శబ్దం టెక్నికలీ చాలా రోజుల తర్వాత చూసిన టాప్ నాచ్ ఫిల్మ్- నాని

యశోద హెడ్ స్ట్రాంగ్ స్టబన్ విమెన్… తనకి ఎమోషనల్ పెయిన్ వుంటుంది – హీరోయిన్ అన్షు
పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ ల్యాండ్‌మార్క్ 30వ సినిమా ‘మజాకా’కి ధమాకా మేకర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్ పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మాస్ ఎంటర్టైనర్లో రీతు వర్మ హీరోయిన్. మన్మధుడు ఫేమ్ అన్షు, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ హైలీ ఎంటర్ టైనింగ్ మూవీ శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 26న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ అన్షు విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.
మీ పూర్తి పేరు అన్షు అంబానీ నా ?
– అంబానీ అనేది చాలా పాపులర్ సర్ నేమ్. అయితే నా ఇంటిపేరు అది కాదు. అసలు అంబానీ అనే పేరు నాకు ఎలా వచ్చిందో కూడా తెలీదు. నా వికిపీడియాలో కూడా అదే పేరు వుంది. అక్కడ ఎలా మార్చాలో కూడా తెలీదు. మీలాంటి వారు ఎవరైనా హెల్ప్ చేస్తే బావుంటుంది.(నవ్వుతూ) నా పేరు అన్షు. నాకు ఇంటి పేరు వుంది కానీ ఆ పేరు ఎక్కడ వాడలేదు. నేను సచిన్ సాగర్ ని పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు అన్షు సాగర్. అయితే సింపుల్ అండ్ స్వీట్ గా అన్షు ని పిలిస్తే హ్యాపీగా ఫీలౌతాను.
రెండు మూడు సినిమాల తర్వాత మళ్ళీ తెరపై కనిపించకపోవడానికి కారణం ?
– నేను 15 ఏళ్లకే ఇండస్ట్రీలో వచ్చేశాను. అప్పటికి అంత ఎమోషనల్ మెచ్యురిటీ లేదు. ఒకవేళ మన్మధుడు నా 25 ఏళ్ల వయసులో చేసి వుంటే సినిమాల్లోనే కొనసాగడానికి అలోచించేదాన్ని. అప్పటికి నా చదువు కూడా పూర్తి కాలేదు. లండన్ వెళ్ళిపోయాను. కాలేజ్ పూర్తి చేసి మాస్టర్స్ చేశాను. సైకాలజిస్ట్ అయ్యాను. సొంతగా క్లీనిక్ పెట్టాను. 24 ఏళ్లకి పెళ్లి చేసుకున్నాను. నాకు ఇద్దరు పిల్లలు. ఇది బ్యూటీఫుల్ జర్నీ.
– మళ్ళీ సినిమాల్లో చేయాలని వుండేది. మన్మధుడు రీ రిలీజ్ కి వచ్చిన రెస్పాన్స్ నాకు చాలా గొప్ప కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఇంట్లో వారి సపోర్ట్ తో మళ్ళీ ఈ సినిమాతో తెరపైకి రావడం ఆనందంగా వుంది. ఇది గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. ఇప్పుడు చాలా మంది ఫిల్మ్ మేకర్స్ క్యారెక్టర్స్ కోసం సంప్రదిస్తున్నారు. ఇందులో చాలా మదర్ రోల్స్ వున్నాయి. అయితే కేవలం ఒకే తరహ పాత్రలు చేయాలని లేదు. ఈ సినిమా రిలీజ్ తర్వాత దర్శక నిర్మాతలు మరిన్ని వైవిధ్యమైన పాత్రల కోసం అప్రోచ్ అవుతారనే నమ్మకం వుంది.
మీ రీఎంట్రీ కోసం ఈ కథని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం?
– మజాకా లవ్లీ స్టొరీ. నాకు చాలా నచ్చింది. ప్రసన్న గారు ఈ కథ చెప్పినప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. నవ్వుతూనే వున్నాను. నా క్యారెక్టర్ కు చాలా ఇంపార్టెన్స్ వుంది. చాలా హెవీ రోల్. 23 ఏళ్ల తర్వాత నేను మళ్ళీ తెరపై కనిపిస్తున్న ఈ సినిమా అందరిని అలరిస్తుందని, నా పెర్ఫార్మెన్స్ ని అందరూ ఇష్టపడతారనే నమ్మకం వుంది.
