ఎల్జీబీటీ పార్ట్-2కు తెలంగాణ ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం –

Unanimous Productions Production No 2 Movie Titled Alias Rukmini
After delivering the cult blockbuster COURT – State Vs A Nobody, Natural Star Nani’s Unanimous Productions has officially announced its second production venture. Starring Hero Nithiin in the lead, the film is produced by Deepthi Ganta and marks the second directorial outing of writer-director Murali Kanth Devasoth, whose debut film Dhandora earned critical acclaim. The project was unveiled today through an intriguing announcement video that introduces its world in a distinctive manner, while revealing the title: Alias Rukmini.
The announcement video opens with a black screen and an intriguing conversation between Nani and director Murali Kanth Devasoth. Curious about the much-talked-about script, Nani asks the director to narrate the story. The director says it is the story of Krishna, but what unfolds instead is a glimpse of several novels written by the mysterious author Rukmini. Interestingly, all of them are romantic titles, including Garam Gopal, Ameku Ame Ante Ishtam, and Vratham Venkanna. Puzzled, Nani interrupts, saying, “You told me it’s Krishna’s story. Then who is this Rukmini?” The video ends with the reveal of Nithiin as Krishna, a mathematics teacher, in an office setting. Adjusting his spectacles, he says: “My wife,” leaving audiences intrigued and eager to uncover the truth behind the enigmatic narrative.
Without giving away major plot points, the announcement video captivates with its unconventional storytelling, atmospheric visuals, intriguing premise, and pleasant background score, promising an emotional, engaging, and entertaining mystery that immediately sparks curiosity.
With his proven knack for identifying compelling stories, Nani’s association with the film significantly adds an extra layer of excitement and credibility.
After the critically acclaimed Dhandora, Murali Kanth Devasoth returns with yet another original and captivating story. The announcement video offers a glimpse of his unique storytelling style, hinting at a film that has all the ingredients to become another blockbuster for the director and the banner alike.
Alias Rukmini was formally launched today with a traditional pooja ceremony. Nani sounded the clapboard for the muhurtham shot, while Nithiin’s father, Sudhakar Reddy, switched on the camera. Ganta Rambabu (Nani’s father) and producer Venkat Boyanapally handed over the script to the team. COURT director Ram Jagadeesh and Sailesh Kolanu jointly directed the first shot.
While speaking at the event, Nani said: “Today marks the pooja ceremony for Unanimous Productions’ second venture, Alias Rukmini, and I am extremely excited. My dear friend Nithiin has supported me since the very beginning of my career, even before I found success. Many times we fell in love with Nithiin in films like Jayam, Ishq, and Gunde Jaari Gallanthayyinde. We are very confident we are giving one more reason to fall in love with Nithiin with Alias Rukmini. This is a beautiful love story. Love stories are always special, but when they come with a unique backdrop and an exceptional team of technicians, they become even more memorable. We are making a film that will stay with audiences for a long time. Today marks the beginning of that journey, and we will be starting the shoot very soon. My best wishes to the entire team. I am confident this is going to be a very special film. Thank you.”
Hero Nithiin said: “Today marks the muhurtham of our film, and we are excited to begin this journey. Presented by Nani and produced by Deepthi, under the direction of Murali Kanth, this is going to be a very special film in my career. I thank Nani for bringing such a wonderful script to me and for introducing me to such a talented director. I am confident this film will make all of us proud- Nani, Murali, Deepthi, the entire cast, and me. Wishing the whole team all the very best. See you all in cinemas very soon. Thank you.”
Director Murali Kanth Devasoth said: ” I am truly happy today. The excitement began the moment I narrated this script to Nani anna and he immediately said, ‘Let’s do it.’ Since then, everything has been falling into place beautifully. Having Nithiin anna on board is a dream come true, and I couldn’t have asked for anything more. At the same time, it brings greater responsibility, and we are fully committed to delivering our best. We will begin shooting very soon and bring the film to theatres as soon as possible. I hope this film entertains audiences and becomes a memorable one for everyone involved. We will do everything required to make it a special and successful film. Thank you.”
