Thanks Audience For Making “Vikatakavi” A Big Success – Rajani
హరుడు నుంచి విడుదలైన శ్రీహరి ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్
మైత్రీ బాక్సాఫీస్, మైత్రీ ఆర్ట్స్ బ్యానర్స్‌పై డాక్టర్ లక్ష్మణరావు డిక్కల, డాక్టర్ ప్రవీణ్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘హరుడు’. శ్రీహరి, హెబ్బా పటేల్,వెంకట్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. రాజ్ తాళ్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు చురుగ్గా సాగుతున్న ఈ చిత్రం నుంచి తాజాగా ఈ సినిమాలో లీడ్ రోల్ చేస్తున్న శ్రీహరి ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్‌ను డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ విడుదల చేసి టీమ్‌కు ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఈ పోస్టర్లో శ్రీహరి ఇంటెన్స్ లుక్‌లో ఆకట్టుకున్నారు.
ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ ‘మైత్రీ బాక్సాఫీస్, మైత్రీ ఆర్ట్స్ బ్యానర్స్‌లో వచ్చిన సినిమా ఇది. మా ఫస్ట్ పోస్టర్, టీజర్ ఆర్జీవీ గారి చేతులమీదుగా రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రొడ్యూసర్ లక్ష్మణరావు గారు ఈ సినిమాని ప్యాషనేట్‌గా నిర్మించారు. అవుట్‌పుట్ బాగా వచ్చింది. అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అని అన్నారు.
నిర్మాత లక్ష్మణరావు మాట్లాడుతూ ‘సినీ నిర్మాణరంగంలోకి శ్రీహరి గారి ప్రొద్బలంతో అడుగుపెట్టాం. మా బ్యానర్ విజయవంతంగా సాగాలని ఆశిస్తున్నా. మా పోస్టర్ రిలీజ్ చేసినందుకు ఆర్జీవీ గారికి థ్యాంక్యూ’ అని చెప్పారు.
చిత్రం : హరుడు
నటీనటులు : శ్రీహరి, వెంకట్, హెబ్బా పటేల్, సలోని, అలీ, సుమన్ తదితరులు
దర్శకుడు : రాజ్ తాళ్లూరి
బ్యానర్స్ : మైత్రీ బాక్సాఫీస్, మైత్రీ ఆర్ట్స్
సినిమాటోగ్రాఫర్ : ఆనంద్
ఎడిటర్ : మారుతి ఉప్పు
మ్యూజిక్ : మణి జీనా
నిర్మాతలు : డా.డిక్కల లక్ష్మణరావు, ప్రవీణ్ రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : రమేష్ కుమార్, కవిట
పీఆర్ఓ : హర్ష