Haiku Trailer Embellishes the Feel-Good Rom-Com with Heartwarming Emotions and

Saraswathi Movie Interesting First Look Unveiled
హీరోయిన్ సమంత లాంచ్ చేసిన వరలక్ష్మి శరత్ కుమార్ సరస్వతి మూవీ ఇంట్రస్టింగ్ ఫస్ట్ లుక్
వెర్సటైల్ పాత్రలతో అలరిస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో, తన సోదరి పూజా శరత్ కుమార్ తో కలిసి దోస డైరీస్ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం’సరస్వతి’. హై-కాన్సెప్ట్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్ ప్రేక్షకులలో క్యురియాసిటీ పెంచింది.
తాజాగా హీరోయిన్ సమంత ఈ చిత్రం ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. తెల్లని క్రాక్ టెక్స్చర్ బ్యాక్‌డ్రాప్ మధ్యలో ఎరుపు చీరలో ధైర్యంగా నడుస్తున్న రలక్ష్మి శరత్ కుమార్ కథలోని బలం-భావోద్వేగాలను హైలైట్ చేసినట్టుగా కనిపిస్తోంది. వెనుక భాగంలో బ్లాక్ అండ్ వైట్ షేడ్స్‌లో కనిపించే పాత్రల సిల్హౌట్స్ కథలోని ఇంటెన్స్ సూచిస్తున్నాయి. స్ట్రాంగ్ విజువల్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ పోస్టర్ క్యురియాసిటీ పెంచింది.
ఈ చిత్రంలో జీవా, ప్రకాష్ రాజ్, నాజర్, ప్రియమణి, రాధిక వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. సంగీత సంచలనం థమన్ ఎస్ సంగీతం అందిస్తుండగా, ఎ.ఎం. ఎడ్విన్ సకే కెమెరా మ్యాన్. వెంకట్ ఎడిటర్, సుధీర్ ఆర్ట్ డైరెక్టర్. ప్రవీణ్ డేనియల్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.
ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. మేకర్స్ త్వరలోనే ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేయబోతున్నారు.
తారాగణం: వరలక్ష్మి శరత్‌కుమార్, జీవా, ప్రకాష్ రాజ్, నాజర్, ప్రియమణి, రాధిక, కిషోర్ కుమార్, శ్రీకాంత్ అయ్యర్, రావు రమేష్, సప్తగిరి, మైమ్ గోపి, హరేష్ పరేడే, తులసి, రఘు బాబు, దేవీ ప్రసాద్, వెంకట్
సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం – వరలక్ష్మి శరత్ కుమార్
నిర్మాతలు – పూజా శరత్ కుమార్ & వరలక్ష్మి శరత్ కుమార్
సహ దర్శకుడు: నరేష్
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ప్రవీణ్ డేనియల్
సినిమాటోగ్రాఫర్: ఎడ్విన్ సకాయ్
సంగీతం: థమన్
ఎడిటర్ : వెంకట్
ఆర్ట్ డైరెక్టర్ : సుధీర్
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: విక్రమ్ స్వామి
ప్రొడక్షన్ కంట్రోలర్: సురేష్
పీఆర్వో- వంశీ శేఖర్
