భర్త మహాశయులకు విజ్ఞప్తి లో మంచి సర్ప్రైజ్ ఉంది. ఇది అందరికీ కనెక్ట్

MISSTERIOUS Movie Review and Rating
మిస్ టీరియస్ సినిమా రివ్యూ
చిత్రం – మిస్ టీరియస్
తారాగణం – రోహిత్ సాహ్ని, అబిద్ భూషణ్, రియా కపూర్, మేఘనా రాజ్ పుత్, బాల రజ్వాది సినిమాటోగ్రాఫర్, ఎడిటర్ – దేవేంద్రసూరీ పరవస్తు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – రామ్ ఉప్పు
సంగీతం – ఎమ్ ఎల్ రాజా
నిర్మాత – జయ్ వల్లందాస్
దర్శకుడు – కోమటిరెడ్డి మహిపాల్ రెడ్డి
రోహిత్, అబిద్ భూషణ్, రియా కపూర్, మేఘనా రాజ్ పుత్, బాల రజ్వాది, కీలక పాత్రల్లో తెరకెక్కిన సినిమా మిస్టీరియస్. అశ్లీ క్రియేషన్స్ పై జయ్ వల్లందాస్ నిర్మాణంలో మహి కోమటిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు డిసెంబర్ 19న థియేటర్స్ లో రిలీజయింది. ముందు రోజే ఈ సినిమాకు ప్రీమియర్స్ కూడా వేశారు. ఈ మధ్య కాలంలో పాజిటివ్ వైబ్ వచ్చిన చిన్న సినిమాల్లో మిస్టీరియస్ ఒకటి. సస్పెన్స్, థ్రిల్లర్ స్టోరీతో వస్తుందని ప్రమోషనల్ కంటెంట్‌తో తెలిసిపోయింది. ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
కొండపూర్ SI రాంఖీ / రామ్ కుమార్ (అబిద్ భూషణ్) అనుకోకుండా 15 రోజుల నుంచి మిస్ అవుతాడు. ఈ మిస్సింగ్ కేసును ఛేదించడానికి ACP ఆనంద్ సాయి (బలరాజ్ వాడి) రంగంలోకి దిగుతాడు. ఈ విచారణలో రాంకీ కనిపించకుండా వెళ్లే ముందు ఇల్లీగల్ గా ఒక గన్ కొన్నాడని తెలుస్తుంది. అలాగే రాంకీ చివరి కాల్ ఆర్కిటెక్చర్ విరాట్ (రోహిత్ సాహ్ని) భార్య శిల్ప (మేఘన రాజ్‌పుత్) కి ఉందని తెలిసి, రాంకీ చివరగా శిల్ప ఇంటికి వెళ్లినట్టు సిసిటివి ఫుటేజ్ ఉండటంతో ఆమెని విచారించాల్సి వస్తుంది. కానీ శిల్ప, అతని భర్త విరాట్ (రోహిత్) అదే సమయంలో గోవాలో యాక్సిడెంట్ కి గురవుతారు. దీంతో పోలీసులు షాక్ అయి మరోసారి శిల్ప ఇంటికి వెళ్తే అక్కడ ఎవరూ ఉండరు. రాంఖీ మిస్సింగ్ కేసుకు విరాట్ – శిల్ప లకు సంబంధం ఏంటి? విరాట్ కొన్న విల్లాకు రాంఖీ ఎందుకు వెళ్లాడు? ఈ కథలోకి మిస్సిరా (రియా కపూర్) ఎందుకు వచ్చింది? అసలు SI రాంఖీని ఎవరు చంపారు? శిల్ప గోవాలో ఉంటే పోలీసులతో మాట్లాడిన అమ్మాయి ఎవరు? లాంటి ట్విస్ట్‌లు, సస్పెన్స్‌తో సినిమా నడిపించారు. పోలీసులు ఈ కేసుని ఛేదించి రాంకీ ఏమయ్యాడో కనిపెట్టారా తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
నటీనటుల పనితీరు:
నటీనటుల విషయానికి వస్తే.. దాదాపు అందరూ బాగా చేశారు. మెయిన్ లీడ్‌లో రోహిత్, అబిద్ భూషణ్ మెప్పించారు. మేఘన రాజ్ పుత్, రియా కపూర్ అందాలు ఆరబోస్తూనే, ఎమోషనల్, రొమాంటిక్ సీన్స్ లో నటనతో మెప్పించారు. సీనియర్ పోలీస్‌గా కనిపించిన బలరాజ్ వాడి తన మార్క్ నటన చూపించాడు.లక్ష్మీ శ్రీదేవి పర్ఫెక్ట్ గా ఆ పాత్రల్లో సెట్ అయ్యారు. అలాగే జబర్దస్త్ ఫేం రాజమౌళికి మంచి పాత్ర వచ్చింది. బాగా నటించాడు కూడా. అలాగే మరో జబర్దస్త్ ఆర్టిస్ట్ గడ్డం నవీన్ చిన్న పాత్ర చేసినా.. తన పరిధిలో బానే చేశాడు. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.
