ప్రేక్షకుల మనసులని గెలిచి సక్సెస్ ఫుల్ గా 25 రోజులు పూర్తి చేసుకున్న
You all will enjoy “Fear” for sure – Vedhika
Vedhika stars in the lead role of the movie Fear, produced by AR Abhi under the Dattatreya Media banner, with co-producer Sujatha Reddy. Directed by Dr. Haritha Gogineni, this suspense thriller features Arvind Krishna in a special role. Remarkably, Fear has already won over 60 awards at various prestigious international film festivals before its release. The film is gearing up for a grand theatrical release soon.
Today, the Telugu teaser for Fear was released by star hero Rana Daggubati, with the Tamil teaser unveiled by Vijay Sethupathi, the Kannada teaser by Kichcha Sudeep, the Malayalam teaser by Dileep, and the Hindi teaser by Emraan Hashmi, all through social media. Following this, the Fear teaser release event took place at Prasad Labs in Hyderabad.
During the event, actress Inaya Sultana commented, “The teaser for Fear is genuinely scary, and I loved it. This movie has already garnered awards at many international film festivals, and I believe even more will come after its release. Having seen the film, I can confidently say that Director Haritha has crafted it with great talent.”
Actor Meka Ramakrishna stated, “Director Haritha offered me a significant role in Fear. I’m also set to act in a film directed by Abhi next. We hope to create more films and provide opportunities for talented individuals. We request our media friends to help bring a remarkable movie like Fear to the audience.”
Actress Sahithi remarked, “Haritha has brilliantly directed this psychological thriller. If the teaser gave you chills, just wait for the trailer—it will be even scarier. I’m sure you will enjoy the film.”
Actor Anish Kuruvilla expressed, “Today is a special day for our director Haritha. I understand the emotions a new director feels when presenting their first film to the audience. You will soon witness Haritha’s talent as a director through Fear. She has developed a unique script for this project, and I wish the film great success.”
Music director Anup Rubens shared his thoughts: “I wish all the best to Haritha, a first-time director, and to Abhi, a first-time producer. Haritha is dedicated and ensures she achieves the desired output. Vedhika is a fantastic actress, and I was truly impressed by her performance while scoring the background music for this film. Arvind Krishna has also played a significant role. I hope this film brings recognition to our entire team.”
Praising producer AR, he said, “I enjoy commercial films, but Haritha’s suspense thriller captivated me. I believed that someone who can scare me at home will undoubtedly frighten the audience with Fear. There are four key elements to remember while watching this movie: Vedika’s performance, Haritha’s script, Anup’s music, and I Andrew’s visuals—all of which are highly impressive. Haritha made a great decision as a director in selecting this venue. She is not only beautiful but also delivers an amazing performance. Arvind Krishna has contributed significantly as well. The entire team has been very supportive, and I hope you will support Fear just as you did our first film, Lucky Lakshman.”
Director Dr. Haritha Gogineni said: “I have established five checkpoints for the heroine in the movie Fear, and Vedhika is more than capable of fulfilling them. I believe everyone will enjoy her stage performance. However, I must acknowledge that Anup Rubens dominates both as a music director and on stage as an actress. Our film has received awards at many prestigious international film festivals. When I shared this with my brother, he asked how many of those awards were purchased. It’s unfortunate that some people think this way, but these are genuine international film festivals, and such doubts are unfounded. I felt immense pride seeing India’s name on that list, more than all the awards our film has won.”
She added, “The story of Fear revolves around what happens when a girl faces unexpected situations that scare her in life. I want you to enjoy this movie in theaters, which is why I won’t reveal too much. We plan to release the film theatrically next month. It will be suitable for both theaters and OTT platforms, but to truly experience the suspense of the screenplay—visually and musically—you must watch it in theaters. We hope you all will support our film.”
