోరీ. అక్కా తమ్ముడి మధ్య ఓ సమస్య రావడం, ఆ సమస్యను సాల్వ్ చేసుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చేశారు అనేది మూవీలో చూస్తారు. ఈ కథను స్క్రీన్ ప్లే పరంగా కొత్తగా చూపిస్తూ, యాక్షన్ సీక్వెన్స్ తో వెళ్తూ ఆసక్తికరంగా దర్శకుడు తెరకెక్కించారు.
– నిర్మాతగా సినిమాను బాగా రెడీ చేసి ప్రాపర్ గా రిలీజ్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. వారికి నచ్చితే సూపర్ హిట్ అవుతుంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు డైరెక్టర్ అనిల్ బాగా ప్లాన్ చేసి ప్రేక్షకులకు మూవీ రీచ్ అయ్యేలా చేశాడు. ఆ సినిమా మేము అనుకున్నదానికంటే ఎక్కువ సక్సెస్ అయ్యింది. తమ్ముడు రిజల్ట్ మీద కాన్ఫిడెంట్ గా ఉన్నాం, అయితే ఎంత రేంజ్ హిట్ అవుతుంది అనేది మాత్రం రిలీజ్ రోజునే తెలుస్తుంది. ఫలానా ఓటీటీ సినిమాను తీసుకుంది అని ముందే ప్రకటించడం ఆపేస్తే మంచిది. ఓటీటీలు కూడా ఈ విషయంలో సపోర్ట్ చేస్తున్నాయి. తమ్ముడు మూవీ కంటెంట్ కు వస్తున్న వ్యూస్ విషయంలో జెన్యూన్ గా ఉంటున్నాం.
– ప్రతిభ గల కొత్త వాళ్లకు అన్ని విభాగాల్లో అవకాశాలు ఇవ్వాలనే దిల్ రాజు డ్రీమ్స్ స్టార్ట్ చేశాం. మొదటి రోజునే మాకు 12 వేల అప్లికేషన్స్ వచ్చాయి. అందులో స్క్రూటినీ చేసి 1400 అప్లికేషన్స్ తీసుకున్నాం. ప్రొడ్యూసర్ గా 81 అప్లికేషన్స్ వస్తే వాటిలో వాళ్ల కంపెనీ హిస్టరీ ఏంటి అని డీటెయిల్స్ చూసి 7 అప్లికేషన్స్ తీసుకున్నాం. ఇందులో రెండు మోడల్స్ చేస్తున్నాం. ఒకటి కథ బాగుంటే మేమే ఫండింగ్ చేసి వాళ్లతో మూవీ చేయిస్తాం. రెండోది వాళ్లే సినిమా చేసుకుని మా ప్రెజెన్స్, మా గైడెన్స్ లో రిలీజ్ చేస్తాం. ఈ క్రమంలో కొత్త నిర్మాతలు కూడా ఇండస్ట్రీకి వస్తారని ఆశిస్తున్నాం.
– ఎఫ్ డీసీ నుంచి గద్దర్ అవార్డ్స్ చేశాం. నెక్ట్స్ ప్రస్తుతం మన రాష్ట్రంలో ఆగిపోయిన చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ నిర్వహించాలని అనుకుంటున్నాం. ఆన్ లైన్ టికెటింగ్, రన్ ట్రాక్ తీసుకొచ్చే ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం మా సంస్థలో రౌడీ జనార్థన, ఎల్లమ్మ, దేత్తడి ప్రొడక్షన్ లో ఉన్నాయి. మరో ప్రాజెక్ట్ కూడా ఉంది. ఈ ఏడాది చేస్తున్న నాలుగు సినిమాలు వచ్చే ఏడాది రిలీజ్ కు తీసుకొస్తాం. వచ్చే ఏడాదిలో చేయాల్సిన ఐదారు మూవీస్ స్క్రిప్ట్ నెరేషన్ స్టేజ్ లో ఉన్నాయి. అవి 2026లో స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ ఎస్వీసీ, దిల్ రాజు ప్రొడక్షన్స్ లో రాబోతున్న కొత్త మూవీస్. నెక్ట్స్ ఇయర్ వచ్చే సినిమాల్లో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఒకటి, మార్కో మూవీ డైరెక్టర్ హనీఫ్ తో ఒక సినిమా ఉంటాయి. అలాగే ఇద్దరు కొత్త దర్శకులతో సినిమాలు లాక్ చేశాం. యానిమల్ తో ఒక సినిమా ఉంటుంది. అందులో నటించే స్టార్ హీరో కోసం చూస్తున్నాం. ఇవి కాకుండా దిల్ రాజు డ్రీమ్స్ లో రెండు మూడు చిత్రాలు లైనప్ లో ఉన్నాయి. ఎలాంటి కంటెంట్ తో సినిమాలు తీస్తే ఆడియెన్స్ థియేటర్స్ కు వస్తారు అనేది డిస్కస్ చేస్తున్నాం.