
సమ్మర్ లో వన్ అఫ్ ది బిగ్గెస్ట్ అట్రాక్షన్ గా చౌర్య పాఠం ఏప్రిల్ 25న థియేటర్లలోకి రాబోతోంది – త్రినాథరావు నక్కిన
బ్లాక్ బస్టర్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తన అప్ కమింగ్ క్రైమ్-కామెడీ డ్రామా ‘చౌర్య పాఠం’తో మూవీ ప్రొడక్షన్ అడుగుపెడుతున్నారు. యంగ్ ట్యాలెంటెడ్ ఇంద్రా రామ్‌ను హీరోగా పరిచయం చేస్తున్నారు. కార్తికేయ -2 మొదలైన చిత్రాలకు చందూ మొండేటి వద్ద అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేసిన నిఖిల్ గొల్లమారి ఈ మూవీతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. నక్కిన నెరేటివ్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ మూవీకి వి చూడమణి సహ నిర్మాత. ఈ చిత్రం టీజర్ ట్రైలర్ థ్రిల్లింగ్ క్రైమ్, డార్క్ హ్యూమర్ బ్లెండ్ తో ఇప్పటికే బజ్ క్రియేట్ చేసింది. సాంగ్స్ సూపర్ హిట్అయ్యాయి. సమ్మర్ లో వన్ అఫ్ ది బిగ్గెస్ట్ అట్రాక్షన్ గా ‘చౌర్య పాఠం’ ఏప్రిల్ 25న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత త్రినాథరావు నక్కిన విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
ఈ సినిమాని నిర్మించడానికి ఈ కథలో మిమ్మల్ని ఆకట్టుకున్న అంశాలు ఏమిటి?
– కార్తిక్ ఘట్టమనేని ఫాదర్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేశారు. ఆయన సర్వీస్ లో ఉన్నప్పుడు ఓ చిలిపి దొంగతనం కేసు జరిగింది. ఆ సంఘటన గురించి కార్తిక్ చెప్పినప్పుడు చాలా ఇంట్రస్టింగ్ గా అనిపించింది. ఇది సినిమాగా చేయమని కార్తిక్ ని అడిగాను. తను సరే అన్నాడు. అలా ఈ సినిమా చేయడం జరిగింది. ఆ కేసుని యధావిధిగా తీసుకోలేదు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని పూర్తి సినిమాటిక్ గా చేయడం జరిగింది.
హైస్ట్ సినిమాలకి బడ్జెట్ ఎక్కువ అవుతుంది కదా.. ?
– అవును. మామూలు సినిమాలు కంటే హైస్ట్ సినిమాలు తీయడం ఖర్చుతో కూడుకున్న పని. మేము అనుకున్నదాని కంటే ఒక పదిశాతం బడ్జెట్ పెరిగింది. కంపనీ నుంచి వస్తున్న తొలి సినిమా. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచి క్యాలిటీతో తీశాం. అందులోనూ కార్తిక్ లాంటి డీవోపీ వున్నప్పుడు టెక్నికల్ గా చాలా యాడ్ ఆన్స్ వుంటాయి. సినిమా అవుట్ పుట్ ఎక్సలెంట్ క్యాలిటీతో వచ్చింది.
హీరో ఇంద్ర రామ్ గురించి ?
– ఇంద్ర రామ్ కొత్త అబ్బాయి. మొదట్లో నేను కాస్త భయపడ్డాను. వర్క్ షాప్ చేశాం. సెట్స్ పైకి వెళ్ళిన తర్వాత కూడా చిన్న భయం ఉండింది. అయితే రెండు రోజుల తర్వాత క్యారెక్టర్ పట్టేశాడు. అద్భుతంగా చేశాడు. తనే కాదు ఇందులో ప్రతి ఒక్కరూ చాలా చక్కగా పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇందులో క్యారెక్టర్స్ తప్పా ఆర్టిస్టులు కనిపించరు. అంత సహజంగా పాత్రల్లో ఒదిగిపోయారు.
డైరెక్టర్ నిఖిల్ గురించి?