Hero Arvind Krishna stated: “The movie Fear provided me with a fantastic experience. I received the Best Supporting Actor Award at the Rome Film Festival for my performance in this film, and I’m thrilled to share the screen with Vedika. Her dedication is inspiring and shows how hard one must work for a role. Our director Haritha is incredibly committed to this project. I’d like to thank producer Abhi and the entire cast and crew, who all worked together as a team, regardless of their roles. More details about Fear will be revealed in upcoming events.”
Heroine Vedhika said: “I need to connect with the team before agreeing to any film, and I really like the Fear team. I frequently travel for films in other languages, and I just came here from Chennai. After watching the teaser of Fear, all my stress disappeared. We are all very happy, and the entire team has put in tremendous effort for this film. Haritha has executed the project with such meticulous planning that everyone will appreciate it. I witnessed her passion for filmmaking; you would never guess this is her first movie. My role in this film has given me great satisfaction.”
She added, “The teaser was released in Telugu by Rana, in Tamil by Vijay Sethupathi, in Hindi by Emraan Hashmi, in Kannada by Kiccha Sudeep, and in Malayalam by Dileep. I thank them all. A suspense thriller like this requires a strong background score, and Anup delivered it effectively. Arvind Krishna’s dedication and passion have truly impressed me. Our film Fear has won 64 awards at international film festivals. We applied for various categories, and even in non-applied categories, there are films that have been well-received and awarded. I hope you all enjoy Fear.”
Cast:
Vedhika, Arvind Krishna, JP (Jayaprakash), Pavitra Lokesh, Anish Kuruvilla, Sayaji Shinde, Satya Krishna, Sahithi Dasari, Shani, and others.
Technical Team:
- Music: Anup Rubens
- Cinematography: I Andrew
- Lyrics: Krishna Kanth
- Choreography: Vishal
- PRO: GSK Media (Suresh – Sreenivas)
- Digital Media: House Full, Mayabazar
- Producer: AR Abhi
- Co-Producer: Sujatha Reddy
- Writing, Editing and Directing: Dr. Haritha Gogineni
ఘనంగా వేదిక సస్పెన్స్, థ్రిల్లర్ మూవీ “ఫియర్” టీజర్ రిలీజ్ ఈవెంట్
హీరోయిన్ వేదిక లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా “ఫియర్”. ఈ సినిమాను దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్ ఏఆర్ అభి నిర్మిస్తున్నారు. సుజాత రెడ్డి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ కథతో దర్శకురాలు డా. హరిత గోగినేని ఫియర్ మూవీని రూపొందిస్తున్నారు. అరవింద్ కృష్ణ ఓ స్పెషల్ రోల్ లో కనిపించనున్నారు. “ఫియర్” సినిమా విడుదలకు ముందే వివిధ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్స్ లో 60 కి పైగా అవార్డ్స్ లను గెల్చుకుని కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. “ఫియర్” సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ రోజు “ఫియర్” సినిమా తెలుగు టీజర్ ను స్టార్ హీరో రానా, తమిళ టీజర్ ను విజయ్ సేతుపతి, కన్నడ టీజర్ ను కిచ్చా సుదీప్, మలయాళ టీజర్ ను దిలీప్, హిందీ టీజర్ ను ఇమ్రాన్ హశ్మీ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. అనంతరం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో “ఫియర్” టీజర్ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
నటి ఇనయా సుల్తానా మాట్లాడుతూ – “ఫియర్” సినిమా టీజర్ చూస్తుంటూనే భయంగా ఉంది. నాకు చాలా నచ్చింది. ఈ సినిమాకు రిలీజ్ ముందే ఎన్నో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ లో అవార్డ్స్ వచ్చాయి. రిలీజ్ అయ్యాక మరిన్ని అవార్డ్స్ వస్తాయి. సినిమా చూశాను కాబట్టి ఈ మాట చెప్పగలుగుతున్నాను. డైరెక్టర్ హరిత గారు ఎంతో ప్రతిభావంతంగా “ఫియర్” సినిమాను తెరకెక్కించారు. అన్నారు.
