దేవకీ నందన వాసుదేవ లొ డివైన్ ఎలిమెంట్స్, ట్విస్ట్ లు అదిరిపోతాయి –
Vijay Deverakonda Released Teaser of ‘Sarangapani Jathakam’
‘Sarangapani Jathakam’, directed by Mohanakrishna Indraganti, is produced by Sivalenka Krishna Prasad under the banner of Sridevi Movies. The film stars Priyadarshi and Roopa Koduvayur in lead roles. This is the third collaboration between Indraganti and Sivalenka Krishna Prasad after the successful films ‘Gentleman’ and ‘Sammohanam’. The film is scheduled to be released on December 20th. Today, the teaser was released by the sensational star hero Vijay Deverakonda.
Speaking after the teaser release, Vijay Deverakonda said, “I started my career with my brother, Priyadarshi. He has been doing good films by doing lead roles in interesting stories. I just watched the teaser of his latest film, ‘Sarangapani Jathakam’, wherein his character believes in horoscopes. I don’t know what true horoscopes are like. When I and Darshi did ‘Pelli Choopulu’, we didn’t imagine that we would reach this level. Destiny has brought us here. I am so happy to see his journey. ‘Sarangapani Jathakam’ is directed by Mohanakrishna Indraganti. I can’t tell you how much I laughed watching his film ‘Ashta Chamma’. It was a very different content at that time. I enjoyed that movie a lot. Similarly, Sivalenka Krishna Prasad garu, the head of Sridevi Movies, has been making very good films for a long time. I wish ‘Sarangapani Jathakam’ a big success. All the best to the director-producer duo.”
In the Teaser, the male lead is a firm believer in horoscopes. He believes that our entire life is pre-determined. Not only does he believe that what is written in the predictions column in dailies every morning is infallible, but he also can’t contain his joy when something good happens in his life. He breaks into bouts of joy spontaneously, regardless of who is around him or where he is. What consequences does his unshakeable faith in horoscopes lead to? Why did Sarangapani try to kill someone at a wedding mandap when he got to marry his lover? Why did he stab VK Naresh’s character with a knife? Is it real or a dream? Who is the villain in his life? What kind of character did Tanikella Bharani play as a Kichakudu (mythological reference)? Why does he wait for a granny named Sundaramma to die? To find answers to these questions, you have to watch the movie in theaters on December 20th. Judging by the trailer, Srinivas Avasarala, Vennela Kishore, and Viva Harsha’s comic timing will make everyone laugh.
The comedy is also trendy. When an old woman teases the titular character, Vennela Kishore’s character gasps, “Of all the body parts, how come she remembers only that?” Avasarala Srinivas gets to mouth meaty lines: ‘He who has celestial bow Sharanga is Sarangapani’, and ‘I am not equipped with amulets and penance mantras’. Vadlamani Srinivas plays a father who cribs that his son is not practical-minded. The hero himself is after ‘My family, my friends, my office’.
Cast:
Priyadarshi, Roopa Koduvayur, VK Naresh, Tanikella Bharani, Avasarala Srinivas, Vennela Kishore, Viva Harsha, Sivannarayana, Ashok Kumar, Raja Chembolu, Vadlamani Srinivas, Pradeep Rudra, Ramesh Reddy, Kalpalatha, Roopa Lakshmi, Harshini, KLK Mani, ‘IMAX’ Venkat.
Crew:
Make-Up Chief: RK Vyamajala; Costume Chief: N Manoj Kumar; Costume Designers: Rajesh Kamarsu, Ashwin; Production Executives: K Ramanjaneyulu (Anji Babu), P Rasheed Ahmed Khan; PRO: Pulagam Chinnarayana; Digital Marketing: Talk Scoop; Co-Director: Kota Suresh Kumar; Lyricist: Ramajogayya Sastry; Stunts: Venkat – Venkatesh; Production Designer: Raveender; Editor: Marthand K Venkatesh; Director of Photography: PG Vinda; Music Director: Vivek Sagar; Line Producer: Vidya Sivalenka; Producer: Sivalenka Krishna Prasad; Writer, Director: Mohanakrishna Indraganti.
