A Warm Felicitation Ceremony for Senior Film Journalists, Senior Photographers,

మనసు ఇచ్చిన పిల్లా.. మాట తప్పితే ఎల్లా సాంగ్ ని విడుదల చేసిన రిలీజ్ హీరో నాని
ప్రస్తుత ట్రెండ్‌లో సినిమా పాటలతో పాటు మ్యూజికల్ ఆల్బమ్స్ కు కూడా మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే అనేక ఫోక్ సాంగ్స్‌కు ప్రేక్షకుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. సోషల్ మీడియాలో మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంటున్నాయి. తాజాగా మరో కొత్త ఫోక్ సాంగ్ ప్రేక్షకులను పలకరించబోతోంది. మనసు ఇచ్చిన పిల్లా.. మాట తప్పితే ఎల్లా అనే క్యాచీ టైటిల్‌తో లవ్ ఫెయిల్యూర్ పాటగా దీన్ని రూపొందించారు. శుక్రవారం ఈ సాంగ్ ను రీసెంట్గా సరిపోదా శనివారం సినిమాతో సూపర్ సక్సెస్ ను అందుకున్న నేచురల్ స్టార్ నాని రిలీజ్ చేసి టీం కు బెస్ట్ విషెస్ చెప్పారు. ఈ సాంగ్‌లో ప్రముఖ ఫొటో జర్నలిస్ట్ శ్యాం కుమార్ రావుట్ల లీడ్ రోల్ చేశారు. పులి పూజా ఫిమేల్ లీడ్‌గా నటించారు. రాజేష్ మిట్టపల్లి, రవి వడపల్లి కలిసి దర్శకత్వం వహించగా, సంగీత దర్శకుడు రమేష్ తుడిమిల్ల సాంగ్ కంపోజ్ చేశారు. నరేష్ పుట్టల నిర్మించారు. ఇదొక లవ్ ఫెయిల్యూర్ సాంగ్.. ఒకరిని ప్రేమించి, మరొకరిని పెళ్లాడే కాన్సెప్ట్ తో ఈ పాటను రూపొందించారు. ఇది సంగీత ప్రియులను కచ్చితంగా ఆకట్టుకుంటుందని మేకర్స్ చెప్పారు.
నటీనటులు : శ్యాం కుమార్. రావుట్ల పులి పూజా
రచయిత : వి.వి.విశ్వేష్ వర్మ
మ్యూజిక్ : రమేష్ తుడిమిల్ల
సింగర్ : హనుమంత్ యాదవ్
కెమెరా మెన్ : కిషన్, లక్కీ
ఎడిటర్ : నిరంజన్, సతీష్
దర్శకత్వం : రాజేష్ మిట్టపల్లి, రవి వడపల్లి
నిర్మాత : నరేష్ పుట్టల
పీఆర్వో : జీకే మీడియా