‘Pushpa 2: The Rule’ – Fastest Rs 829 crore movie in Indian cinema history
Pushpa 2: The Rule is a truly historic and iconic movie. After being crowned the biggest-ever opening-day grosser movie in the history of Indian cinema, it has continued to maintain its record-setting track record.
Day 1: All-time Indian film industry record
Day 2: All-time Indian film industry record
Day 3: All-time Indian film industry record
Day 4: All-time Indian film industry record
The film from Icon Star Allu Arjun and Sensational Director Sukumar is now the FASTEST INDIAN FILM to cross the Rs 800 CR Gross mark worldwide. The action extravaganza did it in just 4 days.
The film has amassed Rs 829 crores in four days.
Scorching the Hindi box office, the movie garnered Rs 86 Cr on Sunday. In the first four days, the Hindi version in India collected Rs 291 Cr. Pushpa 2 holds the record for being the highest non-holiday and non-festival extended opening weekend movie ever.
Pushpa 2 is an iconic blockbuster. The stature of Telugu cinema has been raised like anything.
ఇండియా మొత్తం పుష్ప-2 రికార్డుల మోత.. ఇండియన్ బాక్సాఫీస్‌పై పుష్పరాజ్ రూల్.. రూ.829 కోట్ల వసూళ్లతో ఇండియన్ సినీ చరిత్రలో సరికొత్త రికార్డు!
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ దర్శకుడు సుకుమార్‌ల పుష్ప-2 ది రూల్.. చిత్రం ఇండియన్ బాక్సాఫీస్‌పై సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఈ సన్సేషన్ కాంబినేషన్లో అత్యున్నత నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్ సుకుమార్ రైటింగ్ సంస్థతో కలిసి ఈ ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ సినిమాను నిర్మించింది. విడుదలకు ముందే ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం సినిమా విడుదల రోజు ప్రీమియర్స్ నుంచే సన్సేషనల్ బ్లాకబస్టర్ అందుకుంది. అల్లు అర్జున్ నట విశ్వరూపంకు, సుకుమార్ వరల్డ్ క్లాస్ టేకింగ్.. ప్రపంచ సినీ ప్రేమికులు ఫీదా అయిపోయారు. ముఖ్యంగా ఇండియాలో ఈ చిత్రం సృష్టించిన రికార్డుల పరంపరకు ఆకాశమే హద్దుగా ఉంది.
సినిమా తొలి రోజు నుంచే మొదటి రోజు, రెండవ రోజు, మూడవ రోజు వసూళ్లలో వరుసగా ఇండియా ఆల్‌టైమ్ రికార్డులు సృష్టించిన ఈ చిత్రం తాజాగా నాలుగు రోజు వసూళ్లలో కూడా రూ. 829 కోట్లు వసూలు చేసి ఇండియా చరిత్రలో ఆల్‌టైమ్ రికార్డు సృష్ఠించింది. కేవలం నాలుగు రోజుల్లోనే రూ.829 కోట్లు వసూలు చేసిన తొలి భారతీయ చిత్రంగా ‘పుష్ప-2’ ది రూల్ బాక్సాఫీస్‌పై సరికొత్త అధ్యాయాన్ని క్రియేట్ చేసింది. ప్రతి భాషలో సునామీలా దూసుకపోతున్న పుష్ప-2 ముఖ్యంగా బాలీవుడ్లో తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. బాలీవుడ్లో నాలుగో రోజు ఒక్క రోజులోనే రూ.86 కోట్లు వసూలు చేసి సరికొత్త సంచలనానికి తెరలేపింది. ఇప్పటి వరకు ఏ హిందీ చిత్రం కూడా సింగిల్ డేలో 86 కోట్ల నెట్‌ను సాధించలేదు. హిందీలో నాలుగు రోజులకు రూ. 291 కోట్లు కలెక్ట్ చేసి, ఇప్పటివరకు ఇంత త్వరగా అంటే కేవలం నాలుగు రోజుల్లోనే 291 కోట్లు కలెక్ట్ చేసిన హిందీ చిత్రంగా నిలిచింది. దీంతో పాటు పలు రికార్డులు కూడా పుష్పరాజ్ కైవసం చేసుకున్నారు. ఒక రికార్డు ప్రకటించే లోపే మరొ కొత్త రికార్డును పుష్ప-2 సాధిస్తుండటం యావత్ భారతీయ సినీ పరిశ్రమను సంభ్రమశ్చర్యాలకు గురిచేస్తుంది. రష్మిక మందన్నా నాయికగా నటించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన బాణీలను అందించాడు. కూబా ఫోటోగ్రఫీ సినిమాకు వన్నెతెచ్చింది. ఈ చిత్రం సాధించిన, సాధిస్తున్న వసూళ్లతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇండియా నెంబర్‌వన్ హీరోగా అందరూ కొనియాడుతున్నారు. దర్శకుడు సుకుమార్ కూడా భారతదేశం గర్వించదగ్గ దర్శకుడిగా టాప్ పొజిషన్లో ఉన్నాడు.