Vishwak Sen fun family entertainer Tittled ‘FUNKY’
Mass Ka Das Vishwak Sen, who has won over crowds consistently for his varied script choices and versatile performances, is joining hands with blockbuster director Anudeep K.V. for a full-on family entertainer FUNKY. Suryadevara Naga Vamsi and Sai Soujanya are bankrolling the project under Sithara Entertainments and Fortune Four Cinemas. Srikara Studios will present the film.
The film formally commenced with a pooja ceremony in Hyderabad today in the presence of the cast & crew. Director Nag Ashwin sounded the clap, Camera Switched on by director Kalyan Shankar. Producer S Naga Vamsi handed over the script to the team.
True to the spirit of the film, a lively poster of Funky was unveiled by the team on the auspicious day, where the colourful title design is accompanied by the words ‘family entertainer’, arousing the curiosity of audiences. The poster further suggests that the film is likely to have around fun, family and endless laughter.
The makers assure Funky will boast of all the ingredients one expects from an energetic collaboration between Vishwak Sen and Anudeep. Funky will feature an ideal blend of verbal humour that Anudeep specialises in, capitalising on Vishwak’s abilities as a performer, packing in fun and entertainment catered to audiences of all age groups.
Talented, promising technician Suresh Sarangam is on board as the cinematographer for the film which also comprises National Award-winning editor Navin Nooli. Bheems Ceciroleo, who wooed audiences with his catchy music score for Tillu Square and delivered many chartbusters for MAD, will compose the music for Funky. He’s also part of other high-profile projects like Mass Jathara starring Ravi Teja, Sreeleela and MAD Square, Sequel to the blockbuster MAD.
Funky is all set to go on floors post Sankranthi 2025. Stay tuned to this space for more updates.
Cast & Crew:
Film Name: Funky
Starring: Mass Ka Das Vishwak Sen
Written & Directed by
Anudeep K.V.
Produced by
Naga Vamsi S – Sai Soujanya
Music – Bheems Ceciroleo
Editor – Navin Nooli
Co-Producer – Venkat Upputuri
DOP – Suresh Sarangam
Co-Writer- Mohan Sato
Pro: Lakshmivenugopal
Production Houses: Sithara Entertainments & Fortune Four Cinemas
Presenter: Srikara Studios
మాస్ కా దాస్ విశ్వక్ సేన్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనుదీప్ కె.వి కలయికలో ‘ఫంకీ’ చిత్రాన్ని ప్రారంభించిన సితార ఎంటర్టైన్మెంట్స్
వైవిధ్యమైన కథలు, పాత్రలతో ప్రేక్షకుల మనసు గెలుచుకుంటున్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్, తన తదుపరి చిత్రం కోసం బ్లాక్ బస్టర్ దర్శకుడు అనుదీప్ కె.వి తో చేతులు కలిపారు. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘ఫంకీ’ అనే ఆసక్తికర టైటిల్ ను ఖరారు చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఈ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది.
ఈరోజు హైదరాబాద్‌లో నటీనటులు మరియు సాంకేతిక బృందం సమక్షంలో ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. దర్శకుడు నాగ్ అశ్విన్ క్లాప్ కొట్టగా, దర్శకుడు కళ్యాణ్ శంకర్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నిర్మాత ఎస్. నాగవంశీ స్క్రిప్ట్‌ను చిత్రబృందానికి అందజేశారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రత్యేక పోస్టర్ ఆకట్టుకుంటోంది. ప్రేమ గుర్తులతో, చూడగానే అందరి దృష్టిని ఆకర్షించేలా ఫంకీ టైటిల్ ను డిజైన్ చేసిన తీరు బాగుంది. ఆ టైటిల్ డిజైన్‌తో పాటు, పోస్టర్ మీద రాసి ఉన్న ‘ఫ్యామిలీ ఎంటర్టైనర్’ అనే పదాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఫంకీ సినిమా ప్రేమ, వినోదంతో కూడిన ఓ మంచి కుటుంబ కథా చిత్రమనే భావన పోస్టర్ చూస్తే కలుగుతోంది.
విశ్వక్ సేన్, అనుదీప్ కలయికపై ఉండే అంచనాలకు తగ్గట్టుగా, ఫంకీ చిత్రం పూర్తిస్థాయిలో ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుందని నిర్మాతలు హామీ ఇచ్చారు. వినోదాన్ని పంచడంలో దర్శకుడు అనుదీప్ ది విభిన్న శైలి. అలాంటి అనుదీప్ కి ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోగల ప్రతిభగల నటుడు విశ్వక్ సేన్ తోడయ్యారు. ఈ ఇద్దరు కలిసి చిన్న పెద్ద అనే లేకుండా అన్ని వయసుల ప్రేక్షకులు మనస్ఫూర్తిగా కడుపుబ్బా నవ్వుకునే చిత్రాన్ని అందించడానికి సిద్ధమవుతున్నారు.
ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు ఫంకీ చిత్రానికి పని చేస్తున్నారు. ప్రముఖ ఛాయగ్రాహకుడు సురేష్ సారంగం కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ‘టిల్లు స్క్వేర్’, ‘మ్యాడ్’ చిత్రాలతో తన సంగీతంతో ఆకట్టుకొని, ప్రస్తుతం ‘మాస్ జాతర’, ‘మ్యాడ్ స్క్వేర్’ వంటి అద్భుతమైన సినిమాలకు పని చేస్తున్న సంచలన సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.
2025 సంక్రాంతి తర్వాత ఫంకీ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడవుతాయి.
చిత్రం: ఫంకీ
తారాగణం: మాస్ కా దాస్ విశ్వక్ సేన్
రచన, దర్శకత్వం: అనుదీప్ కె.వి.
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
కూర్పు: నవీన్ నూలి
ఛాయాగ్రహణం: సురేష్ సారంగం
రచనా సహకారం: మోహన్
సహ నిర్మాత: వెంకట్ ఉప్పుటూరి
నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
పీఆర్ఓ: లక్ష్మి వేణుగోపాల్