దేవకీ నందన వాసుదేవ లొ డివైన్ ఎలిమెంట్స్, ట్విస్ట్ లు అదిరిపోతాయి –
I hope Jathara becomes a huge hit – Shiva Balaji
Sathish Babu Ratakonda is the hero and also the director for the upcoming flick Jathara. Deeya Raj plays the heroine. The film is produced by Radhakrishna Reddy and Shiva Shankar Reddy under the Radha Krishna Production banner in collaboration with MovieTech LLC, presented by Galla Manjunath. The film has been made with a fresh, intense storyline that hasn’t been touched by anyone before. Set against the backdrop of Chittoor district, the movie is set to release in theatres on the 8th of this month. The pre-release event for Jathara was held on Monday.
While speaking at the event, Sathish Babu shared, “I wrote this story based on real-life events. When I pitched the idea to the producers, they liked it a lot. I penned the story in 2016, but due to the pandemic, we had to take some time before finally completing Jathara. The film shows the village customs, the rituals, and the incidents that occur in the village. The producers stood by me like a backbone throughout the process. This is my first film both as an actor and a director. A big thanks to cameraman Prasad for delivering the visuals and frames I asked for. Special thanks to RK Naidu for showcasing the emotions of ten characters through a single role. Deeya Raj will surely win the hearts of the audience. I thank everyone who worked on the film. Please watch our film, releasing on November 8, and make it a success.”
Renowned director and producer Thammareddy Bharadwaj remarked, “We built a temple in our village and thought about shifting the deity’s idol, but everyone advised against it. The concept of this movie Jathara is quite similar. If the story is strong, people don’t care much about the hero or the director. Sathish, a newcomer, has worked as a hero, writer, and director for this movie. I wish he becomes a big hero and director like Rishabh Shetty. The trailer looks very interesting, and I hope the film becomes a big hit.”
Shiva Balaji said, “I watched the trailer of Jathara, and it looks very 0interesting. I wish all the best to hero-director Sathish Babu. I hope the film becomes a huge hit and brings good profits to the producers.”
Dhruva Vayu stated, “Small films with good content are finding more success these days. Slowly, people are returning to the theatres. I watched Jathara movie teaser and trailer, and I really liked them. I wish Sathish Babu all the best and hope the producers make good profits. Let’s make Jathara a mass hit on November 8.”
Vishva Krthikeya expressed his gratitude, saying, “Thanks to the director and producers for inviting me to the Jathara Pre-Release event. We worked really hard to bring our film Kaliyugam Pattanamlo to the theatres. I knew Sathish Babu as a lawyer and scientist, but he is also the writer, hero and director of this movie. I watched the trailer of Jathara and liked it a lot. I hope everyone watches this film and helps make it a big hit.”
Producer Shiva Shankar Reddy said, “I’ve had a good relationship with Sathish for ten years. When he shared the story with me, I really liked it. The film has turned out really well, and the technical team worked very hard. Thanks to everyone who worked on the movie.”
Deeya Raj thanked the director and producers for giving her such a great role and expressed her gratitude to the cameraman for showcasing her well on screen. “These days, small films are being appreciated by the audience, and I hope everyone will support our film too. I wish Jathara, arriving on November 8th, a great success,” said she .
‘జాతర’ పెద్ద విజయం సాధించి మంచి లాభాల్ని తెచ్చి పెట్టాలి.. ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివ బాలాజీ
సతీష్ బాబు రాటకొండ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన సినిమా ‘జాతర’. దీయా రాజ్ హీరోయిన్ గా నటించారు. ఈ చిత్రాన్ని గల్లా మంజునాథ్ సమర్పణలో మూవీటెక్ ఎల్‌ఎల్‌సితో కలిసి రాధాకృష్ణ ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రాధాకృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి నిర్మించారు. ఇంత వరకు ఎవ్వరూ టచ్ చేయని పాయింట్‌తో రగ్డ్గా, ఇంటెన్స్ డ్రామాతో ‘జాతర’ తెరకెక్కింది. చిత్తూరు జిల్లా బ్యాక్ డ్రాప్లో జరిగే జాతర నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 8న థియేటర్లోకి రాబోతోంది. ఈ క్రమంలో జాతర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను సోమవారం నాడు నిర్వహించారు.
