ఈ పాలి యేట గురితప్పేలేదు. రేపొద్దున్న రాజులమ్మ జాతరే – అక్కినేని నాగచైతన్య
![ఈ పాలి యేట గురితప్పేలేదు. రేపొద్దున్న రాజులమ్మ జాతరే – అక్కినేని నాగచైతన్య](https://filmybuzz.com/wp-content/uploads/2025/02/thandel-1-850x560.jpg)
ఈ పాలి యేట గురితప్పేలేదు. రేపొద్దున్న రాజులమ్మ జాతరే – అక్కినేని నాగచైతన్య
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇప్పటికే రిలీజైన ప్రమోషన్స్ కంటెంట్ హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు చార్ట్ బస్టర్ హిట్స్ గా టాప్ ట్రెండింగ్ లో వున్నాయి. భారీ అంచనాలు వున్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగావిడుదల కానుంది. ఈ సందర్భంగా టీం ప్రీరిలీజ్ క్యూ అండ్ ఏ ప్రెస్ మీట్ నిర్వహించింది.
చైతన్య గారు.. సినిమా పై చాలా అంచనాలు వున్నాయి. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ కి ఏం చెబుతారు?
-మేమంతా సినిమా చూశాం. చాలా పాజిటివ్ గా హ్యాపీగా వున్నాం. చివరి ముఫ్ఫై నిముషాలు సినిమా పీక్స్ లో వుంటుంది. అంచనాలు కు మించి సర్ ప్రైజ్ చేస్తుంది.
ఈ పాలి యేట గురితప్పేలేదు. రేపొద్దున్న రాజులమ్మ జాతరే.
చైతన్య గారు.. నాన్న గారు సినిమా చూశారా ?
-నాన్న గారు సినిమా చూశారు. ఆయనకి చాలా నచ్చింది. ఆయన డేట్స్ తెలుసుకుంటున్నాం. సక్సెస్ మీట్ కి తీసుకువెళ్తాం.
అరవింద్ గారు మీరు ఈ సినిమా కథ ముందు విన్నప్పుడు కొన్ని మార్పులు చెప్పారట ?
-ముందు కథ విన్నప్పుడు ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది. సెకండ్ హాఫ్ డాక్యుమెంటరీ నేచర్ లో వుంది. అందుకని కథ కొని రైటర్ డైరెక్టర్ కి ఇస్తే బావుంటుదని అనుకున్నాం. అలాగే జైలుకి వెళ్ళిన 30మందిని స్వయంగా కలిసి వారి నుంచి రైట్స్ తీసుకున్నాం. చందు సినిమా అద్భుతంగా తీర్చిదిద్దారు.
అరవింద్ గారు ఈ సినిమా స్వయంగా మీరే రిలీజ్ చేయడానికి కారణం ?
-మా కంట్రోల్ లేని ఏరియాల్లో బయటికి ఇస్తాం తప్పితే మిగతా అంతా మేమే రిలీజ్ చేస్తాం, లాభం, నష్టం మేమే భరించడం గీత ఆర్ట్స్ పాలసీ. మేము తీసిన సినిమా మీద మాకు నమ్మకం. మేము అనుకున్న దానికంటే ఈ సినిమాకి ఎక్కువ ఖర్చు అయ్యింది. వాసు వచ్చి అమ్మేద్దామా అన్నారు. ఏం పర్వాలేదు మనమే రిలీజ్ చేస్తున్నామని చెప్పా.
‘తండేల్’ లో మోస్ట్ సర్ ప్రైజ్ చైతు పెర్ఫార్మెన్స్. సినిమా సూపర్ హిట్. నేను 4.5 స్టార్స్ ఇస్తాను. రేపు మార్నింగ్ దుల్లకొట్టేద్దాం.
చందు గారు.. ఇది జరిగిన కథ. స్క్రీన్ ప్లే పరంగా ఎలాంటి ఛాలెంజ్ వచ్చింది ?