నటుడు మేక రామకృష్ణ మాట్లాడుతూ – “ఫియర్” సినిమాలో ఒక మంచి రోల్ చేసే అవకాశం డైరెక్టర్ హరిత గారు ఇచ్చారు. నెక్ట్ అభి గారి డైరెక్షన్ చేసే మూవీలో కూడా నటిస్తున్నాను. వీళ్లు మరిన్ని సినిమాలు చేయాలని వాటిలో మాకు అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నా. “ఫియర్” లాంటి మంచి సినిమాను మన మీడియా మిత్రులే ప్రేక్షకుల దగ్గరకు చేర్చాలని రిక్వెస్ట్ చేస్తున్నా. అన్నారు.
నటి సాహితీ మాట్లాడుతూ – సైకలాజికల్ థ్రిల్లర్ మూవీని హరిత గారు అద్భుతంగా తెరకెక్కించారు. టీజర్ మిమ్మల్ని కొంచెం భయపెట్టిందేమో ట్రైలర్ మరింత ఫియర్ ఫుల్ గా ఉంటుంది. మీకు మూవీ తప్పకుండా నచ్చుతుంది. అన్నారు.
నటుడు అనీష్ కురువిల్లా మాట్లాడుతూ – ఇవాళ మా డైరెక్టర్ హరిత గారికి స్పెషల్ డే. ఒక కొత్త డైరెక్టర్ తన మొదటి సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్తున్నప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. డైరెక్టర్ గా హరిత గారిలోని టాలెంట్ ను మీరు త్వరలో “ఫియర్” మూవీ ద్వారా స్క్రీన్ మీద చూస్తారు. ఆమె ఈ సినిమా కోసం ఒక డిఫరెంట్ స్క్రిప్ట్ తయారుచేశారు. “ఫియర్” సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ – ఫస్ట్ టైమ్ డైరెక్టర్ గా మూవీ చేసిన హరిత గారికి, ఫస్ట్ టైమ్ ప్రొడ్యూసర్ గా వర్క్ చేస్తున్న అభి గారికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. హరిత గారు తను అనుకున్న ఔట్ పుట్ వచ్చేవరకు ఎవరినీ వదలరు. వర్క్ విషయంలో ఆమె అంత స్ట్రిక్ట్ గా ఉంటారు. వేదిక గారు వండర్ ఫుల్ యాక్ట్రెస్. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు వేదిక గారి పర్ ఫార్మెన్స్ చూసి ఇంప్రెస్ అయ్యాను. అరవింద్ కృష్ణ మంచి రోల్ ప్లే చేశాడు. ఈ సినిమా మా టీమ్ అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా. అన్నారు.