సతీష్ బాబు మాట్లాడుతూ.. ‘యథార్థ సంఘటనల ఆధారంగా ఈ కథ రాశాను. నిర్మాతలకు ఈ పాయింట్ చెప్పినప్పుడు వాళ్లకి చాలా నచ్చింది. 2016లో కథ స్టార్ట్ చేశాను. మధ్యలో కరోనా వచ్చింది. ఆ తరువాత ఇంకాస్త టైం తీసుకుని జాతర చిత్రాన్ని చేశాం. ఊరి కట్టుబాట్లు, ఆ తంతులు, అందులో జరిగే ఘటనల గురించి చూపించాం. ఈ చిత్రానికి నిర్మాతలు బ్యాక్ బోన్‌లా నిలబడ్డారు. నటుడిగా, దర్శకుడిగా ఇది నాకు మొదటి సినిమా. నేను అడిగిన విజువల్స్, ఫ్రేమింగ్స్ ఇచ్చిన కెమెరామెన్ ప్రసాద్ గారికి థాంక్స్. పది మంది ఎమోషన్స్‌ను సింగిల్ కారెక్టర్లో చూపించిన ఆర్కే నాయుడు గారికి థాంక్స్. హీరోయిన్ దీయా గారు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతారు. సినిమాకు పని చేసిన ఆర్టిస్టులకి అందరికీ థాంక్స్. నవంబర్ 8న రాబోతోన్న మా చిత్రాన్ని అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.
ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. ‘మేం మా ఊర్లో గుడి కట్టించాం. అక్కడ ఉన్న దేవత విగ్రహాన్ని కదల్చాలని అనుకున్నాం. కానీ వద్దని అంతా వారించారు. ఈ జాతర మూవీ కాన్సెప్ట్ కూడా అదే. మంచి కథ ఉంటే.. హీరో, దర్శకుల గురించి జనాలు అంతగా పట్టించుకోరు. కొత్తగా వచ్చిన సతీష్ హీరో, రైటర్, డైరెక్టర్ అయ్యాడు. రిషభ్ శెట్టిలా పెద్ద హీరో, పెద్ద దర్శకుడు కావాలని కోరుకుంటున్నాను. ట్రైలర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
శివ బాలాజీ మాట్లాడుతూ.. ‘జాతర ట్రైలర్‌ను చూశాను. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. హీరో, దర్శకుడు సతీష్ బాబుకు ఆల్ ది బెస్ట్. ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవ్వాలి. నిర్మాతలకు మంచి లాభాలు రావాలి’ అని అన్నారు.
ధృవ వాయు మాట్లాడుతూ.. ‘కంటెంట్‌తో వచ్చే చిన్న చిత్రాలే ఎక్కువగా సక్సెస్ అవుతున్నాయి. మెల్లిగా అయినా కూడా జనాలు థియేటర్‌కు వస్తున్నారు. జాతర టీజర్, ట్రైలర్‌ను చూశాను. నాకు చాలా నచ్చింది. సతీష్ బాబుకు ఆల్ ది బెస్ట్. నిర్మాతకు మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను. నవంబర్ 8న మాస్ జాతరను చేయాలి’ అని అన్నారు.
విశ్వ కార్తికేయ మాట్లాడుతూ.. ‘జాతర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు నన్ను పిలిచిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. కలియుగం పట్టణంలో మూవీని థియేటర్లోకి తీసుకు రావడానికి మేం చాలా కష్టపడ్డాం. సతీష్ బాబు లాయర్, సైంటిస్ట్ అని తెలుసుకున్నా. సతీష్ ఈ మూవీకి రైటర్, హీరో మరియు దర్శకుడు. జాతర ట్రైలర్ చూశాను. నాకు చాలా నచ్చింది. అందరూ ఈ మూవీని చూసి పెద్ద హిట్ చెయ్యాలి’ అని అన్నారు.
నిర్మాత శివ శంకర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘సతీష్ గారితో నాకు పదేళ్ల నుంచి బంధం ఉంది. ఆయన చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. సినిమా బాగా వచ్చింది. టెక్నికల్ టీం చాలా కష్టపడింది. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికి థాంక్స్’ అని అన్నారు.
దీయా రాజ్ మాట్లాడుతూ.. ‘నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. నన్ను ఇంత బాగా చూపించిన కెమెరామెన్ గారికి థాంక్స్. ఇప్పుడు చిన్న చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి. వాటిని అందరూ ఆదరిస్తున్నారు. నవంబర్ 8న రాబోతోన్న మా సినిమాని కూడా చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.