K-Ramp 3rd Single Tikkal Tikkal.. Released -Grand Theatrical Release on

Band Melam starring Harsh Roshan and Sridevi Apalla First Beat (Tittle Glimpse) Unveiled
The young and talented Harsh Roshan won everyone’s appreciation for Court. The gorgeous Sridevi Apalla also impressed audiences. Now, this stunning Court duo is all set to enchant once again with a beautiful love story. Blockbuster writer Kona Venkat brings this much-awaited combo together.
The film is bankrolled under the Kona Film Corporation banner, with Kavya and Shrvaya producing. Sivaraju Pranav co-producing the film. Mango Mass Media is presenting the film. Satish Javvaji is helming this soulful tale that celebrates music, love, and emotions. Today, the makers officially announced the exciting project with a title glimpse. The film is titled Band Melam, with the tagline “Every Beat Has an Emotion.” The title glimpse is aptly named First Beat.
The glimpse begins with a beautiful song rooted in Telangana flavour, composed by Vijai Bulganin. First Beat introduces Harsh Roshan searching for Rajamma, played by Sridevi Apalla. The fun and engaging conversation between them, spoken in the Telangana dialect, instantly connects with the audience. The glimpse ends on a high note with a magical tune that lingers in the heart.
Oscar-winning lyricist Chandrabose is penning the lyrics. Siva Mupparaju is handling the editing and also wrote the screenplay. Satish Mutyala is in charge of cinematography. Versatile actor Saikumar plays a key role in the film.
With a brilliant technical crew and a top-notch team, the film promises a rooted love story filled with music, emotions, and cultural richness.
Cast: Roshan, Sridevi, Sai Kumar & Others.
Technical Crew:
A Kona Venkat Production
Banner: Kona Film Corporation
Presented by Mango Mass Media
Producers: Kavya & Shravya
Co-Producer: Sivaraju Pranav
Writer & Director: Sathish Javvaji
Music: Vijai Bulganin
Screenplay and Editing: Siva Mupparaju
DOP: Satish Mutyala
Lyricist: Chadrabose
Art Director: Narni Srinivas
Marketing: Whacked Out Media
PRO: Vamsi Kaka
కోన ఫిల్మ్ కార్పొరేషన్ నిర్మాణంలో హర్ష్ రోషన్, శ్రీదేవి అపల్లా జంటగా నటించిన ‘బ్యాండ్ మేళం’ ఫస్ట్ బీట్ (టైటిల్ గ్లింప్స్) రిలీజ్
‘కోర్ట్’ చిత్రంలో హర్ష్ రోషన్, శ్రీదేవీ అపల్లా అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. మరోసారి ఈ ఇద్దరూ ఓ అందమైన ప్రేమ కథతో ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నారు. ఈ క్యూట్ కాంబోని బ్లాక్ బస్టర్ రచయిత కోన వెంకట్ తెరపైకి తీసుకు వస్తున్నారు. ఈ చిత్రాన్ని కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై కావ్య, శ్రావ్య నిర్మిస్తున్నారు. శివరాజు ప్రణవ్ ఈ చిత్రాన్ని సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మ్యాంగో మాస్ మీడియా ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది.
సంగీతం, ప్రేమ, భావోద్వేగాలు, మనోహరమైన కథతో ఈ మూవీని సతీష్ జవ్వాజీ తెరకెక్కిస్తున్నారు. ఈరోజు మేకర్స్ అధికారికంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను టైటిల్ గ్లింప్స్‌తో ప్రకటించారు. ఈ చిత్రానికి ‘బ్యాండ్ మేళం’ అని టైటిల్‌ను పెట్టారు. “ఎవ్రీ బీట్ హ్యాజ్ యాన్ ఎమోషన్” అనేది ఉప శీర్షిక. టైటిల్ గ్లింప్స్‌ను ఫస్ట్ బీట్ అంటూ రిలీజ్ చేశారు.
తెలంగాణ యాసలో విజయ్ బుల్గానిన్ స్వరపరిచిన అందమైన ఓ జానపద గీతంతో గ్లింప్స్ ప్రారంభమైంది. ఈ ఫస్ట్ బీట్‌లో యాదగిరి (హర్ష్ రోషన్) తన ప్రేయసి రాజమ్మ (శ్రీదేవి అపల్ల) కోసం ఇంట్లోకి వచ్చి వెతుకుతుంటాడు. తెలంగాణ యాసలో హీరో హీరోయిన్ల మధ్య జరిగే సంభాషణ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఇక చివర్లో అయితే హార్ట్ టచింగ్ ఎమోషన్, మ్యూజిక్‌తో టైటిల్ గ్లింప్స్ అందరినీ కదిలించేలా ఉంది. ఈ టైటిల్ గ్లింప్స్ చూసిన తరువాత ఓ అందమైన గ్రామీణ ప్రేమ కథను తెరపై చూడబోతోన్నామనే ఫీలింగ్ మాత్రం అందరిలోనూ కలిగింది.
ఆస్కార్ అవార్డు గ్రహీత అయిన గీత రచయిత చంద్రబోస్ ఈ చిత్రానికి సాహిత్యం అందిస్తున్నారు. శివ ముప్పరాజు ఎడిటింగ్, స్క్రీన్ ప్లే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వెర్సటైల్ యాక్టర్ సాయికుమార్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
అద్భుతమైన సాంకేతిక బృందం, భారీ తారాగణంతో, మ్యూజికల్, ఎమోషనల్ జర్నీగా అందమైన ప్రేమ కథను త్వరలోనే ఆడియెన్స్ ముందుకు తీసుకు రాబోతోన్నారు.
తారాగణం: రోషన్, శ్రీదేవి, సాయి కుమార్ తదితరులు
సాంకేతిక బృందం:
ఏ కోన వెంకట్ ప్రొడక్షన్
బ్యానర్: కోన ఫిల్మ్ కార్పొరేషన్
సమర్పణ : మ్యాంగో మాస్ మీడియా
నిర్మాతలు : కావ్య, శ్రావ్య
సహ నిర్మాత : శివరాజు ప్రణవ్
రచయిత, దర్శకుడు : సతీష్ జవ్వాజీ
సంగీతం : విజయ్ బుల్గానిన్
స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ : శివ ముప్పరాజు
డిఓపి : సతీష్ ముత్యాల
గీత రచయిత : చంద్రబోస్
ఆర్ట్ డైరెక్టర్ : శ్రీనివాస్ నార్ని
మార్కెటింగ్ : వాక్డ్ అవుట్ మీడియా
పీఆర్వో : వంశీ కాకా