నిర్మాత ఏఆర్ అభిమాట్లాడుతూ – నాకు కమర్షియల్ సినిమాలు అంటే ఇష్టం. కానీ మా ఆవిడ హరిత సస్పెన్స్ థ్రిల్లర్ కథ చెప్పింది. కథ నాకు బాగా నచ్చింది. ఇంట్లో నన్ను భయపెట్టే ఆవిడ “ఫియర్” సినిమాతో ప్రేక్షకుల్ని కూడా ఈజీగా భయపెడుతుందని నమ్మాను. ఈ సినిమా చూస్తున్నప్పుడు మీకు ముఖ్యంగా నాలుగు విషయాలు గుర్తుంటాయి. ఒకటి వేదిక గారి పర్ ఫార్మెన్స్, రెండు హరిత చేసిన స్క్రిప్ట్, మూడు అనూప్ గారు చేసిన మ్యూజిక్, ఆండ్రూ గారు ఇచ్చిన విజువల్స్ …ఈ నాలుగు బాగా ఇంప్రెస్ చేస్తాయి. వేదిక గారిని సెలెక్ట్ చేసుకున్నప్పుడే దర్శకురాలిగా హరిత మంచి డెసిషన్ తీసుకుందని అనిపించింది. ఎందుకంటే ఆవిడ బ్యూటిఫుల్ గా ఉండటమే కాదు అద్భుతంగా పర్ ఫార్మ్ చేస్తారు. అరవింద్ కృష్ణ మంచి రోల్ చేశాడు. టీమ్ అంతా మాకు బాగా సపోర్ట్ చేసింది. మా మొదటి సినిమా లక్కీ లక్ష్మణ్ అప్పుడు మీరంతా ఎలా సపోర్ట్ చేశారో ఈ “ఫియర్” సినిమాకు కూడా అలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
డైరెక్టర్ డా.హరిత గోగినేని మాట్లాడుతూ – “ఫియర్” సినిమాలో హీరోయిన్ కోసం ఐదు చెక్ పాయింట్స్ పెట్టుకున్నాను. ఆ ఐదింటికి సరిపోయిన హీరోయిన్ వేదిక గారు. వేదిక పర్ ఫార్మెన్స్ మీ అందరికీ నచ్చుతుంది. అయితే అనూప్ గారి మ్యూజిక్ డైరెక్టర్ గా నన్ను, నటిగా వేదిక గారిని డామినేట్ చేస్తారని చెప్పగలను. మా సినిమాకు ఎన్నో ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ లో అవార్డ్స్ వచ్చాయి. నేను ఈ విషయం మా బ్రదర్ తో చెబితే ఇందులో ఎన్ని కొన్నారు అని అడిగారు. మా వాళ్లకే అలాంటి డౌట్స్ వచ్చినప్పుడు బయటకు వాళ్లకు రావడంలో ఆశ్చర్యం లేదు. అయితే ఇవన్నీ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్. వాటిలో అలా జరుగుతుందని నేను అనుకోను. ఈ అవార్డ్స్ అన్నీ మా సినిమాకు వచ్చాయనే కంటే ఆ లిస్టులో ఇండియా పేరు చూసినప్పుడు గర్వంగా అనిపించింది. తన జీవితంలో కొన్ని అనుకోని సందర్భాల్లో ఒక అమ్మాయి భయపడితే ఆ పర్యావసనాలు ఎలా ఉంటాయి అనేది ఫియర్ మూవీ కథ. ఈ సినిమాను మీరు థియేటర్ లోనే ఎంజాయ్ చేయాలి. అందుకే ఎక్కువగా రివీల్ చేయడం లేదు. నెక్ట్ మంత్ లో మా సినిమాను థియేట్రికల్ రిలీజ్ చేస్తాం. ఈ సినిమా థియేటర్ తో పాటు ఓటీటీకి కూడా బాగా సెట్ అవుతుంది. అయితే విజువల్ గా, మ్యూజికల్ గా, స్క్రీన్ ప్లేలోని ఆ సస్పెన్స్ ను ఎంజాయ్ చేయాలంటే థియేటర్ లోనే చూడాలి. మీరంతా మా సినిమాకు సపోర్ట్ అందిస్తారని కోరుకుంటున్నాం. అన్నారు.
హీరో అరవింద్ కృష్ణ మాట్లాడుతూ – “ఫియర్” సినిమా నాకు ఒక గొప్ప ఎక్సీపిరియన్స్ ఇచ్చింది. ఈ సినిమాలో నటనకు నాకు రోమ్ ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డ్ దక్కింది. ఈ చిత్రంలో వేదిక గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం హ్యాపీగా ఉంది. ఒక రోల్ కోసం ఎంతగా కష్టపడాలో వేదిక గారిని చూస్తే అర్థమైంది. అలా నాకు ఆమె ఇన్సిపిరేషన్ అయ్యారు. మా డైరెక్టర్ హరిత గారు మూవీ కోసం ఎంతైనా కష్టపడతారు. ప్రొడ్యూసర్ అభి గారికి, మిగతా కాస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్స్ చెబుతున్నా. వాళ్లంతా పెద్దా చిన్నా అని చూసుకోకుండా మూవీకి టీమ్ వర్క్ చేశారు. “ఫియర్” సినిమా గురించి మరిన్ని ఈవెంట్స్ లో డీటెయిల్ గా చెబుతా. అన్నారు.