ప్రియదర్శి ఇంట్రెస్టింగ్ స్టోరీల్లో లీడ్ రోల్స్ చేస్తున్నాడు… మోహనకృష్ణ ఇంద్రగంటి సినిమాలు ఎంజాయ్ చేశా – సారంగపాణి జాతకం టీజర్ లాంచ్లో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ
మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన సినిమా ‘సారంగపాణి జాతకం’. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రియదర్శి, రూప కొడువాయూర్ జంటగా నటించారు. ‘జెంటిల్మన్’, ‘సమ్మోహనం’ విజయాల తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి, శివలెంక కృష్ణప్రసాద్ కలయికలో రూపొందుతున్న మూడో చిత్రమిది. డిసెంబర్ 20న సినిమా విడుదల చేయనున్నారు. ఈ రోజు సెన్సేషనల్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా టీజర్ విడుదల చేశారు.
టీజర్ విడుదల అనంతరం విజయ్ దేవరకొండ మాట్లాడుతూ… ”నా బ్రదర్ దర్శి (ప్రియదర్శి)తో నా కెరీర్ స్టార్ట్ చేశా. ఇంట్రెస్టింగ్ కథల్లో లీడ్ రోల్స్ చేస్తూ మనకు మంచి సినిమాలు అందిస్తున్నాడు. అతను హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘సారంగపాణి జాతకం’ టీజర్ ఇప్పుడే చూశాను. అందులో… దర్శి పాత్రకు జాతకాల మీద నమ్మకం ఉంటుంది. జాతకాలు ఎంత నిజం అనేది నాకు తెలియదు. ‘పెళ్లి చూపులు’ చేసినప్పుడు మేం ఈ స్థాయికి వస్తాం అని ఊహించలేదు. డెస్టినీ మమ్మల్ని ఇక్కడికి తీసుకు వచ్చింది. దర్శి జర్నీ చూడటం నాకు ఎంతో హ్యాపీగా ఉంది. ‘సారంగపాణి జాతకం’ సినిమాకు మోహనకృష్ణ ఇంద్రగంటి గారు దర్శకత్వం వహించారు. ఆయన ‘అష్టా చమ్మా’ సినిమా చూసి నేను ఎంత నవ్వుకున్నానో చెప్పలేను. అప్పట్లో అది చాలా డిఫరెంట్ కంటెంట్. ఆ మూవీని చాలా ఎంజాయ్ చేశా. అలాగే, శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ గారు ఎప్పటి నుంచో సినిమాలు చేస్తున్నారు. ఎన్నో మంచి సినిమాలు చేశారు. ‘సారంగపాణి జాతకం’ పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. మోహనకృష్ణ ఇంద్రగంటి గారికి, శివలెంక కృష్ణ ప్రసాద్ గారికి ఆల్ ది బెస్ట్” అని చెప్పారు.
