
Sumathi Satakam Movie Review
సుమతీ శతకం మూవీ రివ్యూ
నటీనటులు:
అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి, టేస్టీ తేజ, మహేష్ విట్ట, JDV ప్రసాద్ తదితరులు
సాంకేతిక వర్గం:
బ్యానర్: విజన్ మూవీ మేకర్స్
నిర్మాత: సాయి సుధాకర్ కొమ్మాలపాటి
రచన, దర్శకత్వం: ఎంఎం నాయుడు
సినిమాటోగ్రాఫర్: ఎస్ హలేష్
సంగీతం: సుభాష్ ఆనంద్
ఎడిటర్: నహిద్ మహమ్మద్
పిఆర్ఓ: మధు విఆర్
డిజిటల్ మార్కెటింగ్: హౌస్ ఫుల్ మీడియా, డిజిటల్ దుకాణం
విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘సుమతీ శతకం’. సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎం.ఎం. నాయుడు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై ఇప్పటికే ఇండస్ట్రీలో మంచి అంచనాలు ఉన్నాయి. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందో చూద్దాం.
కథ:
కిరణా కొట్టు నడిపే కృష్ణ (అమర్దీప్) చాలా పిసినారి. ప్రతిది పొదుపుగా వాడుతుంటాడు. అయితే తనను మనస్పూర్తిగా ప్రేమించే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటాడు. ఈ క్రమంలో అతనికి పక్క ఊరిలోని అంగన్ వాడీ టీచర్ సుమతి (శైలి చౌదరి)తో జరిగిన పరిచయం ప్రేమగా మారుతుంది. ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. తీరా వీళ్ళిద్దరూ పెళ్ళి చేసుకోవాలనుకున్న సమయంలో సుమతికి అమ్మవారు ఆవహిస్తుందన్న విషయం తెలుస్తుంది. మరి ఆమెను పెళ్ళి చేసుకోవాలనుకున్న కృష్ణ పరిస్థితి ఏమైంది? గుడికి రంగులు వేసే సమయంలో ఊరిలో మొదలైన గొడవ ఎక్కడికి దారితీసింది? సుమతికి అమ్మవారు ఆవహించడానికి కారణం ఏమిటీ అనేది మిగతా కథ
ప్లస్ పాయింట్స్:
అమర్దీప్ ఈ సినిమాకు వన్ మ్యాన్ ఆర్మీ లా అన్ని హావా భావాలు పలికించాడు. నటనలోనూ, డ్యాన్సుల్లోనూ అతను తన వంద శాతం శ్రమను పెట్టాడు.
హీరోయిన్ శైలి చౌదరికి మంచి ప్రాధాన్యం ఉన్న పాత్ర దక్కింది. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో ఆమె నటన ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుంది. అమర్‌దీప్‌తో ఆమె కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది. ఇంకా ఇందులో మిగతా సహాయ నటులు తమ పాత్రల పరిధిలో బాగానే చేశారు. ఇతర క్యారెక్టర్ ఆర్టిస్టులు తమ అతిథి పాత్రల్లో సరైన న్యాయం చేశారు.
మైనస్ పాయింట్స్:
కథనంలో కొన్ని సన్నివేశాలు లాగినట్టు అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్‌లోని కొన్ని ఎపిసోడ్స్ బోరింగ్‌గా ఉండి, సులభంగా ట్రిమ్ చేయవచ్చని అనిపిస్తుంది.
కీలక పాత్రల్లో గుర్తింపు ఉన్న నటులు లేకపోవడం సినిమాకు మైనస్‌గా మారింది. అలాగే మహేష్ విట్టు, టేస్టీ తేజ వంటి కమెడియన్ల నుంచి ఆశించిన స్థాయిలో కామెడీ పండకపోవడం కూడా లోపంగా చెప్పుకోవచ్చు.
సాంకేతిక అంశాలు:
సినిమాటోగ్రఫీ బాగుంది. లొకేషన్లను అందంగా చూపించారు. ఎడిటింగ్ ఓకే అనిపించినా, ఇంకాస్త మెరుగ్గా ఉండాల్సింది. సంగీతం సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచింది. పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగా కుదిరాయి. పరిమిత బడ్జెట్లో తెరకెక్కించినప్పటికీ నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు:
మొత్తంగా చూస్తే సుమతి శతకం ఒక గ్రామీణ నేపథ్య డ్రామా. పెళ్ళికోసం తాపత్రయ పడే ఓ యువకుడికి అనుకోని అవాంతరాలు ఎదురయితే ఎలా వాటిని పరిష్కరించుకుని ముందుకు సాగాడనేది ఆసక్తికరమైన అంశాలు.
ప్రధాన నటుల నటన బాగుండటంతో ఈ వారాంతంలో ఒకసారి చూడదగిన సినిమాగా నిలుస్తుంది.
Rating – 3.25/5