Producer Deepthi Ganta said: “I don’t have much to add because the story itself says everything. Sometimes, you hear a script and instantly get a gut feeling that it’s something special. That’s exactly what happened when Murali narrated this story. I was certain that Nani would also say yes to it. After listening to many stories following COURT, this was the first one that gave me that strong conviction. It is a brilliant script. We also have to thank Nani for helping us find our Krishna. While we were searching for the right actor, he suggested, ‘Why don’t we approach Nithiin anna?’ We recently shot the announcement video, and the moment I saw Nithiin in that look, I knew he was our Krishna. He fit the character perfectly. I can’t wait for all of you to watch the announcement and experience this journey with us.”
Music Director Vijai Bulganin said: *This marks my third collaboration under Nani sir’s presentation, and I am truly grateful for the opportunity. Working with Deepthi ma’am’s production has always been a wonderful experience, and I feel fortunate to be associated with this team once again. I am also delighted to be composing music for Nithiin’s film. Murali has written a beautiful script, and I will give my absolute best to create music that complements its emotions and enhances the overall experience. Thank you so much.”
The movie boasts a team of talented technicians. Jomon T. John ISC will handle the cinematography, while young sensation Vijai Bulganian provides the music. Avinash Kolla is the production designer, while Srujana Adusumilli is the editor.
Alias Rukmini is currently in the pre-production stage, with regular shooting scheduled to commence soon.
Cast: Nithiin
Technical Crew:
Presented by: Natural Star Nani
Production Banner: Unanimous Productions
Writer & Director: Murali Kanth Devasoth
Producer: Deepthi Ganta
Cinematography: Jomon T. John ISC
Music: Vijai Bulganin
Production Designer: Avinash Kolla
Editor: Srujana Adusumilli
Executive Producer: Prashanth Mandava
Costume Designer: Rekha Boggarrapu
Publicity Designer: Bharanidharan
Marketing: First Show
PRO: Vamsi-Shekar
నాని సమర్పణలో, నితిన్ హీరోగా, మురళీ కాంత్ దేవాసోత్ దర్శకత్వంలో దీప్తి గంటా నిర్మాణంలో యునానిమస్ ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ నెం 2 టైటిల్ అలియాస్ రుక్మిణి – అదిరిపోయే కాన్సెప్ట్ వీడియో రిలీజ్
నేచురల్ స్టార్ నాని సమర్పణలో తెరకెక్కిన ‘కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ ఘన విజయానంతరం ఆయన యూనానిమస్ ప్రొడక్షన్స్ రెండో చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్నారు. దీప్తి గంటా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘అలియాస్ రుక్మిణి’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేస్తూ విడుదల చేసిన అనౌన్స్మెంట్ వీడియో సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచింది.
అనౌన్స్మెంట్ వీడియోలో మొదట నాని, దర్శకుడు మురళీకాంత్ మధ్య ఆసక్తికరమైన సంభాషణ వినిపిస్తుంది. “కృష్ణ కథ చెబుతాను” అని దర్శకుడు చెప్పగానే, రుక్మిణి అనే రచయిత్రి రాసిన పలు రొమాంటిక్ నవలల కవర్లు కనిపిస్తాయి. వాటిని చూసి “నువ్వు కృష్ణ కథ అన్నావు… మరి ఈ రుక్మిణి ఎవరు?” అని నాని అడుగుతాడు. చివర్లో మ్యాథ్స్ టీచర్‌గా కనిపించిన నితిన్, “మై వైఫ్” అని చెప్పడంతో వీడియో ఆసక్తికరంగా ఎండ్ అవుతుంది. కథలోని అసలు మిస్టరీని బయటపెట్టకుండా, ఆసక్తిని మాత్రం రెట్టింపు చేసేలా ఈ వీడియోను రూపొందించారు. వినూత్న కథనం, ఆకట్టుకునే విజువల్స్, ఆసక్తికరమైన నేపథ్యం, హాయిగా సాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాపై మంచి అంచనాలు పెంచుతున్నాయి.
