Dharmasthala Niyojakavargam is set for a worldwide grand theatrical release

Srikanth Birthday Special Poster Released From SYG
సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్, ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్స్ పాన్ ఇండియా మూవీ SYG (సంబరాల ఏటిగట్టు) నుంచి బ్రిటిషు గా శ్రీకాంత్ బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్
మెగా సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ పాన్-ఇండియా స్పెక్టికల్ SYG (సంబరాల ఏటిగట్టు) తో ఇంతకు ముందెన్నడూ చూడని ఎక్స్ పీరియన్స్ అందించడానికి సిద్ధమవుతున్నాడు. రోహిత్ కెపి దర్శకత్వంలో పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ హనుమాన్ అందించిన ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నెక్స్ట్ లెవల్ లో రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన అసుర ఆగమన గ్లింప్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
ఈ చిత్రంలో సీనియర్ హీరో శ్రీకాంత్ పవర్ ఫుల్ పాత్రని పోషిస్తున్నారు. ఈ రోజు శ్రీకాంత్ బర్త్ డే సందర్భంగా ఆయన్ని బ్రిటిషుగా పాత్రలో ప్రజెంట్ చేస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ రిలీజ్ చేశారు. ప్రతి గాయాన్ని ఒక పతకంలా ధరించే సైనికుడుగా ఆయన లుక్ అదిరిపోయింది. ఈ పోస్టర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. టాప్ టెక్నికల్ టీమ్ ఈ చిత్రానికి పని చేస్తోంది. సినిమాటోగ్రఫీని వెట్రివేల్ పళనిసామి అందిస్తుండగా, సంగీతాన్ని బి. అజనీష్ లోకనాథ్ సమకూరుస్తున్నారు. ఎడిటింగ్‌ను నవీన్ విజయకృష్ణ నిర్వహిస్తుండగా, ప్రొడక్షన్ డిజైన్‌ను గాంధీ నడికుడికర్ రూపొందిస్తున్నారు.
తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ పాన్-ఇండియా విడుదలకు సిద్ధమవుతున్న “సంబరాల ఏటిగట్టు” ఈ సంవత్సరంలో బిగ్గెస్ట్ సినిమాటిక్ ఈవెంట్ గా నిలుస్తోంది.
తారాగణం: సాయి దుర్గా తేజ్, ఐశ్వర్య లక్ష్మి, జగపతి బాబు, సాయి కుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: రోహిత్ కె.పి
నిర్మాతలు: కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి
బ్యానర్: ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్
DOP: వెట్రి పళనిసామి
సంగీతం: బి అజనీష్ లోక్‌నాథ్
ఎడిటర్: నవీన్ విజయ కృష్ణ
ప్రొడక్షన్ డిజైనర్: గాంధీ నడికుడికర్
ఫైట్స్: కెవిన్ మాస్టర్
కాస్ట్యూమ్ డిజైనర్: అయేషా మరియం
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హ్యాష్‌ట్యాగ్ మీడియా