సాంకేతిక నిపుణుల పనితీరు:
ఇక మ్యూజిక్ ML రాజా ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీకి సరైన మ్యూజిక్ ఇచ్చాడు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు అనిపిస్తుంది. సాంగ్స్ వినడానికి పర్వాలేదు అనిపించినా విజువల్ గా బాగా చూపించారు. సినిమాటోగ్రఫర్‌గా చేసిన పరవస్తు దేవేంద్ర సూరి చిత్రాన్ని మరింత క్వాలిటీగా చూపించి ఉండొచ్చు. ఈ తరహా చిత్రాలకు కెమెరా వర్క్ సగం బలం. కానీ ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ ఆశించిన స్థాయిలో లేదు అయితే ఇదే సూరి ఎడిటర్‌గా కూడా ఈ మూవీకి వర్క్ చేశాడు. ఈ ఎడిటింగ్ విషయంలో మరి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది. నిర్మాణ విలువలు సినిమాకు తగినట్టు బాగా కుదిరాయి. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ కథని ఇంకొన్ని ఎమోషన్స్ మిక్స్ చేసి బాగానే రాసుకున్నాడు దర్శకుడు. నిర్మాణ పరంగా చిన్న సినిమా అయినా బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.
విశ్లేషణ :
మిస్టీరియస్ ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ అని పోస్టర్స్, ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది. మొదట్నుంచి కూడా అసలు ఏం జరుగుతుంది అనే ఆసక్తి నెలకొల్పారు. ఫస్ట్ హాఫ్ రాంకీ మిస్సింగ్, అతని కోసం విచారణ, అందులోకి శిల్ప – విరాట్ లు రావడం, ఇంకా పలువురిని విచారించడంతో సాగుతుంది. ఇంటర్వెల్ ఎలాంటి బ్యాంగ్ లేకుండా సింపుల్ గా ఇచ్చేస్తారు. సినిమా చూస్తున్నంత సేపు… మనం రెగ్యులర్ లైఫ్‌లో వచ్చే కొన్ని ట్రైయాంగిల్ లవ్ స్టోరీలు మనకు గుర్తొస్తాయి. అలాంటి కథకే కొన్ని ట్విస్ట్‌లు ఆధ్యాంతం సస్పెస్స్, థ్రిల్లర్.. అలాగే హర్రర్ టచ్ ఇచ్చి, కొన్ని జాగ్రత్తలు తీసుకుని డైరెక్టర్ కథ రాసుకున్నారు.
సస్పెన్స్ థ్రిల్లర్ కాబట్టి డైరెక్టర్ పాత్రల పరిచయం విషయంలో ఎలాంటి ఆలస్యం చేయకుండా డైరెక్టర్ మెయిన్ ప్లాట్‌కి వెళ్లిపోయాడు. ఇటు కథను రన్ చేస్తూనే పాత్రలను పరిచయం చేస్తూ వెను వెంటనే ట్విస్ట్‌లు వచ్చేలా ప్లాన్ చేసుకున్నాడు. సినిమాను చూసే ఆడియన్‌కు అసలు కిల్లర్ ఎవరూ అనే ఆసక్తి క్లైమాక్స్ వరకు ఉండేలా చూసుకున్నారు. అయితే సినిమా అంతా ఎక్కువగా విచారణ, విచారణలో ఏం జరిగింది అంటూ ఫ్లాష్ బ్యాక్ చెప్పడంతోనే సాగుతుంది. దీంతో అక్కడక్కడా విచారణ ల్యాగ్ అయింది అనిపిస్తుంది.
ఇంటర్వెల్లో కూడా ఊహించని ట్విస్ట్ ఇచ్చి కథను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకుళ్లే ప్రయత్నం చేశాడు. ఇప్పటికే సినిమాలో వచ్చే ట్విస్ట్‌లు సస్పెన్స్, థ్రిల్లర్‌ను ఫీల్ అయ్యే ఆడియన్స్‌కు సెకండాఫ్‌లో ఉండే హర్రర్ ఎలిమెంట్స్ ఇంకాస్త ఇంటెన్స్ క్రియేట్ అయ్యాలా చేసింది. అసలు కథ అంతా సెకండ్ హాఫ్ లోనే నడుస్తుంది. ఒక్కొక్కటి ట్విస్ట్ రివీల్ అవుతూ ఆసక్తిగా కథనాన్ని నడిపించారు. కథ సీరియస్ గా సాగుతుంటే మధ్యలో రెండు పాటలు, ఫ్లాష్ బ్యాక్ కొంచెం ల్యాగ్ అనిపిస్తాయి. ఇక క్లైమాక్స్‌లో వచ్చే ఓ బిగ్ ట్విస్ట్ సినిమాను మలుపు తిప్పుతుంది. అప్పటి వరకు కిల్లర్ వీరే అని అనుకునే ఆడియన్స్ కూడా షాక్ అవుతారు. ఈ సినిమాని ఇంకాస్త జనాల్లోకి తీసుకెళ్లి, ఎడిటింగ్ లో కొంత ల్యాగ్ కట్ చేస్తే సినిమా బాగానే వర్కౌట్ అవుతుంది. సస్పెన్స్ థ్రిల్లర్ తో పాటు సెకండ్ హాఫ్ లో ఊహించని కథాంశంతో బాగా తెరకెక్కించారు.
బాటమ్ లైన్ – మిస్ చేయకుండా ఓసారి చూడాల్సిన మూవీ మిస్ టీరియస్
రేటింగ్ – 3/5