హీరోయిన్ వేదిక మాట్లాడుతూ – నేను ఏ సినిమా చేయాలన్నా ముందు టీమ్ నాకు నచ్చాలి. “ఫియర్” టీమ్ నాకు బాగా నచ్చింది. మిగతా లాంగ్వేజెస్ మూవీస్ కోసం నేను రెగ్యులర్ గా ట్రావెల్ చేస్తున్నాను. అలా చెన్నై నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. “ఫియర్” టీజర్ చూశాక నా స్ట్రెస్ మొత్తం పోయింది. మనసంతా సంతోషంగా ఉంది. “ఫియర్” సినిమాకు టీమ్ మొత్తం ఆల్ రౌండ్ ఎఫర్ట్ పెట్టారు. హరిత గారు మంచి ప్లానింగ్ తో మూవీని అందరికీ నచ్చేలా రూపొందించారు. ఫిలిం మేకింగ్ పట్ల ఆమెలో ప్యాషన్ చూశాను. ఇది ఆమె ఫస్ట్ మూవీ అంటే ఎవరూ నమ్మరు. నేను ఈ సినిమాలో చేసిన రోల్ చాలా సంతృప్తిని ఇచ్చింది. మా మూవీ టీజర్ ను తెలుగులో రానా గారు, తమిళంలో విజయ్ సేతుపతి గారు, హిందీలో ఇమ్రాన్ హశ్మీ గారు, కన్నడలో కిచ్చా సుదీప్ గారు, మలయాళంలో దిలీప్ గారు రిలీజ్ చేశారు. వారందరికీ నా థ్యాంక్స్ చెబుతున్నా. ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ కు మంచి బీజీఎం కావాలి. అనూప్ గారు ఎఫెక్టివ్ గా బీజీఎం చేశారు. అరవింద్ కృష్ణ డెడికేషన్, ప్యాషన్ నన్ను ఆకట్టుకున్నాయి. మా “ఫియర్”మూవీకి 64 ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ అవార్డ్స్ వచ్చాయి. మేము ఫిలిం మాత్రమే అప్లై చేశాము, అప్లై చేయని కేటగిరీస్ లో కూడా ఆ ఫిలిం ఫెస్టివల్ వాళ్లకు నచ్చి అవార్డ్స్ ఇచ్చినవి కూడా ఉన్నాయి. మీ అందరికీ “ఫియర్” సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నాను. అన్నారు.
నటీనటులు – వేదిక, అరవింద్ కృష్ణ, జెపి ( జయప్రకాష్ ), పవిత్ర లొకేష్, అనీష్ కురువిల్ల, సాయాజి షిండే, సత్య కృష్ణ, సాహితి దాసరి, షాని తదితరులు
టెక్నికల్ టీమ్
మ్యూజిక్ – అనూప్ రూబెన్స్,
సినిమాటోగ్రఫీ – ఐ ఆండ్రూ
లిరిక్స్ – కృష్ణ కాంత్
కొరియోగ్రఫీ – విశాల్
పీఆర్ ఓ- జీఎస్ కే మీడియా(సురేష్ – శ్రీనివాస్)
డిజిటల్ మీడియా – హౌస్ ఫుల్, మాయాబజార్
నిర్మాత – ఏఆర్ అభి
కో ప్రొడ్యూసర్ – సుజాత రెడ్డి
రచన, ఎడిటింగ్, దర్శకత్వం – డా. హరిత గోగినేని