
Ram Charan Heads To Coimbatore For Wrist Surgery – Family Travels Along With Him
Mega Power Star Ram Charan is set to undergo wrist surgery tomorrow at the renowned Ganga Hospital in Coimbatore. The actor had sustained the injury during the shoot of Peddi but continued with the film’s promotional activities before deciding to focus on his recovery.
The Mega family is leaving for Coimbatore today to be by his side during the treatment. Megastar Chiranjeevi, Surekha, Upasana, and other close family members will remain with Charan, offering their support throughout the medical procedure.
The surgery will be performed by wrist specialist Dr. Praveen under the supervision of senior orthopaedic expert Dr. Rajasekar at Ganga Hospital, one of India’s most respected centres for advanced orthopaedic care. With an experienced medical team handling the procedure, the surgery is expected to be successful, followed by a smooth recovery and rehabilitation.
As Charan begins this important phase of recovery, fans from across the country have been flooding social media with prayers and heartfelt wishes.
మణికట్టు సర్జరీ కోసం కోయంబత్తూరుకు బయలుదేరిన రామ్ చరణ్.. తోడుగా వెళ్తున్న మెగా ఫ్యామిలీ
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రేపు కోయంబత్తూరులోని ప్రముఖ గంగా ఆసుపత్రిలో మణికట్టు సర్జరీ చేయించుకోనున్నారు. ‘పెద్ది’ సినిమా షూటింగ్ సమయంలో ఆయన మణికట్టుకు గాయం అయినప్పటికీ, సినిమా ప్రమోషన్స్ పూర్తి చేసిన తర్వాత చికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు.
రేపు కోయంబత్తూరులోని ప్రముఖ గంగా హాస్పిటల్లో రామ్ చరణ్‌కు సర్జరీ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈరోజే మెగా కుటుంబం కోయంబత్తూరుకు బయలుదేరుతోంది. మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, ఉపాసనతో పాటు కుటుంబ సభ్యులు రామ్ చరణ్‌కు తోడుగా ఉండనున్నారు.
ఈ సర్జరీను ప్రముఖ డాక్టర్ ప్రవీణ్, సీనియర్ ఆర్థోపెడిక్ నిపుణుడు డాక్టర్ రాజశేఖర్ పర్యవేక్షణలో నిర్వహించనున్నారు. అత్యాధునిక ఆర్థోపెడిక్ చికిత్సలకు పేరుగాంచిన గంగా హాస్పిటల్లో అనుభవజ్ఞులైన వైద్య బృందం ఈ శస్త్రచికిత్స చేయనుంది. ఆపరేషన్ విజయవంతంగా పూర్తై, అనంతరం రామ్ చరణ్ త్వరగా కోలుకుంటారని వైద్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలని దేశవ్యాప్తంగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయన కోసం ప్రార్థిస్తున్నారు.