ఇక ‘సారంగపాణి జాతకం’ టీజర్ విషయానికి వస్తే… హీరో జాతకాలను బాగా నమ్ముతాడు. ‘మన జీవితం మొత్తం మన చేతిలోనే రాసి ఉంటుంది’ అని చెబుతాడు. ప్రతిరోజూ ఉదయం పేపర్ చూసి అందులో రాసింది నిజం అవుతుందని నమ్మడమే కాదు, నిజమైన రోజు చుట్టుపక్కల ఎవరున్నారు? ఏం అవుతుంది? అనేది పట్టించుకోకుండా తన సంతోషాన్ని అందరి ముందు వ్యక్తం చేసే యువకుడు. మరి, ఆ జాతకాలపై అమితమైన నమ్మకం వల్ల అతని జీవితంలో ఎన్ని మార్పులు వచ్చాయి? ప్రేమించిన అమ్మాయిని పెళ్లికి సిద్ధమైన మండపంలో ఒకరిని సారంగపాణి ఎందుకు చంపడానికి ప్రయత్నించాడు? నరేష్ ను ఎందుకు కత్తితో పొడిచాడు? అది నిజమా? కలా? అతని జీవితంలో కీచకుడు ఎవరు? కీచకుడిగా తనికెళ్ళ భరణి ఎటువంటి క్యారెక్టర్ చేశారు? సుందరమ్మ మరణిస్తే హీరో ఎందుకు హ్యాపీగా ఫీలయ్యాడు? వంటి ప్రశ్నలకు సమాధానాలు డిసెంబర్ 20న థియేటర్లలో సినిమా చూసి తెలుసుకోవాలి. శ్రీనివాస్ అవసరాల, ‘వెన్నెల’ కిశోర్, హర్ష చెముడు వినోదం అందర్నీ నవ్విస్తుందని ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది.
‘మొత్తం మనిషిలో ఆ ఒక్క పార్ట్ గుర్తుందా ఈవిడకి’ – ‘బీ కార్పొరేట్, నాట్ డెస్పరేట్’ అని ‘వెన్నెల’ కిశోర్ చెప్పే డైలాగ్స్ నవ్వించాయి. ‘సారంగం అని ధనుస్సు చేతిలో ఉన్నవాడు సారంగపాణి’, ‘నా దగ్గర విరుగుడు మంత్రాలు, పూజలు, తాయత్తులు ఉండవు’ అని శ్రీనివాస్ అవసరాల, ‘నాలాంటి ప్రాక్టికల్ మనిషికి ఇలాంటి జాతకాల పిచ్చోడు కొడుకుగా ఎలా పుట్టాడే’ అని తండ్రి పాత్రలో వడ్లమాని శ్రీనివాస్, ‘నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్, నా ఆఫీస్’ అంటూ హీరో పదేపదే చెప్పే మాట కథపై క్యూరియాసిటీ క్రియేట్ చేశాయి.
ప్రియదర్శి పులికొండ, రూప కొడువాయూర్ జంటగా నటించిన ఈ సినిమాలో నరేష్ విజయకృష్ణ, తనికెళ్ళ భరణి, శ్రీనివాస్ అవసరాల, ‘వెన్నెల’ కిశోర్, ‘వైవా’ హర్ష, శివన్నారాయణ, అశోక్ కుమార్, రాజా చెంబోలు, వడ్లమాని శ్రీనివాస్, ప్రదీప్ రుద్ర, రమేష్ రెడ్డి, కల్పలత, రూప లక్ష్మి, హర్షిణి, కె.ఎల్.కె, మణి, ‘ఐమ్యాక్స్’ వెంకట్ ఇతర ప్రధాన తారాగణం.
ఈ చిత్రానికి మేకప్ చీఫ్: ఆర్.కె వ్యామజాల, కాస్ట్యూమ్ చీఫ్: ఎన్. మనోజ్ కుమార్, కాస్ట్యూమ్ డిజైనర్స్: రాజేష్ కామర్సు – అశ్విన్, మార్కెటింగ్: టాక్ స్కూప్, పీఆర్వో: పులగం చిన్నారాయణ, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: కె. రామాంజనేయులు (అంజి బాబు) – పి రషీద్ అహ్మద్ ఖాన్, కో డైరెక్టర్: కోట సురేష్ కుమార్, పాటలు: రామ జోగయ్య శాస్త్రి, స్టంట్స్: వెంకట్ – వెంకటేష్, ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: పీజీ విందా, సంగీతం: వివేక్ సాగర్, లైన్ ప్రొడ్యూసర్: విద్య శివలెంక, సహ నిర్మాత: చింతా గోపాలకృష్ణా రెడ్డి, నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్, రచన – దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.