మంచి కథలను గుర్తించడంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాని ఈ ప్రాజెక్ట్‌తో అనుబంధం కావడం సినిమాపై మరింత నమ్మకాన్ని పెంచుతోంది. ‘దండోరా’ తర్వాత దర్శకుడు మురళీకాంత్ మరో ఒరిజినల్ కథతో వస్తుండగా, అనౌన్స్మెంట్ వీడియోలోనే ఆయన కథ చెప్పే శైలి ప్రత్యేకంగా కనిపించింది. దర్శకుడికీ, బ్యానర్‌కీ ఇది మరో విజయాన్ని అందించే సినిమా అవుతుందనే నమ్మకాన్ని కలిగించింది.
ఈ చిత్రాన్ని తాజాగా సాంప్రదాయ పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి నాని క్లాప్ కొట్టగా, నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నాని తండ్రి గంటా రాంబాబు, నిర్మాత వెంకట్ బోయనపల్లి స్క్రిప్ట్‌ను చిత్ర బృందానికి అందజేశారు. ‘కోర్ట్’ దర్శకుడు రామ్ జగదీష్, శైలేష్ కొలను కలిసి తొలి షాట్‌కు దర్శకత్వం వహించారు.
నాని మాట్లాడుతూ: యూనానిమస్ ప్రొడక్షన్స్ రెండో చిత్రం ‘అలియాస్ రుక్మిణి’ పూజా కార్యక్రమంతో ఈ రోజు ప్రారంభమవడం చాలా ఆనందంగా ఉంది. నా కెరీర్ ప్రారంభం నుంచే, నేను సక్సెస్ కాకముందే నితిన్ నాకు ఎంతో సపోర్ట్ చేశారు. ‘జయం’, ‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’ వంటి సినిమాల్లో నితిన్‌ను ప్రేక్షకులు ఎంతగా ప్రేమించారో మనందరికీ తెలుసు. ఇప్పుడు ‘అలియాస్ రుక్మిణి’తో మరోసారి ఆయనను ప్రేమించేలా చేసే సినిమా చేస్తున్నామనే నమ్మకం ఉంది. ఇది చాలా అందమైన ప్రేమకథ. మంచి కథ, అద్భుతమైన టెక్నీషియన్స్‌తో కలిసొస్తే అలాంటి ప్రేమకథలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. ప్రేక్షకులు చాలా కాలం గుర్తుంచుకునే సినిమా చేయబోతున్నాం. త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తాం. ఈ సినిమా చాలా ప్రత్యేకంగా నిలుస్తుందనే నమ్మకం ఉంది. టీమ్ అందరికీ నా బెస్ట్ విషెస్.”
హీరో నితిన్ మాట్లాడుతూ: ఈ రోజు మా సినిమా ముహూర్తం జరగడం చాలా ఆనందంగా ఉంది. నాని సమర్పణలో, దీప్తి నిర్మాణంలో, మురళీకాంత్ దర్శకత్వంలో ఈ సినిమా నా కెరీర్లో ఎంతో ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుంది. ఇంత మంచి కథను నాకు తీసుకొచ్చిన నానికి, ఇంత మంచి దర్శకుడిని పరిచయం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమా నాని, మురళీ, దీప్తి, మొత్తం టీమ్‌తో పాటు నన్ను కూడా గర్వపడేలా చేస్తుందని నమ్ముతున్నాను. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. త్వరలో థియేటర్లలో కలుద్దాం.”