– నిఖిల్ ని కార్తికేయ షూటింగ్ లో చూశాను. చాలా యాక్టివ్ గా వర్క్ చేస్తాడు. ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు అనుకున్న సమయంలో కార్తిక్.. నిఖిల్ పేరు చెప్పాడు. ఈ సినిమాకి విజువల్ సెన్స్ వున్న డైరెక్టర్ కావాలి. నిఖిల్ కి ఆ ఇమాజినేషన్ వుంది. నేను ఎలా అనుకున్నానో అలా సినిమాని తీర్చిదిద్దాడు. సినిమాని హెల్తీగా ఫినిష్ చేశాం. సినిమా చాలా మెచ్యుర్డ్ గా వుంటుంది. కాన్సెప్ట్ అందరినీ అలరిస్తుంది.
నిర్మాణంలోకి రావడానికి కారణం?
– కొత్తవాళ్ళకి ఒక ఫ్లాట్ ఫామ్ క్రియేట్ చేయడం నా డ్రీం. అది ఎప్పటినుంచో ఉంది. ఒక జనరేషన్ కి ఒక వేదిక ఇచ్చినట్లుగా వుంటుంది. నాకు సంపాదన మీద దృష్టి లేదు. కొత్త వారికి అవకాశం కల్పించాలనే మంచి ఉద్దేశంతోనే నిర్మాణంలోకి రావడం జరిగింది.
చౌర్యపాఠంలో దొంగలకి గుణపాఠం వుంటుందా?
– దొంగలకి కాదు కానీ దొంగతనం చేయాలనుకునే వారికి ఓ పాఠం వుంటుంది(నవ్వుతూ)
రాజీవ్ కనకాల క్యారెక్టర్ గురించి ?
– తనది మంచి క్యారెక్టర్. నిఖిల్ చాలా కొత్తగా డిజైన్ చేసుకున్నాడు. అలాగే సలీం ఫేకు క్యారెక్టర్ కూడా అలరిస్తుంది.
మ్యూజిక్ గురించి?
– ఈ సినిమాని కొంతమంది నిర్మాతలు దర్శకులు డిస్ట్రిబ్యూటర్లకి చూపించాను. అందరూ మెచ్చుకున్న ఒకే ఒక వ్యక్తి మ్యూజిక్ డైరెక్టర్. బీజీఎం అద్భుతంగా చేశాడు. పాటలు మంచి హిట్ అయ్యాయి.
హీరోయిన్ పాయల్ రాధకృష్ణ గురించి?
– ఇది హైస్ట్ ఫిల్మ్. ఇది ఒక ప్రత్యేకమైన లుక్ వుండాలి. అలాగే నేటివిటీ మిస్ అవ్వకూడదు. ఈ క్యారెక్టర్ కి పాయల్ పర్ఫెక్ట్ గా యాప్ట్ అయ్యింది. చాలా చక్కగా చేసింది.
మొన్న మీరు థియేటర్స్ పై చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి? ఆ కామెంట్స్ చేయడానికి కారణం?
– వైరల్ కావాలని ఆ కామెంట్స్ చేయలేదు. యధార్ధం తెలియాలని చెప్పాను. నిజానికి నేను థియేటర్స్ కి రమ్మని ఆడియన్స్ ని రిక్వెస్ట్ చేశాను. థియేటర్స్ కల్చర్ ని కంటిన్యూ చేయమని కోరారు. కానీ అది వదిలేసి ముందు చెప్పిన మాటలే హైలెట్ చేశారు.
ఆడియన్స్ థియేటర్స్ కి రావడం తగ్గించడానికి గల కారణం ఏమిటి ?
– చాలా కారణాలు వున్నాయి. సినిమాలు చాలా జాగ్రత్తగా తీయాల్సిన పరిస్థితి వుంది. ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించే సినిమాలు తీయడంపై ఎక్కువ ఫోకస్ పెట్టాలి.
డైరెక్టర్ గా కొత్తగా చేయబోతున్న చిత్రాలు ?
– మైత్రీ మూవీ మేకర్స్, దిల్ రాజు గారు, ఎకే ఎంటర్టైన్మెంట్స్ లో సినిమాలు చేయాలి.
ఆల్ ది బెస్ట్
– థాంక్ యూ