20 ఏళ్ల తర్వాత మళ్ళీ సెట్స్ లోకి రావడం ఎలా అనిపించింది ?
– చాలా నెర్వస్ ఫీలయ్యాను. న్యూ కమ్మర్ లానే అనిపించింది. అయితే టీంలో అందరూ ఎంతో సపోర్ట్ చేశారు. రెండు రోజులు తర్వాత అంతా కుదురుకుంది.
ఇందులో ఛాలెంజ్ గా అనిపించిన ఎలిమెంట్ ఏమిటి ?
– తెలుగు లాంగ్వేజ్. తెలుగు పాఠాలు నేర్చుకున్నాను. తెలుగు టీచర్ సురేఖ గారు చాలా ఓపికగా తెలుగు నేర్పించారు. చాలా హోం వర్క్ చేశాను. నేను బ్రిటిష్ ఇండియన్ ని. ఇప్పటికీ లండన్ లోనే ఉంటున్నాను. తెలుగు మాట్లాడటానికి నా వంతు ప్రయత్నం చేశాను. అది మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను.
మజాకా లో మీ క్యారెక్టర్ ఎలా వుంటుంది ?
– నా క్యారెక్టర్ పేరు యశోద. తను హెడ్ స్ట్రాంగ్ స్టబన్ విమెన్. తనకి ఎమోషనల్ పెయిన్ వుంటుంది. అది ఆ పాత్రలో కనిపిస్తుంది. యశోద పాత్రలో లీనం కావడానికి నా వంతు ప్రయత్నం చేశాను.
డైరెక్టర్ త్రినాథ్ రావు నక్కిన గారితో వర్క్ చేయడం ఎలా ఎలా అనిపించింది ?
– త్రినాథ్ గారు లవ్లీ డైరెక్టర్. తనకి ఓర్పు చాలా ఎక్కువ. తనతో వర్క్ చేసినప్పుడు సినిమాకి లాంగ్వేజ్ బారియర్ కాదనిపించింది. తను స్వీట్ పర్శన్. ఆయనతో వర్క్ చేయడం చాలా ఆనందంగా వుంది.
రావు రమేష్ గారితో వర్క్ చేయడం గురించి ?
– రావు రమేష్ గారు జెంటిల్మెన్. చాలా సపోర్టివ్. చాలా ఓపికగా వుంటారు. ఆయన డబ్బింగ్ పూర్తి చేసి అన్షు అద్భుతంగా చేశావ్అ ని చెప్పడం చాలా ఎనర్జీ ఇచ్చింది. సెట్ లో అందరూ చాలా ఎనర్జిటిక్ అండ్ పాజిటివ్ గా వుంటారు.
సందీప్ కిషన్, రీతు వర్మతో కాంబినేషన్ సీన్స్ ఉన్నాయా ?
– ఉన్నాయి. సందీప్ వెరీ ఫన్నీ అండ్ కూల్. వెరీ నైస్ పర్శన్. రీతు వెరీ స్వీట్ అండ్ గ్రేస్ పుల్. మా మధ్య మంచి స్నేహం ఏర్పడింది. మేము కొన్ని బుక్స్ షేర్ చేసుకున్నాం.
హాస్య మూవీస్ ప్రొడక్షన్ గురించి ?
– హాస్య మూవీస్ అమెజింగ్ ప్రొడక్షన్ హౌస్. రాజేష్ గారు నైస్ పర్శన్. చాలా సపోర్ట్ చేశారు.
రాఘవేంద్ర సినిమాలో ప్రభాస్ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
– ప్రభాస్ గారు చాలా కైండ్ పర్శన్. వెరీ స్వీట్. అమెజింగ్ పెర్ఫార్మర్. తను హంబుల్ స్టార్.
ఎలాంటి పాత్రలు చేయాలని వుంది ?
– ఎలాంటి క్యారెక్టర్ చేసినా కథ పరంగా మంచి స్ట్రెంత్ వున్న క్యారెక్టర్స్ చేయడానికి ఇష్టపడతాను. మళ్ళీ నటించడానికే వచ్చాను. పెర్ఫార్మెన్స్ కి స్కోప్ వున్న క్యారెక్టర్స్ చేయాలని వుంది.
ఆల్ ది బెస్ట్
– థాంక్ యూ