దర్శకుడు మురళీకాంత్ దేవసోత్ మాట్లాడుతూ: ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కథను నాని అన్నకు చెప్పిన వెంటనే ‘చేద్దాం’ అని చెప్పడంతో ఈ ప్రయాణం మొదలైంది. అప్పటి నుంచి అన్నీ చాలా అందంగా జరుగుతున్నాయి. నితిన్ అన్న ఈ సినిమాలో భాగం కావడం నా కల నిజమైనట్టే. అదే సమయంలో బాధ్యత కూడా మరింత పెరిగింది. మా బెస్ట్ ఇవ్వడానికి మేమంతా కట్టుబడి ఉన్నాం. త్వరలో షూటింగ్ ప్రారంభించి వీలైనంత త్వరగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. ఈ సినిమా అందరినీ అలరించి, ఇందులో పనిచేసిన ప్రతి ఒక్కరికీ గుర్తుండిపోయే చిత్రంగా నిలవాలని కోరుకుంటున్నాను.”
నిర్మాత దీప్తి గంటా మాట్లాడుతూ: కొన్ని కథలు విన్న వెంటనే ఇది ప్రత్యేకమైన సినిమా అవుతుంది’ అనే ఫీలింగ్ వస్తుంది. మురళీ ఈ కథ చెప్పినప్పుడు నాకు అదే అనిపించింది. నాని కూడా ఖచ్చితంగా ఒప్పుకుంటారని నమ్మాను. ‘కోర్ట్’ తర్వాత ఎన్నో కథలు విన్నాం. కానీ మొదటిసారి ఈ కథ విన్నప్పుడు మాత్రమే ఆ బలమైన నమ్మకం కలిగింది. ఇది అద్భుతమైన స్క్రిప్ట్. మా కృష్ణ పాత్ర కోసం సరైన హీరోని వెతుకుతున్న సమయంలో ‘నితిన్ అన్నను అడుగుదామా’ అని నాని సూచించారు. అనౌన్స్మెంట్ వీడియో షూట్ చేసిన తర్వాత ఆ లుక్‌లో నితిన్‌ను చూసిన క్షణమే ఆయనే మా కృష్ణ అని ఫిక్స్ అయిపోయాం. ఆ పాత్రకు ఆయన పర్ఫెక్ట్గా సరిపోయారు. ఈ ప్రయాణాన్ని మీరంతా ఆస్వాదించే రోజు కోసం ఎదురుచూస్తున్నాను.”
సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ మాట్లాడుతూ: నాని గారి సమర్పణలో ఇది నా మూడో సినిమా. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. దీప్తి గారి నిర్మాణ సంస్థతో మరోసారి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే నితిన్ గారి సినిమాకు సంగీతం అందించడం కూడా చాలా సంతోషంగా ఉంది. మురళీ అద్భుతమైన కథ రాశారు. ఆ కథలోని భావోద్వేగాలను మరింత బలంగా ప్రేక్షకులకు చేరేలా నా వంతు అత్యుత్తమ సంగీతాన్ని అందించడానికి ప్రయత్నిస్తాను.”
ఈ చిత్రానికి జోమన్ టి. జాన్ ISC సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, విజయ్ బుల్గానిన్ సంగీతం సమకూరుస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా, సృజన అడుసుమిల్లి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.
ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్న ‘అలియాస్ రుక్మిణి’ చిత్రం రెగ్యులర్ షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభం కానుంది.
తారాగణం: నితిన్
సాంకేతిక సిబ్బంది:
సమర్పణ: నేచురల్ స్టార్ నాని
ప్రొడక్షన్ బ్యానర్: యూనానిమస్ ప్రొడక్షన్స్
రచన & దర్శకత్వం: మురళీ కాంత్ దేవసోత్
నిర్మాత: దీప్తి గంటా
సినిమాటోగ్రఫీ: జోమోన్ T. జాన్ ISC
సంగీతం: విజయ్ బుల్గానిన్
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
ఎడిటర్: సృజన అడుసుమిల్లి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ప్రశాంత్ మండవ
కాస్ట్యూమ్ డిజైనర్: రేఖ బొగ్గర్రపు
పబ్లిసిటీ డిజైనర్: భరణిధరన్
మార్కెటింగ్: ఫస్ట్ షో
PRO: వంశీ-శేఖర్