-ఈ ప్రేమకథలోని బ్యూటీ దూరం, ఎడబాటు. తొమ్మిది నెలలు ఓ మనిషి కోసం ఎదురుచూపు, ఆ మనిషి తనకోసం వస్తాడమే నమ్మకం.. ఇలా చాలా బ్యూటీఫుల్ ఎమోషన్ ఈ సినిమాలో వుంది.
చందు గారు.. చైతు.. సాయి పల్లవి ఈ ఇద్దరిలో ఎవరి పెర్ఫార్మెన్స్ బావుటుంది ?
-ఈ సినిమా చూసి బయటికి వచ్చిన తర్వాత ఎవరు బాగా చేశారనే డిబేట్స్ వుంటాయి. నన్ను అడిగే రాజు పాత్ర అని చెబుతా.
చందు గారు.. ఇందులో వుండే ఎమోషన్ మణిరత్నం గారి రోజా సినిమా అనిపించాయి ?
మీకు అలా అనిపించిందంటే ఐయాం సో హ్యాపీ. అందులో ఎమోషన్ కూడా వుండి అంతకు మించి వుంటాయి.
బన్నీ వాసు గారు.. పాకిస్తాన్ లో వుండే ఎపిసోడ్స్ ఎంత వరకు ఛాలెంజ్ గా అనిపించాయి?
-డైరెక్టర్ గారు పాకిస్తాన్ సీక్వెన్స్ కోసం చాలా రిసెర్చ్ చేశారు. నాగేంద్ర గారు ఒరిజినల్ లా అనిపించే అద్భుతమైన సెట్ వేశారు. సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా వున్నాం. డెఫినెట్ గా సినిమా పెద్ద హిట్ అవుతుంది.
చైతు గారు.. ఈ సినిమాలో మీరు ఫీలైన ఎమోషన్ ఎమోషన్ ఏమిటి ?
-ఈ సినిమా ప్యూర్ లవ్ స్టొరీ. రాజు సత్య ప్రేమ తర్వాతే ఏదైనా.
-ఈ సినిమాలో డ్యాన్స్ పరంగా పల్లవి నేను లవ్ స్టొరీ కంటే ఒక స్టెప్ పైకి వెళ్లాం. శివుని పాట థియేటర్స్ లో మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు.
అరవింద్ గారు.. అప్పట్లోనే 45 కోట్లు పెట్టి మగధీర సినిమా తీశారు.. ఇప్పుడు వందల కోట్లు పెట్టి సినిమాలు చేస్తున్నారు ? ఇంత ధైర్యం ఎలా వస్తోంది ?
-అప్పటికి 40 కోట్లు ఈ రోజు ద్రవ్యోల్బణం తీసుకుంటే సుమారు 350 కోట్లు అవుతుంది. ఈ రోజుల్లో ఇంత బడ్జెట్ తో సినిమాలు అందరూ తీస్తున్నారు. ఈ రోజు తెలుగు సినిమా నిర్మాత అంటే తలెత్తి చూస్తున్నారు. దీనికి కారణం అలాంటి సినిమాలు చేయగల హీరోలు, దర్శకులు తెలుగులో వున్నారు. ఇది తెలుగు వారి విజయం. గీత ఆర్ట్స్ పై రానున్న రోజుల్లో మచ్ బిగ్గర్ ఫిలిమ్స్ వస్తాయి.
లిరిక్ రైటర్ శ్రీమణి మాట్లాడుతూ.. సినిమా పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఆజాది పాట కూడా అద్భుతంగా వుంటుంది. సాహిత్యానికి గొప్ప స్థానం వున్న సినిమా ఇది. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అన్నారు.
ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర మాట్లాడుతూ..ఫిబ్రవరి 7న సినిమా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. చాలా ప్రేమించి చేసిన సినిమా ఇది. డైరెక్టర్ చందు గారు అద్భుతంగా మలిచారు. ఆడియన్స్ బిగ్ స్క్రీన్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చేలా సినిమా వుంటుంది.’ అన్నారు.