నింద రివ్యూ.. వరుణ్ సందేశ్‌కు బ్రేక్ పడ్డట్టేనా.| Nindha Review
Nindha Review | కొత్త బంగారు లోకం, హ్యాపీ డేస్ సినిమాలతో లవర్‌బాయ్‌గా కనిపించి యూత్‌తోపాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గరయ్యాడు వరుణ్ సందేశ్ (Varun Sandesh). వరుణ్‌తేజ్ తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నంలో లీడ్ రోల్లో నటించిన తాజా సినిమా నింద (Nindha).
Nindha Review | కొత్త బంగారు లోకం, హ్యాపీ డేస్ సినిమాలతో లవర్‌బాయ్‌గా కనిపించి యూత్‌తోపాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గరయ్యాడు వరుణ్ సందేశ్ (Varun Sandesh). ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచాయి. అయితే ఆ తర్వాత చేసిన ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. 2023లో సందీప్ కిషన్ నటించిన మైఖేల్‌లో కీలక పాత్రలో నటించిన వరుణ్‌తేజ్.. తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నంలో లీడ్ రోల్లో నటించిన సినిమా నింద (Nindha).
క్రైం థ్రిల్లర్ జోనర్లో రాజేశ్ జగన్నాథం రైటర్ కమ్ ప్రొడ్యూసర్‌గా.. దర్శకత్వం వహించిన ఈ చిత్రం కాండ్రకోట మిస్టరీ క్యాప్షన్‌తో వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కించిన ఈ చిత్రం థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. ఇంతకీ వరుణ్ సందేశ్ కొత్త ప్రయత్నం సక్సెస్ అయ్యిందా.. అనే దానిపై ఓ లుక్కేస్తే..
నటీనటులు :
వరుణ్ సందేశ్, తనికెళ్ల భరణి, భద్రమ్, చత్రపతి శేఖర్, సిద్ధార్థ్ గొల్లపూడి, శ్రేయా రాణిరెడ్డి, అన్నీ, క్యూ. మధు, సూర్య, అరుణ్ దలై, మైమ్ మధు
దర్శకుడు, రచయిత, నిర్మాత: రాజేష్ జగన్నాధం
సినిమాటోగ్రఫీ : రమీజ్ నవీత్
ఎడిటింగ్ : అనిల్ కుమార్
మ్యూజిక్ : సంతు ఓంకార్
బ్యానర్ : ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్
రేటింగ్ : 2.25/5
కథలోకి వెళ్తే..
కాండ్రకోట అనే గ్రామంలో ముంజు అనే యువతిని అత్యాచారం చేసిన చంపేశాడన్న ఆరోపణల్లో పోలీసులు బాలరాజు (ఛత్రపతి శేఖర్)ను అరెస్ట్ చేస్తారు. ఈ కేసులో బాలరాజుకు న్యాయమూర్తి సత్యానంద్ (తనికెళ్ల భరణి) ఉరి శిక్ష విధిస్తూ తీర్పునిస్తారు. అయితే హత్యాచారం కేసులో తాను సరైన తీర్పు ఇవ్వలేకపోయానన్న బాధతో కన్నుమూస్తారు సత్యానంద్. తండ్రి సత్యానంద్ మరణంతో ఆలోచన పడ్డ వివేక్ (వరుణ్ సందేశ్).. ఇంతకీ అసలు నిందితుడెవరో తెలుసుకోవాలనుకుంటాడు. ఈ క్రమంలో ఆరుగురు వ్యక్తులను కిడ్నాప్ చేసే నేపథ్యంలో వాస్తవాలు బయట పడతాయి. ఇంతకీ ఈ కేసులో వివేక్ ఏం తెలుసుకున్నాడు.. మరి వివేక్ హత్యాచార కేసులో నింద పడ్డ బాలరాజుకు ఉరిశిక్ష పడకుండా అడ్డుకున్నాడా..? అనేదే కథ.
విశ్లేషణ:
చేయని నేరానికి జైలుకెళ్లడం, చాలా కాలం శిక్షననుభవించిన తర్వాత కోర్టు నిర్దోషి అని తీర్పు ఇవ్వడంతో బయటకు రావడం లాంటి ఘటనలు అప్పడప్పుడు తెరపైకి వస్తుంటాయని తెలిసిందే. ఇలాంటి కాన్సెప్ట్‌తో వచ్చిందే నింద.
హత్యాచార కేసులో అసలు నిందితుడెవరో తెలుసుకునే క్రమంలో ఓ మాస్క్ వేసుకున్న వ్యక్తి ఆరుగురిని కిడ్నాప్ చేస్తారు. వీరిలో ఎస్సైతోపాటు డాక్టర్, లాయర్, పనిమనిషి, కానిస్టేబుల్‌తోపాటు అవారాగా తిరిగే వ్యక్తి ఉంటారు. కిడ్నాపైన ఆరుగురు వ్యక్తుల నుంచి హత్యకేసుకు సంబంధించిన నిజాన్ని రాబట్టే క్రమంలో మాస్క్ వేసుకున్న వ్యక్తి వారిని భయపెట్టే సన్నివేశాల్లో ఆసక్తి తగ్గడంతో.. బోరింగ్ ఫీలింగ్ కలుగుతుంది.
టెక్నికల్‌గా..
మొదటి సినిమా అయినప్పటికీ డైరెక్టర్ రాజేశ్ జగన్నాథం కథానుగుణంగా నటీనటుల నుంచి పెర్మానెన్స్ రాబట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. కొత్త డైరెక్టర్ అనే భావన రాకుండా కథను నిదానంగా మొదలుపెట్టి.. చిన్న చిన్న ట్విస్టులతో ఆసక్తిరేకెత్తించేందుకు ప్రయత్నించాడు. సంతు ఓంకార్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, రమీజ్ కెమెరా పనితనం బాగుంది. సాంకేతికంగా సినిమా హై స్టాండర్ట్స్‌లో కనిపిస్తుంది.
ఇక వరుణ్ తేజ్ ఎన్హెచ్ఆర్సీ ఆఫీసర్ పాత్రలో జీవించేశాడనే చెప్పాలి. లవర్ బాయ్‌గా మాత్రమే కాదు మంచి కథ పడితే నటుడిగా తనలోని మరో యాంగిల్‌ను కూడా చూపించేందుకు ఎప్పుడూ రెడీ అని ఈ సినిమాతో చెప్పకనే చెబుతున్నాడు వరుణ్ సందేశ్. సీరియల్ నటి శ్రీయా రాణిరెడ్డి నటనపరంగా మెప్పించింది.
అయితే స్లో నరేషన్ వల్ల నెక్ట్స్ ఏం జరుగుతుందనే సస్పెన్స్‌ను కంటిన్యూ చేయకపోవడంతో ప్రేక్షకులకు థ్రిల్ మిస్సయిన భావన కలుగుతుంది. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారు, భారీ అంచనాలతో కాకుండా సరదా కోసం వెళ్లాలనుకునేవాళ్లు థియేటర్లకు వెళ్లి సినిమా చూసేయొచ్చు.