
బూమరాంగ్ ఆడియన్స్ కి సరికొత్త సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది – శివ కందుకూరి
పలు భాషలలో 34 చిత్రాలకు డీవోపీగా పనిచేసిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఆండ్రూ బాబు, అను ఇమ్మాన్యుయేల్, శివ కందుకూరి లీడ్ రోల్స్ లో నటిస్తున్న ‘బూమరాంగ్’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బిగ్ మూవీ మేకర్స్ లిమిటెడ్, My3 ఆర్ట్స్ బ్యానర్లపై లండన్ గణేష్, డా. ప్రవీణ్ రెడ్డి వూట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సితార ఫిల్మ్స్ లిమిటెడ్ లైన్ ప్రొడక్షన్‌ని నిర్వహిస్తోంది. ఈ రోజు మేకర్స్ ‘బూమరాంగ్’ గ్లింప్స్ ని లాంచ్ చేశారు.
గ్లింప్స్ లాంచ్ ప్రెస్ మీట్ లో కేఎల్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ఆండ్రూ మంచి టెక్నిషియన్. తను ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. తొలి సినిమాకే కర్మ థీమ్ తీసుకున్నాడు. చాలా ఛాలెజింగ్ కాన్సెప్ట్ ఇది. విజువల్స్ చాలా బావున్నాయి. శివ కందుకూరి మంచి యాక్టర్. డిఫరెంట్ కథలు చేస్తున్నారు. ఈ రోజుల్లో ఇలాంటి డిఫరెంట్ థీం వున్న థ్రిల్లర్స్ బాగా ఆడుతున్నాయి. టీం అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’అన్నారు
డైరెక్టర్ విజయ్ కుమార్ కొండా మాట్లాడుతూ.. ఆండ్రూ నా సినిమాలన్నీటికీ డివోపీ. ఆయన ఫస్ట్ టైం డైరెక్టర్ అవ్వడం చాలా ఆనందంగా వుంది. ఈ సినిమా ఆయన బ్లాక్ బస్టర్ కొడతారని నమ్ముతున్నాను. హారర్ థ్రిల్లర్ కి మ్యూజిక్ చాలా ఇంపార్టెన్స్ వుంటుంది. మ్యూజిక్ డైరెక్టర్ గా అనూప్ రూబెన్స్ ని సెలెక్ట్ చేసుకోవడంతోనే సక్సెస్ సాధించినట్లయింది. శివ డిఫరెంట్ కథలు చేస్తున్నారు. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’ చెప్పారు.
హీరో శివ కందుకూరి మాట్లాడుతూ.. ఈ సినిమా చేయడానికి మెయిన్ రీజన్ ఆండ్రూ గారు. ఆయన కథని చెప్పి ఆ క్యారెక్టర్ ని నేను చేయగలని అనడం నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఈ సినిమాలో ఒక డార్క్ సైడ్ వుంది. ఈ సినిమాలో అండర్ కరెంట్ ఎమోషన్ చాలా స్ట్రాంగ్ గా వుంది. ఖచ్చితంగా ఇది డిఫరెంట్ మూవీ అవుతుంది. ఈ సినిమాకి పని చేసిన అందరికీ బూస్ట్ ఇస్తుంది. ఆండ్రూ గారు ఇలాంటి మరెన్నో డిఫరెంట్ కథలు తీస్తారని కోరుకుంటున్నాను. ‘బూమరాంగ్’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మీరంతా థియేటర్స్ చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను’అన్నారు.
డైరెక్టర్ ఆండ్రూ బాబు మాట్లాడుతూ.. నేను కెమెరామెన్ గా ఎన్నో సినిమాలు చేశాను. డైరెక్షన్ చేయాలని కోరిక ఎప్పటినుంచో ఉండేది. నేను డిఓపి కాకముందు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లోనే వర్క్ చేశాను. కరోనా సమయంలో చాలా కథలు రాశాను. అందులో ఫస్ట్ సెలెక్ట్ చేసిన కథ ‘బూమరాంగ్’. ఈ కథ చెప్పినప్పుడు ప్రవీణ్ గారు ఇమ్మీడియట్ గా ఒప్పుకున్నారు. ఈ స్క్రిప్ట్ చాలా బాగా వచ్చింది. ఇది మెసేజ్ ఓరియెంటెడ్ సైకలాజికల్ థ్రిల్లర్. ఈ ఈవెంట్ కి వచ్చిన దామోద ప్రసాద్ గారికి విజయ్ గారికి అందరికీ థాంక్యూ’అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ.. ఆండ్రూ గారు నేను కలిసి చాలా సినిమాలకి వర్క్ చేశాం. తను చాలా పాషనేట్ టెక్నిషియమ్. ఈ సినిమాని అద్భుతమైన టేకింగ్ తో తీశారు. శివ అను చాలా చక్కగా నటించారు. ఇది చాలా మంచి థ్రిల్లర్. అందరికీ ఆల్ ది బెస్ట్’అన్నారు
నిర్మాత డా. ప్రవీణ్ రెడ్డి వూట్ల మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమా కర్మ సిద్దాంతం ఆధారంగా తీశాం. ఆండ్రూ గారి సినియారిటీ బాగా కలిసొచ్చింది. శివ గారు చాలా సపోర్ట్ చేశారు. అనూప్ రూబెన్స్ గారు అద్భుతమైన మ్యూజిక్. టీం అంతా బావుంటేనే సినిమా సాఫీగా వెళ్తుంది. ఈ సినిమాకి అందరూ మంచి గా హార్డ్ వర్క్ చేశారు కాబట్టే అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది. సినిమాకి మీ అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను’అన్నారు.
తారాగణం: అను ఇమ్మాన్యుయేల్, శివ కందుకూరి, వైవా హర్ష, వెన్నెల కిషోర్, ఎస్ నివాసిని, షాని సాల్మన్,
మహేంద్ర తదితరులు.
సాంకేతిక సిబ్బంది:
ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ: బిగ్ మూవీ మేకర్స్ లిమిటెడ్ & మై3 ఆర్ట్స్
నిర్మాతలు: లండన్ గణేష్ & డా. ప్రవీణ్ రెడ్డి వూట్ల
లైన్ ప్రొడక్షన్స్: సితార ఫిల్మ్స్ లిమిటెడ్
డైరెక్టర్ & డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: ఆండ్రూ బాబు
సంగీతం: అనూప్ రూబెన్స్
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
ఆర్ట్ డైరెక్టర్: DRK కిరణ్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, శ్రీమణి, కృష్ణ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: షాని సాల్మన్
పీఆర్వో: వంశీ-శేఖర్